S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/03/2017 - 00:04

కర్ణాటక, ఏప్రిల్ 2: అమెరికాలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో బెంగళూరు నుంచి ఐస్‌ల్యాండ్‌కు వెళ్తున్న ఓ భారతీయ మహిళపై అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు దారుణంగా వ్యవహరించారు. శృతి బసప్ప అనే ఈ మహిళ తనను ముందుగా పూర్తి బాడీ స్కాన్ చేశారని అందులో ఏమీ లేదని స్పష్టమైందని, అయినా అధికారులు ఇంకా అనుమానాలు వ్యక్తం చేయటంతో తడిమి చూసేందుకు అంగీకరించానని తెలిపారు.

04/03/2017 - 00:04

శ్రీనగర్, ఏప్రిల్ 2: ప్రధాని ఆదివారం ప్రారంభించిన చెనాని నష్రీ సొరంగ మార్గం ఆసియాలోనే అతి పెద్దది. 10.89 కిలోమీటర్ల పొడవైన ఈ టనె్నల్ జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని రెండు రాజధానులైన జమ్ము-శ్రీనగర్‌లను అనుసంధానం చేస్తోంది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లే సమయం దాదాపు రెండు గంటల పాటు తగ్గుతుంది. ఈ రహదారిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

04/02/2017 - 04:39

జమ్ము కాశ్మీర్ హైవేపై చెనాని- నష్రి మధ్య నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద రోడ్డు టనె్నల్ ఇది. ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దీన్ని ప్రారంభించనున్నారు. ఈ టనె్నల్ నిర్మాణంతో జమ్ము నుంచి కాశ్మీర్‌కు రెండు గంటల వ్యవధిలోనే చేరుకోవచ్చు

04/02/2017 - 03:55

చిత్రం..భారత పర్యటనకు వచ్చిన మలేసియా ప్రధాని నజీబ్ రజాక్ శనివారం
రాజ్‌ఘాట్‌లోని బాపూజీ స్మారక వద్ద శ్రద్ధాంజలి ఘటిస్తున్న దృశ్యం

04/02/2017 - 03:52

చిత్రం..గౌహతిలో శనివారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా. చిత్రంలో అసోం గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్, ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్

04/02/2017 - 03:49

బెంగళూరు, ఏప్రిల్ 1: ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భాగవత్‌ను రాష్టప్రతి చేయాలంటూ కర్నాటక కాంగ్రెస్ సీనియర్ నేత సికె జాఫర్ షరీఫ్ విజ్ఞప్తి చేశారు. ‘్భగవత్ దేశభక్తిని శంకించాల్సిన పనిలేదు. అలాగే రాజ్యాంగం పట్ల ఎంతో అంకితభావం ఉన్నవారు’ అని షరీఫ్ స్పష్టం చేశారు. రాష్టప్రతి కావడానికి అవససరమైన అన్ని అర్హతలూ భగవత్‌కు ఉన్నాయంటూ మార్చి 29న ప్రధాని నరేంద్ర మోదీకి రాసిన లేఖలో మాజీ రైల్వే మంత్రి పేర్కొన్నారు.

04/02/2017 - 03:50

ఇటానగర్, ఏప్రిల్ 1: బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడం భారత అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవడమేనని కేంద్ర హోమ్‌శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు విమర్శించారు. దలైలామా వచ్చేవారం అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 4, 13 తేదీల్లో ఆయన అరుణచల్‌లో పర్యటిస్తారు. టిబెట్ బహిష్కృత నేత భారత్‌లో ఎలా పర్యటిస్తారని చైనా ప్రశ్నిస్తోంది.

04/02/2017 - 03:53

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: ఆరు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేసిన మలేసియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ శనివారం న్యూఢిల్లీలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో పాటు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీని కలుసుకున్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. రాష్టప్రతి భవన్‌లో మోదీ తనకు అధికారికంగా సాదర స్వాగతం పలికారని రజాక్ ట్వీట్ చేశారు.

04/02/2017 - 04:10

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: రైల్వే ఆపరేషన్లకు విద్రోహం తలపెట్టడానికి జరుగుతున్న ప్రయత్నాలను భగ్నం చేసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) తన ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను పటిష్ఠం చేయనుంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర సంస్థలతో సమన్వయం చేసుకోనుంది. దీంతోపాటు రైల్వేలు ఒక ఫోరెన్సిక్ లేబొరేటరీని నెలకొల్పనున్నాయి. రైలు ప్రయాణాన్ని సురక్షితం చేయడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోనున్నాయి.

04/02/2017 - 03:38

ఓ పక్క తుపాకుల చప్పుళ్లు... మరోపక్క విరబూసిన అందాలు.. ఇది శ్రీనగర్‌లో శనివారం నాటి విచిత్రమైన పరిస్థితి. జమ్ము-కాశ్మీర్‌లో కొన్ని రోజులుగా నెలకొన్న శాంతియుత వాతావరణానికి మిలిటెంట్లు మళ్లీ విఘాతం కలిగించడం మొదలుపెట్టారు. శ్రీనగర్‌లో శనివారంనాడు పహరా కాస్తున్న జవాన్ల వ్యాన్‌పైకి మిలిటెంట్లు దాడి చేశారు. ఎటువంటి

Pages