S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/21/2016 - 06:37

న్యూఢిల్లీ, జూలై 20: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలపై కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల సిఎంలు సభ్యులుగావున్న అపెక్స్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి సమస్యల పరిష్కరించాలని కేంద్రానికి సుప్రీం కోర్టు నిర్దేశించింది.

07/21/2016 - 06:35

న్యూఢిల్లీ, జూలై 20: తెలంగాణ నీటి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె తారక రామారావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కెటిఆర్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో బుధవారం బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీలను కలిసి పలు ప్రతిపాదనలను కేంద్రం ముందుంచారు.

07/21/2016 - 05:51

న్యూఢిల్లీ, జూలై 20: గుజరాత్‌లో గోసంరక్షణ పేరుతో దళితులపై జరిగిన దాడులపై బుధవారం లోక్‌సభ అట్టుడికిపోయింది. దళితముక్త్ భారత్ చేసేందుకు అధికార బిజేపీ, రాష్ట్రీయ స్వయంసేవక్‌సంఘ్‌లు కుట్ర చేస్తున్నాయని ప్రధాన విపక్షం కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. అయితే ప్రభుత్వం నుంచి కూడా అంతే తీవ్రంగా ప్రతిస్పందన వచ్చింది.

07/21/2016 - 05:48

న్యూఢిల్లీ,జూలై 20: ఏ.పికి ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బుధవారం పార్టీ ఎంపిలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. కాంగ్రెస్ సభ్యులందరూ శుక్రవారం రోజంతా రాజ్యసభ కార్యక్రమాలకు హాజరై అధినాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకోవాలంటూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది.

07/20/2016 - 18:26

దిల్లీ: బిఎస్‌పి అధినేత్రి, మాజీ సిఎం మాయావతిపై బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ తరఫున కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ విచారం వ్యక్తం చేశారు. మాయావతిని క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన ప్రకటించారు. మహిళపై నీచమైన పదాన్ని ఉపయోగించడం సరికాదని, దయాశంకర్ వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నట్లు జైట్లీ తెలిపారు.

07/20/2016 - 18:25

దిల్లీ: పార్టీ టిక్కెట్లను ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటూ బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఓ వేశ్యలా వ్యవహరిస్తున్నారంటూ యుపికి చెందిన బిజెపి నాయకుడు దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు బుధవారం రాజ్యసభలో దుమారం సృష్టించాయి. దళిత మహిళపై ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసినందుకు దయాశంకర్‌పై చర్యలు తీసుకోవాలని బిఎస్‌పి ఎంపీలు పట్టుబట్టడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో సభను రేపటికి వాయిదా వేశారు.

07/20/2016 - 18:19

దిల్లీ: తెలంగాణలో చేనేత రంగానికి కేంద్రం సాయం అందించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీకి బుధవారం విజ్ఞప్తి చేశారు.

07/20/2016 - 18:15

అలహాబాద్‌: గూగుల్‌ ఇమేజ్‌ సెర్చ్‌లో ప్రపంచంలోని టాప్‌ 10 క్రిమినల్స్‌ జాబితా సెర్చ్‌ చేస్తే అందులో ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో కూడా వచ్చింది. ఇమేజ్‌ సెర్చ్‌ ఇంజన్‌ ఇలా తప్పుగా చూపించడంపై సుశీల్‌కుమార్‌ మిశ్రా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై గూగుల్‌కు అలహాబాద్‌ కోర్టు నోటీసులు పంపించింది. ఈ మేరకు గూగుల్‌ సీఈఓ, గూగుల్‌ ఇండియా హెడ్‌కు లీగల్‌ నోటీసులు జారీ చేసింది.

07/20/2016 - 17:51

దిల్లీ: ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించేందుకు తన మద్దతుదారులను ప్రేరేపించారని ఆరోపణలు రావడంతో దిల్లీ పోలీసులు ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసన సభ్యుడు సోమ్‌నాథ్‌ భారతిపై కేసు నమోదు చేశారు. ఆయన మద్దతుదారులపై కూడా కేసు నమోదు చేశారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హాజరైన ఓ కార్యక్రమానికి వెళ్లిన తనతో సోమ్‌నాథ్‌ మద్దతుదారులు అసభ్యంగా ప్రవర్తించారని సదరు మహిళ ఫిర్యాదులో పేర్కొంది.

07/20/2016 - 17:19

ఢిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు బుధవారం నిర్ణయించారు. కేంద్రమంత్రి సుజనా నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. తప్పులు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్‌ తెచ్చిన సవరణ బిల్లుకు మద్దతు ఇస్తామని టీడీపీ ఎంపీలు అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి ప్రైవేటుబిల్లుకు తాము సహకరిస్తామన్నారు.

Pages