S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2017 - 03:34

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మధ్యప్రదేశ్‌లోని ఉప ఎన్నిక జరుగనున్న భింద్‌లో ఎన్నికల అధికారులు వివిపిఎటి పనితీరును వివరించేందుకు నిర్వహించిన ప్రదర్శనలో ఏ పార్టీ ఎన్నికల చిహ్నం ఉన్న బటన్ నొక్కినప్పటికీ బిజెపి చిహ్నం ఉన్న చీటి మాత్రమే బయటకు వచ్చిందని మీడియాలో వచ్చిన వార్తలపై ఎన్నికల సంఘం స్పందించింది. ఈ మీడియా వార్తలపై సమగ్రమైన నివేదికను పంపించ వలసిందిగా జిల్లా ఎన్నికల అధికారిని ఆదేశించింది.

04/02/2017 - 03:30

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: గోవా ప్రజలను వంచించినందుకు వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు చెప్పవలసిందిగా ఆయన పారికర్‌కు సూచించారు. ‘పారికర్! మీ అధికార దాహానికి మీరు సిగ్గుపడాలి.

04/02/2017 - 03:29

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: చెన్నై, ఢిల్లీ నగరాల్లో మెట్రో బ్లడ్ బ్యాంకులు నెలకొల్పడంలో జరుగుతున్న జాప్యానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను పార్లమెంట్ స్థారుూసంఘం మందలించింది. మెట్రో బ్లడ్ బ్యాంకుల ఏర్పాటుకు ఉన్న అన్ని అడ్డంకులను వీలయినంత త్వరగా తొలగించాలని, తద్వారా ఈ పథకానికి కేటాయించిన నిధులు నిలిచిపోకుండా చూడాలని ఆదేశించింది.

04/02/2017 - 03:28

లక్నో, ఏప్రిల్ 1: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలై కోలుకోలేని దెబ్బతిన్న సమాజ్‌వాదీ పార్టీలో కుటుంబ కలహాలు సమసిపోలేదు. ఎన్నికల ముందూ పార్టీ చీఫ్ ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్‌ల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. తండ్రి నుంచి పార్టీని, ఎన్నికల గుర్తును అఖిలేష్ చేజిక్కుంచుకున్నారు. తరువాత జరిగిన పరిణామాలు అందరికీ తెలిసిందే.

04/02/2017 - 03:27

నాగ్‌పూర్, ఏప్రిల్ 1: దేశంలో 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు బోగస్ అని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితీన్ గడ్కారీ సంచల వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు శనివారం ఇక్కడ వెల్లడించారు.‘దేశంలో 30 శాతం డ్రైవింగ్ లైసెన్స్‌లు బోగస్. ఇక నుంచి ఒకే గొడుగు కింద(ఇ- గవర్నెస్) లైసెన్స్‌లు జారీ చేస్తాం.

04/02/2017 - 03:26

చెన్నై, ఏప్రిల్ 1: తమిళనాడు కరవు సహాయం నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. కేంద్రం ఏర్పాటు చేసిన అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్ర బృందానికి తమిళనాడు ప్రభుత్వం 39వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇవ్వాల్సిందిగా కోరింది. అయితే కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ తమిళనాడుకు ఇవ్వాల్సిన కరవుసాయంపై సిఫార్సులు చేసింది.

04/02/2017 - 03:26

అజ్మీర్, ఏప్రిల్ 1: దేశంలోనే ప్రమఖ దర్గా అయిన ఖ్వాజా మొయినుద్దీన్ ఛిస్తీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాదర్‌ను బహూకరించారు. 805వ ఉర్సు మహోత్సవాలను పురస్కరించుకుని ప్రధాని తరఫున కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చాదర్‌ను దర్గాకు అందజేశారు. ఈ సందర్భంగా నఖ్వీ మాట్లాడుతూ ఉర్సు మహోత్సవాలను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సూఫీలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారని అన్నారు.

04/02/2017 - 03:25

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో ఇతర వెనుకబడిన వర్గాల వారికోసం కొత్త కమిషన్ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. వచ్చేవారం ఇందుకు సంబంధించిన బిల్లును లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ప్రతిపాదిత బిల్లు ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్లతో సమానమైన శాసనాధికారాలు ఉంటాయి.

04/02/2017 - 02:46

షాహజాన్‌పూర్, ఏప్రిల్ 1: దగ్గరుండి మరీ ఓ యువకుడికి శిరోముండనం చేయించిన ముగ్గురు కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఒక మహిళతో ఫోన్లో మాట్లాడుతున్నాడన్న కారణంతో యువకుడి కొందరు వ్యక్తులు బంధించారు. అంతే పోలీసుల సమక్షంలోనే యువకుడికి శిరోముండనం చేశారు. ఈనెల 22న సౌత్ సిటీ కాలనీలో జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

04/02/2017 - 02:34

కోల్‌కతా, ఏప్రిల్ 1: విద్యార్థులు తర్కబద్ధంగా చర్చల్లో పాల్గొనాలని, వాదోపవాదాలు చేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. అయితే విద్యార్థులు ఎప్పుడూ అసహనపరులు కావొద్దని ఆయన హితవు పలికారు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో ఒకరయిన తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ దేశంలో స్వేచ్ఛాయుత చర్చల వాతావరణాన్ని నెలకొల్పడానికి దోహదం చేశారని, ఘర్షణ వాతావరణాన్ని కాదని అన్నారు.

Pages