S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2016 - 08:06

బాలాజన్ (అస్సాం), ఆగస్టు 7: వారాంతపు మార్కెట్‌లో పధ్నాలుగు మందిని ఊచకోత కోసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. దాడులకు కారణమైన మిలిటెంట్ సంస్థ ఎంత శక్తివంతమైనదైనా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, దాడుల్లో పాలుపంచుకున్న ఉగ్రవాదులను వెంటాడి పట్టుకుంటామని తెలిపారు.

08/08/2016 - 08:06

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఇటీవల ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశం సందర్భంగా పాకిస్తాన్ అధికారులు భారతీయ జర్నలిస్టులను కనీసం ప్రవేశ ద్వారం వద్ద కూడా నిలబడనివ్వలేదు. సార్క్ దేశాల మంత్రుల సమావేశం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మీడియాను అనుమతించడం ఆనవాయితీ. తరువాత జరిగే కార్యక్రమానికి మాత్రం మీడియాను దూరంగా ఉంచుతారు.

08/08/2016 - 08:05

అలహాబాద్, ఆగస్టు 7: అలహాబాద్‌లోని ఓ పాఠశాల ఏకంగా జాతీయ గీతాలాపననే నిషేధించింది. జనగణమన గీతంలోని ‘్భరత భాగ్య విధాత’ అన్నమాట ఇస్లాంకు వ్యతిరేకమంటూ బాగ్‌హరాలోని ఎంఏ కానె్వంట్ స్కూల్ మేనేజర్ జాతీయ గీతాన్ని ఆలపించవద్దని హుకుం జారీ చేశారు.

08/08/2016 - 07:36

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దైనందిన జీవితా ల్లో చేనేత ఉత్పత్తులనే ఎక్కువగా వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత రంగం ఎంతగా అభివృద్ధి చెందితే అంతగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, అలాగే మహిళల సాధికారికతకూ ఈ రంగం ఎంతగానో ఊతాన్నిస్తుందని తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం వివిధ ట్వీట్లు చేసిన మోదీ ఈ రంగం ప్రాధాన్యతను, దాన్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు.

08/08/2016 - 07:35

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశ రాజధాని ఢిల్లీలో 2012-2015 మధ్య కాలంలో సగటున రోజుకు నలుగురు మహిళలు అత్యాచారానికి గురయ్యారు. మరో తొమ్మిది మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఢిల్లీ పోలీసులు ఈ నాలుగేళ్లలో మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి పొందుపరచిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఈ నాలుగేళ్లలో మహిళలపై అత్యాచారాల కేసులు మూడింతలు పెరిగాయి.

08/08/2016 - 07:33

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ‘లాభదాయక పదవి’ నిర్వహిస్తున్నారన్న పేరుతో పలువురు ప్రజాప్రతినిధులు అనర్హత పొందుతున్నారని, నిజానికి ‘లాభదాయక పదవి’(ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్)కి ఏ చట్టంలో కానీ, ఏ తీర్పులో కానీ ఎలాంటి నిర్వచనం ఇవ్వలేదని పార్లమెంటరీ కమిటీ ఒకటి పేర్కొంది. దీనికి సంబంధించి ఒక బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని కేంద్ర న్యాయశాఖను ఈ కమిటీ కోరింది.

08/08/2016 - 06:54

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును సోమవారం లోక్‌సభ చేపట్టబోతోంది. అన్ని రాజకీయ పార్టీల నుంచి బలమైన మద్దతు లభించడంతో రేపే దీనిపై చర్చించి ఆమోదించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది.

08/07/2016 - 20:45

హైదరాబాద్:దేశంలో దళితులపై దాడులు చేయడం మానవత్వానికి మచ్చ అని, వసుధైక కుటుంబం అని చెప్పుకునే మనదేశంలో ఇలాంటివి తగవని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కావాలంటే తనపై దాడి చేయాలేతప్ప వారిని కాపాడుకోవాలని అన్నారు. నగరంలోని ఎల్‌బి స్టేడియంలో జరిగిన బిజెపి మహాసమ్మేళన సభలో ఆయన మాట్లాడారు. దళితులతోసహా అన్నివర్గాలను కలుపుకుపోతే వచ్చే 50 ఏళ్లవరకు ఏ శక్తీ బిజెపిని అడ్డుకోలేదని అన్నారు.

08/07/2016 - 19:05

హైదరాబాద్:దేశ ప్రజల సొమ్మును దోచుకోనివ్వనని, తమ రెండేళ్ల పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా చేశామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యుపిఎ పాలనలో నిత్యం అవినీతికి సంబంధించిన వార్తలే టీవీల్లో వచ్చేవని, ఇప్పుడు అలాంటి అవకాశం లేదని అన్నారు. మెదక్ జిల్లాలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన అనంతరం నగరానికి చేరుకున్న మోదీ ఎల్‌బిస్టేడియంలో నిర్వహిస్తున్న బిజెపి మహాసమ్మేళనం సభలో పాల్గొని ప్రసంగించారు.

08/07/2016 - 14:20

జలంధర్:పంజాబ్‌లోని ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు, సహ్‌సంఘ్‌చాలక్ రిటైర్డ్ బ్రిగేడియర్ జగదీష్ గగ్నాజీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మూడు బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోగా ఆయన పరిస్థితి విషమంగా ఉంది. జలంధర్‌లోని రద్దీగా ఉండే ఓ చౌక్ వద్ద ఆయన వెడుతూండగా మోటార్‌బైక్‌వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు.

Pages