S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/08/2017 - 22:50

న్యూఢిల్లీ, నవంబర్ 8: బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ బుధవారం నాటికి 90వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా పలువురు కేంద్ర మంత్రులు అద్వానీ నివాసానికి వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బదిర విద్యార్థుల మధ్య బీజేపీ సీనియర్ నేత తన జన్మదినోత్సవం జరుపుకొన్నారు. ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘బర్త్‌డే గ్రీటింగ్స్ టు రెస్పెక్టెడ్ అద్వానీ జీ.

11/08/2017 - 04:18

అహ్మదాబాద్, నవంబర్ 7: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటరుకూ చేరువకావాలన్న లక్ష్యంతో ఆరు రోజుల పాటు జరిగే ‘గుజరాత్ గౌరవ్ మహా సంపర్క్ అభియాన్’ కార్యక్రమాన్ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం ఇక్కడ ప్రారంభించారు. రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు నేరుగా తెలిపేందుకు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని బీజేపీ నిర్ణయించింది.

11/08/2017 - 04:16

బాలాసోర్ (ఒడిశా), నవంబర్ 7: సుదీర్ఘ దూరం ప్రయాణించే నిర్భయ్ క్షిపణిని భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. 300 కేజీల వార్‌హెడ్స్‌ను మోసుకుపోగల ఈ క్షిపణిని స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఒడిశా తీరం చాందీపూర్‌లోని కాంప్లెక్-3 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఉదయం 11.20కి దీన్ని పరీక్షించినట్టు డిఆర్‌డివో అధికారులు వెల్లడించారు.

11/08/2017 - 04:15

చెన్నై, నవంబర్ 7: తాను చేసిన వ్యాఖ్యలపై కొన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ప్రముఖ నటుడు కమల్ హసన్ నష్టనివారణ చర్యలకు ఉపక్రమిస్తూ, హిందువులను కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదని మంగళవారం ప్రకటించారు. మతం పేరిట కొందరు హింసకు పాల్పడడాన్ని మాత్రమే తాను వ్యతిరేకస్తున్నానని తన 63వ జన్మదినం సందర్భంగా విలేఖరుల సమావేశంలో ఆయన తెలిపారు.

11/08/2017 - 04:13

న్యూఢిల్లీ, నవంబర్ 7: వర్తక, వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపర్చుకునేలా భారత్-బెల్జియంల మధ్య మంగళవారం ద్వైపాక్షిక చర్యలు సాగాయి. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆహ్వానం మేరకు వారంపాటు భారత్ పర్యటనకు వచ్చిన బెల్జియం రాజు ఫిలిప్పి, మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.

11/08/2017 - 04:10

న్యూఢిల్లీ, నవంబర్ 7: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరడంతో ‘ఆరోగ్య అత్యవసర పరిస్థితి’ (హెల్త్ ఎమర్జెన్సీ)ని ప్రకటిస్తున్నట్టు ‘ఇండియన్ మెడికల్ అసోసియేషన్’ (ఐఎంఏ) మంగళవారం తెలిపింది. గాలిలో మోతాదుకు మించి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఉన్నట్లు ఐఎంఏ ప్రతినిధులు తెలిపారు.

11/08/2017 - 04:07

న్యూఢిల్లీ, నవంబర్ 7: గుజరాత్ శాసనసభ ఎన్నికలు పూర్తిగా కులమయమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీదారులైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కుల రాజకీయాలకు తెరతీయడంతో ఎన్నికల ప్రచారం కూడా కులాల వారీగా జరుగుతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కులతత్వం చోటుచేసుకున్నదని విశే్లషకులు చెబుతున్నారు.

11/08/2017 - 04:06

కన్యాకుమారి, నవంబర్ 7: డిఎంకె అధినేత కరుణానిధిని ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోవడం వెనక ఎలాంటి రాజకీయాలు లేవని బిజెపి సీనియర్ నేత ఒకరు స్పష్టం చేశారు. ‘చెన్నైలో కరుణానిధిని మోదీ మర్యాద పూర్వకంగానే కలిశారు. అంతేతప్ప ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు’ అని మంగళవారం ఆయన పేర్కొన్నారు. దేశ ప్రధానిగా అస్వస్థతగా ఉన్న పార్టీ అధినేతను కలవడం కరుణ పట్ల ఆయనకున్న గౌరవానికి గుర్తుగా చూడాలని అన్నారు.

11/08/2017 - 04:05

అహ్మదాబాద్, నవంబర్ 7: గుజరాత్‌లోని ఖేడా జిల్లా కథాల్ గ్రామం వద్ద ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి దాటాక లారీని కారు ఢీకొన్న ఘటనలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ తొమ్మిది మందిని ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం మేరకు మధ్యప్రదేశ్‌కు చెందినవారు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.
మరో రెండుచోట్ల పది మంది మృతి

11/08/2017 - 03:52

న్యూఢిల్లీ, నవంబర్ 7: పనిచేసే చోట ఉద్యోగినులు లైంగిక వేధింపులను ఎదుర్కొంటే ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేందుకు ‘షి-బాక్స్’ (సెక్సువల్ హెరాస్‌మెంట్ ఎలక్ట్రానిక్ బాక్స్) పేరిట ప్రత్యేక పోర్టల్‌ను కేంద్ర స్ర్తి, శిశుసంక్షేమ మంత్రి మేనకా గాంధీ మంగళవారం ప్రారంభించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ ఈ పోర్టల్‌ను నిర్వహిస్తుంది.

Pages