S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/26/2018 - 21:11

కృష్ణగాడి వీర ప్రేమగాథ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెహరీన్ మొదటి చిత్రంతోనే ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె పలు అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు పట్టేస్తున్న మెహరీన్, గ్లామరే కాదు నటిగా కూడా నిరూపించుకుంది. తాజాగా వరుణ్‌తేజ్ సరసన హీరోయిన్‌గా ఎంపికైందట.

03/25/2018 - 21:10

రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘రాజుగాడు’. సంజనారెడ్డి దర్శకురాలిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రాజ్‌తరుణ్ సరసన అమైరా దస్తూర్ కథానాయికగా నటిస్తోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై విశేషమైన ఆదరణ చూరగొనడంతోపాటు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది.

03/25/2018 - 21:08

సీనియర్ నటీమణి సావిత్రి జీవిత కథతో మహానటి చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ లీడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు కూడా కనిపిస్తుండడం విశేషం. ముఖ్యంగా సమంత మరో ముఖ్యపాత్రలో కన్పిస్తుందట. అయితే ఈ చిత్రంలో ఆమె పాత్ర నటి జమున పాత్ర అని వార్తలు వస్తున్నాయి.

03/25/2018 - 21:07

పైసావసూల్ సినిమాతో తీవ్రంగా నిరాశపరిచిన బాలయ్య వెంటనే జైసింహ సినిమాతో ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. ఆ సినిమా సంక్రాంతి రేస్‌లో మంచి వసూళ్లను అందుకొని కమర్షియల్ హిట్ కొట్టేసింది. కోలీవుడ్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆ సినిమాకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు పెద్దగా విజయాలు అందుకోని ఆ దర్శకుడు బాలకృష్ణతో చేసి ఎట్టకేలకు సక్సెస్ చూశాడు.

03/25/2018 - 20:58

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ ఈమధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. దాంతో ఈమధ్య అవకాశాలు కూడా తగ్గాయి. దాంతో మళ్లీ కమెడియన్‌గా సిద్ధమయ్యాడు. ఇప్పటికే శ్రీనువైట్ల, త్రివిక్రమ్, సురేందర్‌రెడ్డి సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తున్న సునీల్‌కు హీరోగా మరో అవకాశం వచ్చింది. సునీల్‌కు పూలరంగడు లాంటి సూపర్‌హిట్ అందించిన వీరభద్రం దర్శకత్వంలో ఈ సినిమా చేయనున్నాడు. సునీల్‌కు కథ చెప్పి ఒప్పించాడట.

03/25/2018 - 20:55

హీరో కళ్యాణ్‌రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఎంఎల్‌ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన త్వరలో మే 25న ‘నా నువ్వే’ సినిమాతో అలరించబోతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగా కళ్యాణ్‌రామ్ మరో సినిమాకు ఓకె చెప్పాడు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఇదివరకే ఒక సినిమాను ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

03/25/2018 - 20:52

కె.వరల్డ్ మూవీస్ బ్యానర్‌పై రుద్రారపు సంపత్ దర్శకత్వంలో బిష్ణు, హిమాంశి కురానా, అపర్ణశర్మ హీరోహీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘ఏక్’. బీయింగ్ హ్యూమన్ అనేది ఉపశీర్షిక. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.

03/25/2018 - 20:52

లక్ష్య ప్రొడక్షన్స్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీస్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘2స్టేట్స్’. చేతన్ భగత్ రాసిన నవల ‘2స్టేట్స్’ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో అడివిశేష్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రెబల్‌స్టార్ కృష్ణంరాజు కెమెరా స్విచ్చాన్ చేయగా ఎస్.ఎస్.రాజవౌళి క్లాప్ కొట్టారు.

03/25/2018 - 20:49

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సొట్టబుగ్గల తాప్సీకి ఇక్కడ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసి రాలేదు. దాంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ చేసిన రెండు మూడు సినిమాలతో నటిగా ఇమేజ్ తెచ్చుకుంది కానీ గ్లామర్ హీరోయిన్‌గా మాత్రం ఆకట్టుకోలేదు. దాంతో మళ్లీ సౌత్‌లోనే తనకు నచ్చిన గ్లామర్ పాత్రల్లో చేయాలని రీఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా ఈమెకు అభిమానుల క్యూ పెరిగిపోతోందట.

03/25/2018 - 20:47

తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన నేపథ్యంలో (తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిఎఫ్‌జెఏ) సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా త్వరలోనే ఫిలిం జర్నలిస్టులతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.

Pages