S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/06/2016 - 15:38

దిల్లీ: కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాపై చెక్ బౌన్స్ కేసులో శనివారం పాటియాలా హౌస్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. నవంబర్ 4న కోర్టులో ఆయన హాజరుకావాలని ఆదేశించింది. కోర్టుకు హాజరుకాకుంటే ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. లండన్ లో ఉన్న మాల్యాకు వారెంట్ అందేలా చూడాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.

08/06/2016 - 14:01

గాంధీనగర్: గుజరాత్ నూతన ముఖ్యమంత్రిగా విజయ్‌కుమార్ రూపానీ, డిప్యూటీ సిఎంగా నితిన్ పటేల్ ఆదివారం గాంధీనగర్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. 2012లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాక మూడో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 2012లో నరేంద్ర మోదీ సిఎంగా బాధ్యతలు స్వీకరించి, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి ప్రధాని పదవిని చేపట్టారు. 2014లో ఆనందీబెన్ పటేల్ ప్రమాణం చేశారు.

08/06/2016 - 12:34

దిల్లీ: లోక్‌సభలో సోమవారం జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టనున్న దృష్ట్యా పార్లమెంట్‌ సమావేశాలకు 8,9,10 తేదీల్లో తప్పనిసరిగా హాజరుకావాలని తెదేపా విప్‌ జారీ చేసింది.

08/06/2016 - 12:32

జమ్మూ: జమ్మూలోని రీసీ జిల్లా మాతా వైష్ణోదేవి ఆలయం సమీపంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృతిచెందగా, మరో ఏడుగురు గాయాలపాలయ్యారు. యాత్రికులు ఆలయ సమీపంలోని 3వగేటు వద్దకు రాగానే- ఒక్కసారిగా కొండ విరిగి పడటంతో నలుగురు మృతి చెందారు. పోలీసులు క్షతగాత్రులను కత్రా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

08/06/2016 - 11:14

ముంబయి : ముంబయి-గోవా రహదారిపై మహద్‌ వద్ద వంతెన కూలిన ఘటనలో 22 మంది మృతదేహాలను వెలికితీశారు. వంతెన కూలిపోయిన సంయంలో రెండు బస్సులు, పలు వాహనాలు నదిలోకి కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు 50 మంది నదిలో గల్లంతవ్వగా, ఇప్పటి వరకు 22 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగతా వారి కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

08/06/2016 - 08:05

గాంధీనగర్, ఆగస్టు 5: అంతిమ క్షణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకోవడంతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విధేయుడిగా భావిస్తున్న విజయ్ రూపానీకి గుజరాత్ ముఖ్యమంత్రి పీఠం దక్కింది. ఆనందిబెన్ వారసుడిగా ఈ పదవి దక్కేది తనకేనని చివరి క్షణం వరకు ధీమాగా వున్న నితిన్ పటేల్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి చిక్కింది. మొదటినుంచి కూడా ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధాన పోటీదారుగా నితిన్ పటేలే నిలిచారు.

08/06/2016 - 08:03

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున పక్షం రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్‌డిఏ సర్కార్ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించడం ద్వారా ఈ పదిహేను రోజుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారు.

08/06/2016 - 08:02

లక్నో, ఆగస్టు 5: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లు చాలా ముందుగానే సమాయత్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార సమాజ్‌వాదీ పార్టీ కూడా అందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సర్వసన్నద్ధం కావాలని పార్టీనేతలు, కార్యకర్తలకు ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్ పిలుపునిచ్చారు.

08/06/2016 - 08:01

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పాకిస్తాన్‌లో జరిగిన సార్క్ సమావేశంలో భారత దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందని, మిగతా సార్క్ దేశాలను కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని స్పష్టంగా చెప్పిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటనపై శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లోను ఒక ప్రకటన చేశారు.

08/06/2016 - 08:00

గౌహతి, ఆగస్టు 5: సామాజిక ఉద్యమకారిణి, మణిపూర్ ‘ఉక్కు మహిళ’ ఇరోం షర్మిలకు బెదిరింపులు వస్తున్నాయి. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టానికి వ్యతిరేకంగా ఆమె చేస్తున్న నిరాహార దీక్షను కొనసాగించాలని, బయటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన మానుకోవాలని కొన్ని సంస్థలు ఆమెను హెచ్చరించాయి.

Pages