S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/12/2017 - 01:20

గాంధీనగర్/ ప్రాంటిజ్ (గుజరాత్), నవంబర్ 11: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ప్రసిద్ధిగాంచిన అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించడం ద్వారా ఉత్తర గుజరాత్‌లో తన అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

11/12/2017 - 01:18

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎన్.డి. తివారీ ఆరోగ్యం విషమంగానే ఉంది. కొద్ది నెలలుగా చికిత్స పొందుతున్న ఆయనకు వెంటిలేటర్ ద్వారానే ఆక్సిజన్ అందిస్తున్నారు. సెప్టెంబర్ 20న గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని మాక్క్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్చారు. వెంటిలేటర్ అవసరం లేకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.

11/11/2017 - 02:43

చెన్నై, నవంబర్ 10: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కానుంది. తాను కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రముఖ నటుడు కమల్ హసన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే బాటలో తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పయనిస్తున్నారు. తన జన్మదినోత్సవం సందర్భంగా డిసెంబర్ 12న కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ ఓ ప్రకటన చేస్తారని తెలిసింది. ఏదైనా పార్టీలో చేరడమా చేరవచ్చని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

11/11/2017 - 02:39

న్యూఢిల్లీ, నవంబర్ 10: దేశంలో జడలు విప్పుతున్న తీవ్రవాద, సైబర్ నేరాల నియంత్రణకు కేంద్ర హోంశాఖ కీలక చర్యలు చేపట్టింది. ఉగ్రవాద మరియు తీవ్రవాద నిరోధక విభాగం (సిటిసిఆర్), సైబర్, సమచార భద్రతా (సిఐఎస్) విభాగాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. దేశంలో తీవ్రవాద, ఉగ్రవాద నిరోధానికి చేపట్టాల్సిన వ్యూహాలను త్వరితగతిన సిద్ధం చేసి నివేదించాలని హోంమంత్రిత్వ శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.

11/11/2017 - 02:38

పాట్నా, నవంబర్ 10: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ శుక్రవారం ఇక్కడ తన చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర పూర్వే రాష్ట్రంలో తేజస్వి యాదవ్ నాయకత్వంలో తమ పార్టీ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇదివరకే పేర్కొన్నారు.

11/11/2017 - 02:36

న్యూఢిల్లీ, నవంబర్ 10: వచ్చేవారం నుంచి దేశ రాజధానిలో మళ్లీ అమలు చేయబోతున్న సరి-బేసి వాహన విధానాన్ని ఏ అధ్యయన ప్రాతిపదికన అమలు చేస్తున్నారో చెప్పాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది.

11/11/2017 - 02:35

న్యూఢిల్లీ, నవంబర్ 10: న్యాయమూర్తుల పేరు చెప్పి లంచాలు వసూలు చేశారన్న ఆరోపణలను సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో పరిగణించింది. ‘న్యాయ స్రవంతిని మలినం చేయాలని ఎవరు ప్రయత్నించినా తాము అనుమతించేది లేద’ని న్యాయమూర్తులు ఏకే సిక్రి, అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. ఎంతటివారైనా చట్టాన్ని అతిక్రమించలేరని, తీర్పులను అడ్డుకోలేరని వారు అన్నారు.

11/11/2017 - 02:35

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి ప్రవేశపరీక్షలను నిర్వహించేందుకు జాతీయ స్థాయి ఏజెన్సీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. తొలిదశలో సిబిఎస్‌ఇ ఎంట్రన్స్‌లన్నీ ఇక జాతీయ స్థాయి ఏజెన్సీ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఆ తర్వాత క్రమంగా ఇతర ప్రవేశ పరీక్షలన్నీ ఈ ఏజెన్సీ పరిధిలోకి వస్తాయని శుక్రవారం ఒక అధికార ప్రకటనలో తెలిపారు.

11/11/2017 - 02:34

న్యూఢిల్లీ, నవంబర్ 10: గుర్గావ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో విద్యార్థి అనుమానాస్పద మృతి కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ప్రద్యుమ్న ఠాకూర్ (8) అనే విద్యార్థి హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలన రేపింది. తొలుత బస్సు కండక్టర్ అశోక్‌కుమార్‌ను అనుమానించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. కేసును లోతుకంటూ విచారించగా సీనియర్ విద్యార్థే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడైంది.

11/11/2017 - 02:05

న్యూఢిల్లీ,నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈనెల 17న రెండు తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోం శాఖ ఉపసంఘం ఈ సమావేశాన్ని నిర్వహిస్తోంది.

Pages