S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2016 - 08:00

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఏపికి ప్రత్యేక హోదాతో సహా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న అంశాలపై కేంద్రం నుండి వారం రోజుల్లో సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం వుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి చేప్పారు.శుక్రవారం నాడు ఏపిభవన్‌లో టిడిపి ఎంపీలతో కలిసి సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడారు.

08/06/2016 - 07:58

న్యూఢిల్లీ, ఆగస్టు 5: కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభకు వివరించింది. హిజ్‌బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ బుర్హాన్ వనీ భద్రతాదళాల కాల్పుల్లో మరణించిన తరువాత రాష్ట్రం హింసా, విధ్వంసకాండలతో అట్టుడికిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు తాజా స్థితిగతుల నివేదికను సమర్పించింది.

08/06/2016 - 07:56

ముంబయి, ఆగస్టు 5: గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలతో అతలాకుతలమవుతున్న ముంబయి మహానగర జీవనం శుక్రవారం తెల్లవారుజామునుంచి కురిసిన భారీ వర్షాలతో తల్లడిల్లిపోయింది. ముంబయితో పాటు సమీపంలోని అన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేకచోట్ల నీరు నిలిచిపోవడంతో సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది.

08/06/2016 - 07:41

న్యూఢిల్లీ, ఆగస్టు 5: వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రుల్లో 34శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, సగటున 8.59కోట్లతో 76శాతం మంది కోటీశ్వరులున్నారని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. 29 రాష్ట్రాల అసెంబ్లీలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 620మంది మంత్రుల్లో 609మందిపై ఈ సర్వే జరిగింది.

08/06/2016 - 07:02

న్యూఢిల్లీ,ఆగస్టు 5: కృష్ణాపుష్కరాల ఆహ్వానం పేరుతో కెవిపి ప్రైవేటు బిల్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి విమర్శించారు. శుక్రవారం నాడు రాజ్యసభలో టిడిపి, బిజెపిల నటనా చాతుర్యాలు బయటపడ్డాయని ఆయన అన్నారు. రాజ్యసభలో ఏపికి తీవ్ర అవమానం జరిగిందని, సాక్షాత్తు ప్రధాని ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు.

08/06/2016 - 07:02

న్యూఢిల్లీ,ఆగస్టు 5: ‘మీ సమస్యలు నా సమస్యలు, మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలుగుదేశం ఎం.పిలకు హామీ ఇచ్చారు. కేంద్ర సైన్సు,విజానం శాఖ మంత్రి సుజనా చౌదరి, పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు నాయకత్వంలో తెలుగుదేశం ఎం.పిలు శుక్రవారం మధ్యాహ్నం పార్లమెంటు ఆవరణలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో నరేంద్ర మోదీని కలిసి ఏ.పికి ప్రత్యేక హోదాపై తమ వాదనలు వినిపించారు.

08/06/2016 - 07:01

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆంధ్రకు చట్టపరంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో లేవనెత్తిన ఏపీకి ఇచ్చిన హామీల విషయం పరిశీలనలో ఉందన్నారు.

08/06/2016 - 07:00

న్యూఢిల్లీ,ఆగస్టు 5: ఐదు కోట్ల మంది ఆంధ్రులు ప్రత్యేక హోదా కోసం ఎదురు చూస్తున్నారు, వారి ఆశలను దెబ్బ తీయకూడదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం ట్వీట్ చేశారు. ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే నిర్ణయం ఈ దేశ పార్లమెంటు 2014లో తీసుకున్నదేనన్న వాస్తవాన్ని మరిచిపోకూడదని ఆయన సూచించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రులను బిజెపి, తెలుగుదేశం వెన్నుపోటు పొడుస్తోందని రాహుల్ ఆరోపించారు.

08/06/2016 - 06:42

న్యూఢిల్లీ, ఆగస్టు 5: రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలంటూ కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనేది నిర్ధారించే భారాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై పెట్టారు. ఆ బిల్లు ద్రవ్య బిల్లేనని స్పీకర్ నిర్ధారిస్తే దీనిపై రాజ్యసభలో ఓటింగ్ జరగదు. సుమిత్రా మహాజన్ ఇందుకు భిన్నంగా నిర్ణయించే పక్షంలో సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరుగుతుంది.

08/06/2016 - 06:33

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ప్రతిష్టాత్మక జిఎస్‌టి బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టి అదే రోజు ఆమోదింపజేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల రాజ్యసభ ఆమోదించిన బిల్లులో కొన్ని సవరణలు చేసినందున ఇది మళ్లీ లోక్‌సభ ఆమోదానికి వస్తోంది. సోమవారం దీనిపై జరిగే చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడే అవకాశం ఉంది.

Pages