S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

03/23/2018 - 20:24

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న భరత్ అనే నేను చిత్రం స్పెయిన్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్‌లో ప్రకంపనాలు సృష్టిస్తోంది.

03/23/2018 - 20:22

టాలీవుడ్‌లో ఓ అరుదైన కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రానికి సన్నాహాలు మొదలైన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత రాజవౌళి దర్శకత్వంలో రూపొందే ఈ మల్టీస్టారర్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. అసలుసిసలైన మల్టీస్టారర్‌గా తెరకెక్కే ఈ సినిమా గురించి ఎప్పుడైతే రాజవౌళి సోషల్ మీడియాలో ప్రకటించారో అప్పటినుంచీ ఈ సినిమాపై రకరకాల ఊహాగానాలు జోరందుకున్నాయి.

03/23/2018 - 20:20

తనను అభిమానించే అభిమానులకోసం హీరోలు ఎన్నో కార్యక్రమాలు చేయడం తన అభిమానులను ఆనందపరచడం ముఖ్యోద్దేశ్యంగా భావిస్తారు హీరోలు. అలాగే టాలీవుడ్‌లో కూడా పవన్‌కళ్యాణ్ అంటే ఎంత క్రేజో అందరికీ తెలుసు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్‌లో వుంటుంది. సాధారణ అభిమానులతోపాటు సినిమా హీరోలు కూడా ఆయనకు అభిమానులుగా మారిపోయినవారున్నారు. తాజాగా ఈ లిస్టులో మొదటగా చెప్పుకోవాల్సింది నితిన్.

03/23/2018 - 20:18

రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ చిత్రం ఈనెల 30న భారీగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. క్రేజీ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా 1980 నేపథ్యంలోని కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ న్యూలుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

03/23/2018 - 20:16

నాగశౌర్య, రష్మిక జంటగా వెంకీ కుడుములను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ‘్ఛలో’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ శుక్రవారంతో 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ- సినిమా ప్రారంభం నుండి సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.

03/23/2018 - 20:13

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో నాని ప్రస్తుతం ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. మేర్లపాక గాంధి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈనెల 31న ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో నాని చిత్తూరుకు చెందిన పల్లెటూరు యువకుడిగా, ఎన్‌ఆర్‌ఐగా రెండు పాత్రల్లో కన్పించనున్నాడు.

03/23/2018 - 20:11

ఈమధ్య దక్షిణాదిలో హారర్ సినిమాల హవా ఓ రేంజ్‌లో ఉంది. ఇప్పటికే ఈ నేపథ్యంలో పలు చిత్రాలు వచ్చాయి, వస్తూనే వున్నాయి. ఈ తరహా సినిమాల్లో నటించేందుకు స్టార్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపిస్తుండడంతో దర్శక నిర్మాతలు హారర్ నేపథ్యంలో సినిమాలు తీయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాల్ని అందుకుంటున్నాయి హారర్ సినిమాలు.

03/23/2018 - 20:09

ప్రస్తుతం సినిమాల్లో హీరోయిన్ల వరుస మారుతోంది. ఇపుడు ఏ సినిమాలో చూసినా హీరోయిన్ల గ్లామరే ప్రధానాకర్షణగా మారింది. అందుకనే హీరోయిన్లు కూడా గ్లామర్ కోసం ప్రత్యేకంగా ముస్తాబవుతున్నారు. ఇక నటన విషయం గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పనిలేదు. హీరోయిన్ అంటే ఇపుడు అంతా గ్లామరే. కానీ నటిగా కూడా పేరు తెచ్చుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తూనే వున్నారు.

03/22/2018 - 20:21

అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం నేటినుంచి అమెరికాలో పాట చిత్రీకరణ జరుపుతోంది. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలోని ఓ రొమాంటిక్ పాటను హీరో హీరోయిన్లపై తెరకెక్కిస్తారట. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై ఓ రేంజ్‌లో సంచలనం సృష్టించింది.

03/22/2018 - 20:19

మహానటిగా మంచి గుర్తింపుతెచ్చుకున్న సీనియర్ నటి సావిత్రి జీవిత కథతో ‘మహానటి ’ పేరుతో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి.

Pages