S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/20/2016 - 21:04

తేజ కాకుమాను, రేష్మిగౌతమ్, ధన్య బాలకృష్ణన్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం ‘తను వచ్చెనంట’. అచ్యుత్ ఆర్ట్స్ పతాకంపై చంద్రశేఖర్ ఆజాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ కాచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈనెలాఖరుకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది.

09/20/2016 - 21:02

‘టిప్పు’, ‘పడేసావే’ చిత్రాలతో హీరోగా గుర్తింపు పొందిన కార్తీక్‌రాజు తాజాగా మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. గౌతమ్ దర్శకుడిగా రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వచ్చే నెల 11న ప్రారంభం కానుంది.

09/20/2016 - 21:00

బిచ్చగాడుగా తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోని తాజా చిత్రం ‘సైతాన్’కు సంబంధించిన టీజర్‌ను సినిమా యూనిట్ విడుదల చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో విభిన్నమైన పాత్రలో విజయ్ ఆంటోని కన్పించనున్నాడు. విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహిస్తున్నారు.

09/20/2016 - 20:59

హీరోయిన్లకి తరచుగా ఎదురయ్యే అతిక్లిష్టమైన ప్రశ్నలేంటో తెలుసా? మీకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో కలిసి సినిమా చేయాలనుంది? అనేవి. ఆ ప్రశ్నలు అడగ్గానే హీరోయిన్లు తలకొట్టుకొంటుంటారు. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేదే వీలైనంతమంది కథానాయకులతో కలిసి నటించాలని. మరి ప్రత్యేకంగా ఏ హీరో ఇష్టం? ఎవరితో కలిసి నటించాలనుందని అడిగితే వాళ్లుమాత్రం ఏమని ఆన్సర్ ఇస్తారు?

09/20/2016 - 20:48

పెళ్ళయ్యాక కథానాయికల తీరు మారుతుంది. అంతకుముందులా గ్లామర్‌గా కనిపించలేరు. ఎవరేమనుకొంటారో అనే ఫీలింగ్. పాత్రల విషయంలోనూ కొన్ని షరతులు విధించాల్సి వస్తుంటుంది. ఎక్స్‌పోజింగ్‌కి దూరంగా హుందాతనంతో కూడిన పాత్రలు చేయాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. పెళ్ళయ్యాక అమలాపాల్ ప్రయాణం కూడా ఇంచుమించు అలాగే సాగింది. ఎక్కడా హద్దులు దాటి కనిపించినట్టు అనిపించలేదు.

09/19/2016 - 01:03

మహేష్‌బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయికగా ఎంపికైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో ఆమె పాల్గొంటోంది. అయితే, ఈ చిత్రంలో మరో హీరోయిన్‌గా నయనతార నటించనున్నారని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలో నిజంలేదని మురగదాస్ తన ట్విట్టర్ ద్వారా తేల్చిచెప్పారు.

09/19/2016 - 02:28

నానిని ‘అష్టాచమ్మ’తో పరిశ్రమకు హీరోగా పరిచయం చేసి, అతని కెరీర్‌లో ‘జెంటిల్‌మన్’ వంటి మర్చిపోలేని హిట్ ఇచ్చిన దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి త్వరలో యంగ్ హీరో నాగచైతన్యతో కొత్త సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాన్ని ప్రము ఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మించనుంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే సంవత్సరం మొదలవుతుందని తెలుస్తోంది.

09/19/2016 - 01:04

ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు ప్రస్తుతం ‘లక్కున్నోడు’ చిత్రానికి పనిచేస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ నేటినుండి జరుపుకోనున్న ఈ చిత్రంతో తనకు మంచి గుర్తింపు వస్తుందని డైమండ్ రత్నబాబు తెలిపారు.

09/19/2016 - 00:56

దర్శకుడు జయంత్ సి.పరాంజి గతంలో అగ్రహీరోలతో చిత్రాలను రూపొందించేవాడు. ఇప్పుడు నూతన నటీనటులను పరిచయంచేస్తూ కొత్త టాలెంట్‌ను వెండితెరకు చవిచూపుతున్నాడు. అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన రవి గంటా హీరోగా కాళహస్తి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మరో హీరో నీలేష్ ఈటి, ఇజబెల్ కథానాయికగా ఇషాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘ఉగ్రం’ అనే మరో చిత్రాన్ని కూడా రూపొందిస్తున్నారు.

09/19/2016 - 00:54

‘అత్తారిల్లు’ సినిమా విడుదలైనప్పటినుండీ తమ యూనిట్ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఒక పాత్రను పెట్టారని, దానిని తొలగించాలంటూ బెదిరిస్తున్నారని చిత్ర దర్శకుడు అంజన్ కె. కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Pages