S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/16/2016 - 23:07

కొంతకాలంగా టాలీవుడ్‌లో వస్తున్న ఓ కొత్త సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్న నటుడు కోట శ్రీనివాసరావు తాజాగా మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కారెక్టర్ ఆర్టిస్టులుగా తెలుగువాళ్ళు పనికిరారా?

09/16/2016 - 23:06

ఇటీవల విడుదలైన మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ అనుకున్నంత విజయం సాధించలేకపోయింది. అయితే ఆ ప్రభావం మహేష్‌పై ఏ మాత్రం పనిచేయలేదు. ఎప్పటికప్పుడు కథలు కొత్త కోణాల్లో ఎంచుకునే మహేష్‌బాబు కోసం దర్శకులు కథలను సిద్ధం చేయడంలో తలమునకలవుతున్నారు. కొత్తదనం ఎక్కడ కనిపించినా తన హీరోయిజానికి ప్లస్‌గా మారుతుందనుకుంటే ఆ కథలలో నటించడానికి సిద్ధమవుతున్నాడు.

09/16/2016 - 09:17

అశోక్‌చంద్ర, రాజా సూర్యవంశీ ప్రధాన తారాగణంగా శ్రీ శ్రీనివాసా ఫిలింస్ పతాకంపై టి.కరణ్‌రాజ్ దర్శకత్వంలో ఎస్.పి.నాయుడు రూపొందిస్తున్న చిత్రం ‘ఇదో ప్రేమలోకం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

09/16/2016 - 09:15

భీమవరం టాకీస్ పతాకంపై మక్కెన్ రంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కాల్‌మనీ’. కృష్ణుడు, అంజనీకుమార్, సందీప్తి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడారు.

09/16/2016 - 09:13

పవన్‌కల్యాణ్-దాసరిల చిత్రం ప్రకటించి చాలాకాలం జరిగిపోయింది. కానీ ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. కానీ దీనిపై మీడియాలో రోజుకో వార్త పుట్టుకొస్తోంది. తాజాగా దాసరి తారకప్రభు ఫిలిమ్స్‌పై ‘బోస్’ అనే టైటిల్‌ని రిజిస్టర్ చేయించారని సమాచారం. ఈ టైటిల్ పవన్ కోసమే అంటూ ప్రచారం ఊపందుకుంది. దాసరి నారాయణరావు తన బ్యానర్‌లో సినిమా చేసి చాలా కాలం అయింది.

09/16/2016 - 09:12

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో అత్యధిక ఆదాయం పొందుతున్న బుల్లితెర నటుల్లో ప్రియాంకకు ఎనిమిదో స్థానం లభించింది. ప్రఖ్యాత మ్యాగజైన్ ఫోర్బ్స్ పదిహేనుమంది నటీమణుల పేర్లతో ఈ జాబితాను విడుదల చేసింది. అత్యధిక పారితోషికం (ఆదాయం) పొందుతున్న సినీతారల జాబితాలో బాలీవుడ్ నటి దీపికకు పదో స్థానం లభించిన విషయం తెలిసిందే.

09/16/2016 - 09:11

ఈమధ్యే హీరో నాని ‘ఇండస్ట్రీకి హీరోయిన్లను సప్లయ్ చేస్తున్నా’ అని ‘మజ్ను’ ఆడియో వేడుకలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. నాని వరుసగా చేస్తున్న సినిమాల్లో కొత్త హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నాడు. ఇక ఆ హీరోయిన్స్‌కు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ దక్కుతోంది. ‘మజ్ను’ సినిమాలో కూడా నాని ఇద్దరు హీరోయిన్స్‌ని పరిచయం చేయడం విశేషం. ఇక అసలు విషయం ఏమిటంటే..

09/16/2016 - 09:11

అక్కినేని నాగచైతన్య తరువాతి సినిమా ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ నెలలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఇందులో నాగచైతన్య సరసన రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈమెతోపాటు మరో హీరోయిన్‌తో కూడా చైతు రొమాన్స్ చేయనున్నారని తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు వరుస హిట్లతో యంగ్ హీరోలకి లక్కీ హిరోయిన్‌గా మారిన లావణ్య త్రిపాఠి.

09/16/2016 - 09:10

మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఇప్పటికే ‘సుప్రీం, ‘తిక్క’ వంటి చిత్రాలతో బాక్సాఫీసును పలకరించాడు. ఇప్పుడు మరింత జోరు పెంచాడు. తేజ్ త్వరలో మరో రెండు సినిమాల షూటింగ్ మొదలుపెట్టనున్నాడు. ఇందులో ఒకటి కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ కాగా, మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న కొత్త చిత్రం. తేజ్ ఈనెల 19 నుండి నక్షత్రం షూటింగ్‌లో పాల్గొంటాడు.

09/16/2016 - 09:10

‘నిర్మలా కానె్వంట్ చిత్రం షూటింగ్ జరిగేటప్పుడు నేను రెండుసార్లు మాత్రమే వెళ్లాను. రోషన్ ఎక్కడా టెన్షన్ లేకుండా కూల్‌గా చేస్తున్నాడు. ఇక ఆ తరువాత షూటింగ్‌కు వెళ్లలేదు. ఏది చేసినా నువ్వే పూర్తి స్వేచ్చతో నిర్ణయం తీసుకోమని చెప్పాం’ అని నటుడు శ్రీకాంత్ తెలిపారు.

Pages