S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

04/04/2017 - 01:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: గత రెండేళ్లుగా ఇరాక్‌లో నరకయాతన అనుభవిస్తున్న 32మంది తెలుగువాళ్లకు ఎట్టకేలకు విముక్తి లభించింది. కేంద్ర, రాష్ట్రాల తీవ్ర కృషితో ఎట్టకేలకు బాధితులు సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. బాధితుల్లో తెలంగాణవాసులే 31మంది ఉన్నారు. ఇరాక్ నుంచి ఉదయం ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాధితులను ఏపీ-తెలంగాణ భవన్‌కు తరలించారు.

04/04/2017 - 01:41

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: వివాదాస్పద అయోధ్య అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన తోడ్పాటు అందిస్తుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాన్ని ఇరు వర్గాలు చర్చల ప్రక్రియ ద్వారానే నివృత్తి చేసుకోవాలని సూచించారు.

04/04/2017 - 01:31

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3:త్వరలోనే 200 నోట్లను జారీ చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ సిద్ధమవుతోంది. నకిలీలకు ఆస్కారం లేని విధంగా మరిన్ని అదనపు జాగ్రత్తలు తీసుకుంటామని, ఏ క్షణంలోనైనా ఈ కరెన్సీ జారీ అయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే 500, 2000 కరెన్సీలో ప్రతి మూడు లేదా నాలుగేళ్లకోసారి భద్రతా పరంగా అదనపు అంశాల్ని చేర్చే ఆలోచనను కూడా ఆర్‌బిఐ పరిశీలిస్తోందని తెలిపాయి.

04/04/2017 - 01:30

న్యూడిల్లీ: రష్యాలో పేలుడు ఘటన నేపథ్యంలో ఢిల్లీ మెట్రో హై అలర్ట్ ప్రకటించింది. సిఐఎస్‌ఎఫ్ బలగాలను పెద్ద సంఖ్యలో మొత్తం 150 స్టేషన్లలో మోహరించారు. అన్ని ప్రవేశ, వెలుపలికి వచ్చే దారుల్లో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికుల లగేజీని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు వౌఖిక ఆదేశాలు వచ్చాయి.

04/04/2017 - 00:48

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మాక్సిస్-ఎయిర్‌సెల్‌కు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతి లభించడంలో కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి చిదంబరం పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్టు సిబిఐ సుప్రీం కోర్టుకు తెలియజేయటం కాంగ్రెస్‌లో గుబులు రేపుతోంది. చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని దెబ్బతీయటం ద్వారా పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఎన్డీయే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు.

04/04/2017 - 00:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మే 11 నుంచి ప్రారంభమయ్యే వేసవి సెలవుల్లో మొత్తం 5300 కేసులు విచారించటానికి సుప్రీం కోర్టు రిజిస్ట్రీ జాబితా విడుదలయింది. జూలై రెండు వరకూ వేసవి సెలవులు కొనసాగుతాయి. ఈ మధ్య కాలంలో మొత్తం 5300 కేసులను రెండు ప్రత్యేక వెకేషన్ బెంచ్‌లు విచారిస్తాయి.

04/04/2017 - 00:46

వారణాసి, ఏప్రిల్ 3: నిన్న మీటర్.. నేడు వారణాసి. మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా ఆలపించాలంటూ వారణాసి మేయర్ రామ్‌గోపాల్ మొహాలే ఆదేశించారు. శనివారంనాడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బిజెపి సభ్యులు ఈ అంశాన్ని లేవనెత్తారు. ప్రతిపక్ష కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ కార్పొరేటర్ల నిరసనల మధ్యే మేయర్ ఆదేశాలు జారీచేశారు.

04/04/2017 - 00:46

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: గ్రేటర్ నోయిడాలో ఆఫ్రికా విద్యార్థులపై ఇటీవల జరిగిన దాడులు విద్వేషపూరిత దాడులేనని భారత్‌లోని ఆఫ్రికా దౌత్యవేత్తలు సోమవారం ఆరోపించారు. ఈ దాడులను పరిశీలిస్తే లింగపరమైన, జాతి పరమైన వివక్షాపూరిత దాడులుగా స్పష్టంగా అర్థమవుతోందని దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వివిధ ఆఫ్రికా దేశాల దౌత్యవేత్తలు సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.

04/04/2017 - 00:44

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: జమ్ము కాశ్మీర్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ఆ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో తమ ప్రభుత్వం వెన్నంటి నడుస్తుందని సోమవారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. తన ఫాలోవర్ చేసిన ఓ పోస్ట్‌కు స్పందించిన ఆయన ‘‘జమ్ము కాశ్మీర్ ఓ అద్భుతం.. మీరు తప్పనిసరిగా ఆ రాష్ట్రాన్ని చూసి రావాలి..

04/03/2017 - 02:36

అలహాబాద్, ఏప్రిల్ 2: న్యాయ వ్యవస్థపై భారాన్ని, అపరిష్కృత కేసులను తగ్గించాలన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహార్ దృఢ సంకల్పం నెరవేరడానికి తమ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. అలహాబాద్ హైకోర్టు 150వ వార్షికోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆదివారం ప్రధాని మాట్లాడుతూ అదే కార్యక్రమంలో వేదికపై ఉన్న జస్టిస్ ఖేహార్‌కు ఈ హామీ ఇచ్చారు.

Pages