S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/07/2018 - 12:50

చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరీ ఆసుపత్రి వద్ద విషాధచాయలు అలుముకున్నాయి. కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించటంతో రోదనలతో వేలాది మంది కార్యకర్తలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. కావేరీ ఆసుపత్రి వద్ద పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు వెయ్యి మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో పలుచోట్ల పోలీసులను మోహరించారు.

08/07/2018 - 12:49

చెన్నై: మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఆర్ముగస్వామి కమిటీ ఎదుట అపోలో ఆసుపత్రి కాలేయ వైద్య నిపుణుడు కేఆర్ పళనిస్వామి, నర్సు అనూషా హాజరై సాక్ష్యమిచ్చారు. ఆసుపత్రిలో జయలలితకు అందించిన చికిత్సలు, ఆమెకు స్వీట్లు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చిన వైద్య అధికారులు గురించి పలు ప్రశ్నలు సంధించారు.

08/07/2018 - 04:54

తిరువనంతపురం, కసరగడ్: మన రాజ్యాంగంలో హింసకు తావు లేదని భారత రాష్ట్ర పతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కేరళలో సీపీఐ-ఎం యువ కార్యకర్తను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పొడిచి చంపిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ హింసను అడ్డుకోవడానికి పౌర సమాజాన్ని జాగృతం చేయాల్సిన బాధ్యత అన్ని పార్టీలపై ఉందని అన్నారు.

08/07/2018 - 03:35

న్యూఢిల్లీ, ఆగస్టు 6: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు తెలిపింది. సోమవారం రాజ్యసభలో జరిగిన సమావేశంలో పలువురు సభ్యులు మాట్లాడుతూ దేశంలో వెనుకబడిన తరగతుల జనాభా లెక్కల సేకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

08/07/2018 - 03:34

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ‘గడ్కరీగారూ.. మంచి ప్రశ్న వేశారు.. దేశ ప్రజలంతా అదే ప్రశ్న వేస్తున్నారు’ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీపై వ్యంగ్య బాణాలు సంధించారు. మహారాష్టల్రో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై గడ్కరీ శనివారం మాట్లాడుతూ ‘దేశంలో ఉద్యోగాల్లేవు.. రిజర్వేషన్ల పెంచినందువల్ల ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదు’ అని వ్యాఖ్యానించారు.

08/07/2018 - 03:33

న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో ముజఫర్, డియోరియా సంఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఎన్జీవోల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి, ఆశ్రమాల్లో ఉన్న బాలికల రక్షణకు సంబంధించి రాష్ట్రాలు ఒక ఏకీకృత విధానాన్ని అవలంబించాలని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకాగాంధీ రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.

08/07/2018 - 03:31

న్యూఢిల్లీ, ఆగస్టు 6: గోరక్షకుల పేరిట దేశంలో జరుగుతున్న హత్యాకాండపై పలు రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. మూక హత్యల నిరోధకానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వివిధ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు సోమవారం ధర్నా నిర్వహించారు. అమాయకులపై జరుగుతున్న దాడులను అరికట్టి, దోషులను కఠినంగా శిక్షించేందుకు చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.

08/07/2018 - 03:31

న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎస్సీ, ఎస్టీ (వేధింపుల నిరోధక) చట్టం 1989లో పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని సుప్రీంకోర్టు సవరించిన నేపథ్యంలో కొద్దిపాటి మార్పులు, చేర్పులతో రూపొందించిన బిల్లును లోక్‌సభలో గత శుక్రవారంనాడు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

08/07/2018 - 03:30

న్యూఢిల్లీ, ఆగస్టు 6: విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వరంగ సంస్థ నాల్కో ప్రతిపాదనలు సమర్పించినట్లు గనుల శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్ధీబాయ్ చౌదరి తెలిపారు.

08/07/2018 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలంగాణ రాష్ట్రంలో రైల్వేలైన్లను అభివృద్ధి చేయాలని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేవలం కొన్ని ప్రాంతాలకే రైల్వేలైన్లు ఉన్నాయని, మిగిలిన ప్రాంతాలకు కూడా వాటిని విస్తరింపజేయాలని కోరారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Pages