S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/10/2016 - 04:34

న్యూఢిల్లీ,ఆగస్టు 9: వైద్యవిద్యా ప్రవేశపరీక్ష నీట్-2 రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు తిరస్కరించింది.

08/10/2016 - 04:32

చెన్నై, ఆగస్టు 9: తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి తనదైన నాట్య విన్యాసంతో కౌబాయ్ తరహా పాత్రలతో ఆనాటి ప్రేక్షక లోకాన్ని విశేషంగా మెప్పించిన నటి జ్యోతి లక్ష్మి(68) బ్లడ్‌క్యాన్సర్‌తో సోమవారం అర్ధరాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఇటీవలే ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు.

08/09/2016 - 17:38

ఇంఫాల్: ‘సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాల చట్టా’న్ని రద్దు చేయాలని 16 ఏళ్లుగా చేస్తున్న నిరాహార దీక్షకు ‘మణిపూర్ ఉక్కుమహిళ’ ఇరోమ్ చాను షర్మిల మంగళవారం స్వస్తి పలికారు. ఆ చట్టం కారణంగా మణిపూర్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆమె దీక్ష చేశారు. దీక్ష విరమించినందున ఇక తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తానని ఆమె ప్రకటించారు.

08/09/2016 - 16:44

నాగపూర్‌ : నాగపూర్‌లో ప్రజలు ప్రత్యేక విదర్భ కోరుతూ మంగళవారం భారీ ఆందోళన చేపట్టారు. విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా చేసి తీరాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ముందుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసాన్ని ముట్టడించారు.

08/09/2016 - 16:19

ముంబయి: మంగళవారం దేశీయ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 97 పాయింట్లు నష్టపోయి 28,085 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 33 పాయింట్లు కోల్పోయి 8,678 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.89 వద్ద కొనసాగుతోంది.

08/09/2016 - 14:57

రాజస్థాన్‌ : అత్యాచార కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఆశారాం బాపు బెయిల్‌ దరఖాస్తును రాజస్థాన్‌ హైకోర్టు మంగళవారం నిరాకరించింది. వరుసగా తొమ్మిదోసారి ఆయన బెయిల్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ చివరి దశలో బెయిల్‌ ఇవ్వడం సరికాదని జస్టిస్‌ నిర్మల్‌ జీత్‌ కౌర్‌ స్పష్టం చేశారు. ఆశారాం తనను లైంగికంగా వేధించాడంటూ యూపీకి చెందిన ఓ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

08/09/2016 - 14:48

దిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలని వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎంపీలు సీపీఎం అగ్రనేత ఏచూరితో మంగళవారం భేటీ అయ్యారు. ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలుపరచాలని విజ్ఞప్తి చేశారు.

08/09/2016 - 11:45

ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలి కోపుల్ మంగళవారం ఉదయం తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19 నుంచి జూలై 13 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి, రెబెల్స్‌కు నాయకత్వం వహించి ఆయన కొన్ని నెలలు మాత్రమే సిఎం పదవిలో ఉండగలిగారు. సిఎంగా ఆయన ఎన్నిక చెల్లదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

08/09/2016 - 11:44

దిల్లీ: ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలుపరచాలని చిత్తూరు ఎంపి శివప్రసాద్ మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రుల సెంటిమెంటును తక్కువగా అంచనా వేయద్దని, ప్రత్యేక హోదా కోసం ఎంతటి ఉద్యమానికైనా ఎపి ప్రజలు సిద్ధమేనన్నారు. పార్లమెంటు వద్ద ఆయన ఈరోజు తప్పెటగుళ్లు కళాకారుడి వేషధారణలో సందడి చేశారు.

08/09/2016 - 11:43

చెన్నై: కొన్ని దశాబ్దాల పాటు దక్షిణాది సినీ ప్రేక్షకులను తన డ్యాన్స్‌లతో అలరించిన సినీనటి జ్యోతిలక్ష్మి (53) మంగళవారం తెల్లవారుజామున చెన్నైలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 300 పైచిలుకు సినిమాల్లో ఆమె తన హావభావాలతో అశేష ప్రేక్షకులను అలరించారు.

Pages