S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/10/2016 - 02:14

న్యూఢిల్లీ, జూలై 9: ఆంధ్రప్రద్రేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా నదీ జలాల వివాదం నాలుగు రాష్ట్రాలకు సంబంధించినదేనని బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ, ఏపీలు తమ వాదనలు వినిపించాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ మధ్యే నీటి పంపకాలు ఎందుకు చేపట్టకూడదని ట్రిబ్యునల్ అడిగిన ప్రశ్నకు, చట్టంలో ఆవిధంగా పొందుపర్చలేదని వివరించాయి.

07/10/2016 - 01:03

తిరువనంతపురం, జూలై 9: కేరళలో గత నెల రోజుల నుంచీ కనిపించకుండా పోయిన యువకులు దాదాపు 15 మంది మధ్య ఆసియాకు చేరివుంటారని అనుమానిస్తున్నారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదుల ట్రాప్‌లో చిక్కుకోవడమో లేక వారి ప్రేరణకు లోనుకావడమో జరిగివుంటుందని, దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ విలేఖరులకు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని రాబట్టాలని ఆయన పోలీసులను ఆదేశించారు.

07/10/2016 - 00:59

పనాజీ, జూలై 9: టెలి కమ్యూనికేషన్ వ్యవస్థకు ప్రధానమైన రోటర్ల తయారీపై దృష్టిసారించాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఉద్ఘాటించారు. ఉన్నత విద్యాలయాల్లో నైపుణ్యత పెరగాలని ఆయన పిలుపునిచ్చారు. గోవా ఇంజనీరింగ్ కాలేజీ స్వర్ణోత్సవాల్లో ఆయన మాట్లాడుతూ ‘సమచారం అన్నది ఎంతో కీలకమైంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రోటర్లు వినియోగిస్తే అనేక సమస్యలుంటాయి.

07/10/2016 - 00:58

న్యూఢిల్లీ, జూలై 9: మధుర-పల్వాల్ మధ్య నడిచే హైస్పీడ్ రైలు శనివారం ట్రయల్ రన్ ప్రారంభించారు. మధుర నుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు పరుగులెత్తింది. రైలులో స్పెయిన్, భారత రైల్వే అధికారులు ప్రయాణించారు. రైలు రెండోదశ ట్రయల్ రన్ విజయవంతమైందని అధికారులు ప్రకటించారు. తొమ్మిది బోగీలున్న ఈ రైలు మధ్యాహ్నం 12.40కి మధురలో బయలుదేరింది. పల్వాల్ స్టేషన్‌కు 1.33 గంటలకు చేరుకుంది.

07/10/2016 - 04:29

హైదరాబాద్, జూలై 9: దుబాయి నుంచే హైదరాబాద్‌లో ఐసిస్ సానుభూతిపరుల రిక్రూట్‌మెంట్ జరిపేందుకు యత్నించానని, హైదరాబాద్‌లో నలుగురితో కలసి భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్టు ఇటీవల అరెస్టైన ఐదుగురిలో కీలక వ్యక్తి ఇబ్రాహీం యజ్దాని ఎన్‌ఐఏ దర్యాప్తులో తెలిపాడు. ఈ నెల 3నుంచి ఎన్‌ఐఏ కస్టడీలోని ఉగ్రవాది ఇబ్రహీం ద్వారా కీలక సమాచారం రాబట్టిన అధికారులు మహరాష్ట్ర, హైదరాబాద్, అనంతపురంకు తీసుకెళ్లి విచారించారు.

07/10/2016 - 00:48

ఫుల్‌బానీ (ఒడిశా), జూలై 9: మావోయిస్టులు, భద్రతాదళాల ఎదురుకాల్పుల ఘటన ఆరుగురు గ్రామస్థులను బలితీసుకుంది. ఇద్దరు మహిళలు, ఒక బాలుడు సహా కాల్పుల్లో మృతి చెందారు. ఒడిశాలోని కంధామల్ జిల్లా గుముత్‌మహాలో ఈ ఘటన చోటుచేసుకుంది. కంధామల్ ఎస్పీ పినాక్ మిశ్రా కథనం ప్రకారం మావోయిస్టులు కదలికపై సమాచారం అందుకున్న భద్రతాదళాలు ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టారు.

07/10/2016 - 00:48

ముంబయి, జూలై 9: పరిశోధన, సాంకేతిక అభివృద్ధి కోసం దేశంలోని రెండు ప్రతిష్ఠాత్మక ముంబయి, మద్రాసు ఐఐటిలతో డిఆర్‌డిఓ ఒప్పందం చేసుకుంది. ఎయిరోస్పేస్ రంగంలో పరిశోధనలు, అభివృద్ధికి సమన్వయంతో పనిచేస్తాయి. ఈ మేరకు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

07/10/2016 - 00:47

కోల్‌కతా, జూలై 9: భారతీయ పర్యాటకులకు భద్రత కల్పిస్తామని ఎలాంటి భయాందోళనకు గురికావద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ మేరకు భరోసా ఇచ్చారు. ‘దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు అత్యంత దురదృష్టకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం.

07/09/2016 - 17:50

సంత్‌కబీర్‌నగర్‌: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి లక్ష్మికాంత్‌ అలియాస్‌ పప్పు నిషాద్‌ను కోర్టులో శనివారం హాజరు పరచగా చీఫ్‌ జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ సంజయ్‌ కుమార్‌ గౌర్‌ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించి, 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. చాద్‌మతి అనే మహిళ- పప్పు నిషాద్‌ తనపై దాడిచేశాడని, చంపుతానని బెదిరించాడని 2006లో కేసు పెట్టింది.

07/09/2016 - 17:44

భోపాల్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మధ్యప్రదేశ్‌లో జనజీవనం స్తంభించింది. వరదల తాకిడికి 8 మంది కొట్టుకుపోయారు. మూడు రోజులుగా మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కుండపోతగా కురుస్తున్నాయి. సత్నా, హోషంగాబాద్, జబల్‌పూర్, రాయ్‌సెన్, సాగర్, దామో జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. కరెంటు, నీళ్లు, ఆహారం లేక ప్రజలు అల్లాడిపోతున్నారు.

Pages