S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/13/2017 - 04:39

న్యూఢిల్లీ, నవంబర్ 12: అహింసా విధానాలను అవలంభించటం ద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చునని ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు ఉద్భోదించారు. అహింసా విశ్వభారతి 13వ స్థాపనోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వెంకయ్య ముఖ్యఅథితిగా హాజరయ్యారు.

11/13/2017 - 04:38

పాట్నా, నవంబర్ 12: దేశ ప్రజలను ఎన్నో అవస్థలకు గురిచేస్తున్న జీఎస్‌టీని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల ప్రజలు నేటికీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.

11/13/2017 - 04:35

లక్నో, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆదివారంనాడు లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప పత్రం’ను విడుదల చేశారు.

11/13/2017 - 04:44

*చిత్రకూట్ స్థానాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్

11/13/2017 - 01:17

త్రిశూర్, నవంబర్ 12: బెయిల్‌పై బయటికొచ్చిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యకు గురవ్వడం కేరళలో సంచలనం సృష్టించింది. త్రిశూర్ జిల్లా గురువయ్యూర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త పి ఆనంద్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూడేళ్ల క్రితం వామపక్ష కార్యకర్త కాశిమ్ హత్య కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్, ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యాడు.

11/12/2017 - 03:24

న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశ రాజధానిలో కాలుష్య నివారణకు ‘సరి-బేసి’ విధానాన్ని మళ్లీ అమలు చేయాలన్న నిర్ణయాన్ని ఢిల్లీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాస్తవానికి ఈ నెల 13 నుంచి అయిదు రోజుల పాటు ప్రైవేటు వాహనాలకు ‘సరి-బేసి’ విధానాన్ని అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు.

11/12/2017 - 03:23

జమ్మూ, నవంబర్ 11: భారత్ వత్తిళ్లకు పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. తమ చెరలో ఉన్న మాజీ నేవీ ఉద్యోగి కుల్‌భూషణ్ జాదవ్‌ను కలవడానికి అతడి భార్యకు అనుమతి లభించినట్టు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శనివారం వెల్లడించారు. గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల అభియోగంపై జాదవ్‌కు పాక్ సైనిక కోర్టు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో శిక్ష అమలును నిలిచిపోయింది.

11/12/2017 - 03:14

చెన్నై/కడలూరు, నవంబర్ 11: పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే అనుమానంతో జైలు జీవితం గడుపుతున్న ఏఐఏడీఎంకే నాయకురాలు వికె శశికళ, ఆమె బంధువుల ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు వరుసగా మూడోరోజు శనివారం కూడా దాడులు నిర్వహించారు. బెంగళూరు, హైదరాబాద్ మెట్రో నగరాలతో పాటు తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. గురువారం ప్రారంభించిన ఈ దాడులు మూడోరోజూ కొనసాగాయని ఒక ఐటీ అధికారి తెలిపారు.

11/12/2017 - 03:13

లక్నో, నవంబర్ 11: అభివృద్ధి పేరుతో ప్రజల్లో విద్వేష భావాన్ని పెంపొందించడంలో యుపి ప్రభుత్వం తనకు తానే సాటి అని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. సమాజాన్ని రెండుగా చీల్చడంలో బిజెపి నాయకులను మించినవారు లేరని ఆయన ఆరోపించారు. మా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని అన్నారు.

11/12/2017 - 03:25

న్యూఢిల్లీ, నవంబర్ 11: ఫిలిప్పీన్స్‌లో ఆదివారం నుంచి తాను జరపబోయే పర్యటన ‘ఆసియాన్’ (ఆగ్నేయాసియా దేశాల కూటమి)తో భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘ఆసియాన్’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఆదివారంనాడు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా చేరుకుంటారు.

Pages