S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/09/2017 - 01:22

శ్రీనగర్, నవంబర్ 8: చర్చల ద్వారానే కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వ యోచనమేరకు వేర్పాటువాదులతోనూ చర్చల ప్రక్రియ మొదలుపెడతానని ప్రత్యేక మధ్యవర్తిగా నియమితులైన దినేశ్వర్ శర్మ వెల్లడించారు. ఐదురోజుల కాశ్మీర్ పర్యటనలో భాగంగా దినేశ్వర శర్మ రెండు రోజులపాటు జమ్మూలో బసచేసి, గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, మరికొందరిని కలవనున్నారు.

11/09/2017 - 01:45

న్యూఢిల్లీ, నవంబర్ 8: నల్ల ధనం, అవినీతిపై ప్రజలు సాధించిన విజయంగా పెద్ద నోట్ల రద్దు తొలి వార్షికోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. పెద్దనోట్ల రద్దు మూలంగా 3.68 లక్షల కోట్ల నల్లధనం వివరాలు ప్రభుత్వ చేతికి అందాయని, నల్లధనం యజమానుల పేర్లు, చిరునామాలు చేతికి చిక్కాయన్నారు. 23 లక్షల బ్యాంకు ఖాతాలపై దర్యాప్తు జరుగుతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.

11/08/2017 - 23:06

న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడమే గాక, ఉపాధి కోల్పోయి ఆగ్రహంతో ఉన్నవారిని ‘మత విద్వేషం’ వైపు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. పెద్దనోట్లను రద్దు చేశాక ఏడాది పూర్తయిన సందర్భాన్ని ఆయన ఓ ‘విషాదం’గా అభివర్ణించారు.

11/08/2017 - 23:02

న్యూఢిల్లీ, నవంబర్ 8: ‘దేశ చరిత్రలోనే తొలిసారిగా చావుకు, బాధకు వేడుకలు జరుపుకోవడం’ విడ్డూరంగా ఉందని ఆరు వామపక్ష పార్టీలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం ఉత్సవాలను జరపడం పట్ల వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

11/08/2017 - 23:00

పాట్నా, నవంబర్ 8: నల్లధనాన్ని అధికారికంగా మార్చుకోవడానికి మాత్రమే ‘పెద్దనోట్ల రద్దు’ విధానం ఉపయోగపడిందని బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ వ్యాఖ్యానించారు. పెద్దనోట్లను రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా భాజపా ప్రభుత్వం ఉత్సవాలు జరపడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు.

11/08/2017 - 23:00

సిమ్లా, నవంబర్ 8: హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ సంగ్రామంలో కీలక ఘట్టానికి కొన్ని గంటల్లో తెరలేవనుంది. 68 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు ఎన్నికల యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. అధికారమే లక్ష్యంగా ప్రధాన పక్షాలు కాంగ్రెస్, బిజెపిలు హోరాహోరీ ప్రచారాన్ని పూర్తిచేసి, పోలింగ్ సంరంభానికి సన్నద్ధమయ్యాయి.

11/08/2017 - 22:59

న్యూఢిల్లీ, నవంబర్ 8: వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరడంతో దేశ రాజధాని దిల్లీ నగరంలో ‘పొల్యూషన్ ఎమర్జెన్సీ’ని ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు తీవ్రమైన పొగమంచు కారణంగా దారి కన్పించక వాహన చోదకులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

11/08/2017 - 22:54

న్యూఢిల్లీ, నవంబర్ 8: భూమీద జీవజాతుల ఆవిర్భావం ఎలా మొదలైంది అన్నదానిపై శతాబ్దాలుగా శాస్తవ్రేత్తలో ఎనలేని ఆసక్తి కొనసాగుతునే వస్తోంది. ముఖ్యంగా శాస్తవ్రిజ్ఞాన ప్రపంచం జీవజాతుల పరిణామ క్రమంపై అనునిత్యం ఏదో ఒక కొత్త అంశాన్ని వెలుగులోకి తెస్తునే ఉంది. ఇప్పటివరకూ ఇందుకు సంబంధించిన అధ్యయనాలు, అంచనాలకు భిన్నంగా జీవావిర్భావం, పరిణామ క్రమంపై శాస్తవ్రేత్తలు కొత్త అంశాన్ని కనిపెట్టారు.

11/08/2017 - 22:52

రాంచి, నవంబర్ 8: యోగా విద్యను బోధిస్తూ ప్రసిద్ధి పొందిన ఓ ముస్లిం బాలిక రఫియా నాజ్‌కు మత పెద్దలు ఫత్వా జారీచేశారు. ఏ ఒక్కరికి యోగాను బోధించవద్దని హెచ్చరించారు. ఈ విషయం జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబార్‌దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లడంతో కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

11/08/2017 - 22:51

భటిండా, నవంబర్ 8: పంజాబ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భుచోమండీ ప్రాంతంలో హైవే పక్క నిలబడి ఉన్న తొమ్మిది మందిపై లారీ దూసుకుపోయింది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారంతా యువకులే. కాలేజీ, కోచింగ్ సెంటర్లకు వెళ్తున్న బస్సు పాడైంది. దీంతో 14 మంది టీనేజర్లు మరో బస్సుకోసం భటిండా-చండీగఢ్ హైవేపక్కన నిలబడ్డారు. అదే సమయంలో అటుగా వస్తున్న లారీ ముందు ఓ కారును ఢీకొని తరువాత యువకులపైకి దూసుకొచ్చింది.

Pages