S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/30/2018 - 21:04

సాత్విక్ ఈశ్వర్, అక్షిత, ప్రత్యూష్, అర్షిత ప్రధాన పాత్రల్లో ప్రభాస్ దర్శకత్వంలో మహేష్ కన్న నిర్మించిన చిత్రం ‘సత్యా గ్యాంగ్’. చిత్రీకరణ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా నిర్మాత వినోద్‌ఖన్నా వివరాలు తెలియజేస్తూ- క్వాలిటీ కోసం 16 నెలలపాటు శ్రమించి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రీకరించాం.

03/30/2018 - 21:03

దక్షిణాదిలో హీరోయిన్‌గా ఆశించినస్థాయిలో కమర్షియల్ విజయాలు అందుకోలేక నిరాశగా వున్న తాప్సి ఎప్పుడైతే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటినుంచే ఆమె జోరు పెరిగింది. పింక్, షబానా చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సి, జుడువా-2 చిత్రంతో గ్లామర్ హీరోయిన్‌గా బికినీలోనూ షాకిచ్చింది. దాంతో ఈ అమ్మడికి తెగ అవకాశాలు వస్తున్నాయట.

03/30/2018 - 21:02

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ శృతిహాసన్ గత కొంతకాలంగా ఏ సినిమాకు ఓకె చెప్పడంలేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు అవకాశాలు వస్తున్నా కూడా ఎలాంటి అంగీకారం తెల్పడంలేదట. ఆమె తండ్రి కమల్‌హాసన్ తెరకెక్కించిన శభాష్ నాయుడు చిత్రంలో మాత్రమే నటించింది. అయితే శృతిహాసన్ ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే వుందని, బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తేనే ఓకె చెబుతుందట.

03/29/2018 - 21:19

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత విశేషాలతో తెరకెక్కుతున్న ‘ఎన్టీఆర్’ చిత్రం షూటింగ్ గురువారం ప్రారంభమైంది. నాచారంలోని రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ దుర్యోధనుడి అవతారంలో వచ్చి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నారు.

03/29/2018 - 21:16

క్రేజీ హీరోయిన్‌గా తమిళంలో మంచి పాపులారిటీ సాధించి స్టార్ హీరోలకు ధీటుగా కెరీర్‌లో దూసుకుపోతున్నది నయనతార. ఆమెతో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంటున్న నయనతార, తాజాగా మరోసారి సూపర్‌స్టార్ రజనీ సరసన జోడీ కట్టేందుకు సిద్ధమైంది.

03/29/2018 - 21:14

రామ్‌చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ- రంగస్థలం శుక్రవారం భారీగా విడుదలకు సిద్ధమైంది.

03/29/2018 - 21:12

ఎస్.ఎన్.ఆర్ట్ క్రియేషన్స్ సమర్పణలో ఎస్.ఎన్.చిన్న స్వీయ పర్యవేక్షణలో ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే జేమ్స్ ది టాలెంట్ హంట్ రియాలిటీ షో ఆల్బం హైదరాబాద్‌లో విడుదల చేశారు. తెలంగాణ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ ఆల్బంను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- జేమ్స్ షోకు సంబంధించిన పాటలు బాగున్నాయి. సంగీతం అందించిన రాజ్‌కిరణ్ మంచి సంగీతాన్ని ఇచ్చాడు.

03/29/2018 - 21:10

నేను ఆరాధించే పవన్‌కళ్యాణ్ నాతో సినిమా నిర్మించడమే గొప్ప అనుభూతి అని అంటున్నాడు యువ హీరో నితిన్. జయం చిత్రంతో హీరోగా కెరీర్ మొదలుపెట్టి అటుపై వరుస సినిమాలతో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌లో ఎత్తుపల్లాలను చవిచూసి తనదైన ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. తాజాగా ఆయన చల్‌మోహన్‌రంగా అంటూ వస్తున్నాడు.

03/28/2018 - 21:19

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ పతాకంపై మెగాప్రొడ్యూసర్ సి.అశ్వనీదత్, టి.శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నిర్మిస్తున్న మల్టీస్టారర్ ఉగాది (మార్చి 18) నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో మియాపూర్ స్టేషన్‌లో మెట్రోట్రైన్‌లో కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు.

03/28/2018 - 21:17

ఈమధ్య స్టార్ హీరోయిన్స్ కూడా సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నర్తిస్తూ మరింత క్రేజ్ తెచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ కోసం ఒకప్పుడు ప్రత్యేకంగా నటీమణులు ఉండేవారు. రోజురోజుకూ స్టార్ హీరోయినే్ల ఆ క్రేజ్‌ను వదులుకోవడానికి ఇష్టంలేక ఐటెం గాళ్స్‌గా మారిపోతున్నారు. బాలీవుడ్‌లో అయితే ఈ పాటలంటే ఓ రేంజ్‌లో క్రేజ్ వుంది.

Pages