S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

07/18/2018 - 20:14

డీజే చిత్రంతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది పూజాహెగ్డే అంతకుముందు ముకుంద, ఒక లైలాకోసం చిత్రాలతో రానంత ప్రచారం ఈ ఒక్క సినిమాతో వచ్చింది. బాలీవుడ్‌లో హృతిక్ సరసన నటించిన మొహంజోదారో తేలేని కొత్త ఇమేజ్‌ని డీజే తెచ్చింది ఈ ముంబై భామకు. అందుకే ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ కెరీర్‌ని ఛాలెంజింగ్‌గా తీసుకుని దూసుకుపోతోంది. ప్రస్తుతం బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన సాక్ష్యం చిత్రంలో నటిస్తోంది.

07/18/2018 - 20:12

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కార్’చిత్రంలో నటిస్తున్నాడు. పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలకానుంది. ఈ చిత్రం తరువాత విజయ్ తన 63వ చిత్రాన్ని యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో చేయనున్నాడు.

07/17/2018 - 19:44

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సంచలన విజయం సాధించి బాలయ్య కెరీర్‌లో నిలిచిపోయాయి. బాలయ్యలోని మాస్ ఎమోషన్స్‌ని కరెక్ట్‌గా ప్రజెంట్ చేసి సంచలన విజయం అందుకున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే హ్యాట్రిక్ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయింది.

07/17/2018 - 19:42

బాహుబలి, అరుంధతి లాంటి సినిమాలతో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ అనుష్క ప్రధాన పాత్రలో మరో సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. భిన్నమైన సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే అనుష్కతో చర్చలు జరిపి ఆమెతో ఒప్పించాడు దర్శకుడు. అయితే ఈ సినిమాలో మరో కీలకపాత్రకోసం హీరో నానిని ఎంపిక చేశారట.

07/17/2018 - 19:40

గత ఏడాది వరుణ్‌తేజ్, సాయిపల్లవిలు జంటగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం ‘్ఫదా’. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం సుమారు 40 కోట్ల కలెక్షన్స్‌ను సాధించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత శేఖర్‌కమ్ముల ఇంతవరకు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు. సినిమా హిట్ అయినా కూడా ఏడాదిగా ఎదురుచూస్తున్న ఈ దర్శకుడికి తాజాగా హీరో దొరికాడట. అయితే ఆయన తెలుగు హీరో కాదు.

07/17/2018 - 19:36

తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంతో దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మోహినిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో మోహినిగా ఈ చిత్రం తెరకెక్కింది. అదే టైటిల్‌తో తెలుగులోకూడా రానుంది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మిపిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు.

07/17/2018 - 19:34

వరుసగా విజయవంతమైన చిత్రాలు అందించడం అంటే ఆషామాషీ కాదు. పైగా, కేవలం కమర్షియల్ హిట్ చిత్రాలుగా మాత్రమేకాకుండా, ప్రేక్షకుల హృదయాలను కూడా తాకే చిత్రాలుగా పేరుతెచ్చుకోవడం అంటే చిన్న విషయంకాదు. ‘ప్రేమిస్తే’నుంచి ‘శంభోశంకర’ మూవీ వరకు సురేష్ కొండేటి అందించిన చిత్రాలూ ఈ కోవకే వస్తాయి.

07/17/2018 - 19:32

నిఖిల్ నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ముద్ర’ టి.ఎస్.సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మొదటిసారి నిఖిల్ సరసన లావణ్యత్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో నిఖిల్, లావణ్య త్రిపాఠిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

07/17/2018 - 20:46

ప్రముఖ సంగీత దర్శకులు చక్రవర్తి మనవడు, శ్రీ తనయుడు రాజేష్ శ్రీ చక్రవర్తిని హీరోగా పరిచయం చేస్తూ సాయి హరీశ్వర ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘శివకాశీపురం’. హరీష్ వట్టికూటి దర్శకత్వంలో మోహన్‌బాబు పులిమామిడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది.

07/17/2018 - 19:26

కార్తి, సయేషా సైగల్ జంటగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్య, మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాతలుగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చినబాబు’. ఈ సినిమా ఈనెల 13న విడుదలైంది.

Pages