S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/02/2017 - 02:34

రాయ్‌పూర్/హైదరాబాద్, ఏప్రిల్ 1: ‘గోవులను చంపేవాళ్లనే మేము ఉరి తీస్తాం’’ చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ శనివారం సంచలన ప్రకటన చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కబేళాలపై చర్యలు తీసుకుంటున్న అంశంపై ఆయన్ను ప్రశ్నించినప్పుడు ‘‘ఈ పదిహేనేళ్లలో అలాంటి ఘటన(గోవులను చంపటం) చత్తీస్‌గఢ్‌లో ఎప్పుడైనా జరిగిందా? అలాంటి దుస్సాహసానికి ఎవరైనా ఒడిగడితే వాళ్లను ఉరితీస్తాం’’ అని తీవ్రంగా స్పందించారు.

04/02/2017 - 01:52

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: దేశంలో అక్రమ నగదు లావాదేవీలకు పాల్పడుతున్న డొల్ల కంపెనీల భరతం పట్టడానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పెద్ద ఎత్తున దాడులకు దిగింది. బడాబాబులకు బినామీలుగా వ్యవహరిస్తూ పేరుకు మాత్రమే కంపెనీలు ఏర్పాటు చేసి వాటి ద్వారా భారీ మొత్తాల్లో డబ్బుల అక్రమ లావాదేవీలు పాల్పడుతున్న 1155కంపెనీలను ఈడీ గుర్తించింది.

04/02/2017 - 01:49

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్టమొదటి సారి ఆర్థిక సంవత్సరం తొలిరోజు నుంచే వార్షిక బడ్జెట్ అమల్లోకి వచ్చింది. పార్లమెంట్ ఆమోదించిన ద్రవ్యబిల్లుపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం సాయంత్రం సంతకం చేశారు. ‘‘రాష్టప్రతి అస్సాంలో అధికారిక పర్యటనకు వెళ్లటానికి ముందు ద్రవ్యబిల్లుకు ఆమోదం తెలిపారు’’ అని కేంద్ర రెవిన్యూ కార్యదర్శి హస్‌ముఖ్ ఆధియా తెలిపారు.

04/02/2017 - 01:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మలేసియాకు చెందిన మైట్ టెక్నాలజీ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి త్వరలో నాలుగో జనరేషన్ టెక్నాలజీ పార్క్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్‌ల సమక్షంలో శనివారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మేరకు ఒప్పందం కుదిరింది.

04/01/2017 - 09:03

పార్వతీపురం (రూరల్), మార్చి 31: ఆంధ్రా- ఒడిశా ప్రాంతంలో మావోయిస్టులు మళ్లీ అలజడి సృష్టించారు. దీనికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం గురువారం అర్ధరాత్రి తరువాత ఒడిశాలోని రాయగడ-కలహండి జిల్లాల సరిహద్దుల్లోని సంబల్‌పూర్ డివిజన్‌లోని దోయికల్ రైల్వే స్టేషన్‌పై దాదాపు 15 మంది మావోయిస్టులు వరకు విధ్వంసం సృష్టించారు.

04/01/2017 - 03:13

న్యూఢిల్లీ, మార్చి 31: పాకిస్తాన్ సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకొని కాశ్మీర్‌లోని యువతను రెచ్చగొడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రదేశాలను ముట్టడించాల్సిందిగా యువతను పాకిస్తాన్ ప్రేరేపిస్తోందని, తద్వారా ఆ పరిసరాల్లో దాక్కున్న ఉగ్రవాదులు పారిపోయేందుకు సహకరించాలనేది పాకిస్తాన్ పన్నాగమని ఆయన పేర్కొన్నారు.

04/01/2017 - 03:10

న్యూఢిల్లీ, మార్చి 31: అయోధ్యలోని రామాలయం-బాబ్రీ మసీదు కేసుపై రోజు వారీ విచారణ జరిపి త్వరగా పూర్తి చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ కేసులో బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి పోషిస్తున్న పాత్ర ఏమిటో స్పష్టం చేయాలని ఆదేశించింది. ఈ కేసులో సుబ్రమణ్యస్వామి పాత్రపై కక్షిదారులు అభ్యంతరాన్ని వ్యక్తం చేయడంతో సుప్రీం కోర్టు శుక్రవారం ఆయనకు ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

04/01/2017 - 03:08

న్యూఢిల్లీ, మార్చి 31: కరువు బారిన పడిన తమిళనాడు రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అగౌరవ పరిచారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కరువు బారిన పడి నష్టపోయిన తమను ఆదుకునేందుకు ప్యాకేజీని ప్రకటించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను ప్రధాని చర్చలకు పిలవకుండా వారి పట్ల అమర్యాదకరంగా వ్యవహరించారని మండిపడ్డారు.

04/01/2017 - 03:06

న్యూఢిల్లీ, మార్చి 31: ప్రభుత్వ ప్రకటనలు(యాడ్‌లు)కు వెచ్చించిన 97 వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాలన్న ప్యానెల్ కమిటీ సిఫార్సులను ఆమ్‌ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు లేదని ఆప్ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ పనిగట్టుకుని తమ ప్రభుత్వంపై దుష్టచ్రారం చేస్తున్నారని ఆరోపించారు.

04/01/2017 - 03:05

న్యూఢిల్లీ, మార్చి 31: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్య ప్రతిభా సింగ్‌తో పాటు మరికొంతమంది ఇతరులపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) శుక్రవారం అభియోగ పత్రాలు (చార్జిషీట్లు) దాఖలు చేసింది. దీంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.

Pages