S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/08/2016 - 02:58

న్యూఢిల్లీ, జూలై 7: దేశవ్యాప్తంగా ముస్లింలు గురువారం పవిత్ర రంజాన్ పండుగను ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉపవాస దీక్షల విరమణ రోజయిన ఈదుల్ ఫితర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరపడానికి పెద్ద సంఖ్యలో జనం మసీదులు, ఈద్గాలకు పోటెత్తారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు పరస్పరం ఆలింగనం చేసుకుని ఈద్ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

07/08/2016 - 02:56

న్యూఢిల్లీ, జూలై 7: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు నంది ఎల్లయ్యకు చెప్పారు. ఎల్లయ్య గురువారం సోనియాగాంధీని కలిసి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల గురించి వివరిస్తూ ఒక లేఖను అందజేశారు.

07/08/2016 - 02:56

న్యూఢిల్లీ, జూలై 7: బలంగా శక్తినంతా ఉపయోగించి రాయి మీద కొడ్తే తప్ప పగలనంత దృఢత్వం కొబ్బరికాయకుంటుంది. అందుకు కారణం దానిలో ఉండే బలమైన పెంకే అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు శాస్తవ్రేత్తలకు కొబ్బరికాయ బాహ్య నిర్మాణంపై దృష్టిపడింది. భూకంప ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అనుసరించే టెక్నాలజీలో ఈ కొబ్బరి పెంకును స్ఫూర్తిగా తీసుకోవాలని వారు భావిస్తున్నారు.

07/08/2016 - 02:55

న్యూఢిల్లీ, జూలై 7: ఆదాయ వనరులను సమకూర్చుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. స్టేషన్లలో పేరుకుపోతున్న చెత్తను వేలం వేయాలని రైల్వేశాఖ ప్రతిపాదించింది. ‘కిలో చెత్త 1.50 పైసల చొప్పున స్టేషన్లలో సేకరించుకునేలా వేస్టేజ్ మేనేజ్‌మెంట్ గ్రూపునకు అప్పగిస్తాం’ అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. నాన్ టారిఫ్ ఆదాయ మార్గాలపై దృష్టి సారించినట్టు ఆయన చెప్పారు.

07/08/2016 - 02:54

న్యూఢిల్లీ, జూలై 7: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవడేకర్ వెల్లడించారు. కొత్త అనే్వషణలు, పరిశోధనలు కరవై భారత విద్యారంగంలో స్తబ్దత నెలకొందని అన్నారు. గురువారం ఇక్కడ కేంద్ర మానవ వనరుల మంత్రిగా జవడేకర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.

07/08/2016 - 02:51

న్యూఢిల్లీ, జూలై 7: ఈ చిత్రం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కొందరికి ఆశ్చర్యం కలిగిస్తే, మరికొందరికి విస్మయం కలిగిస్తోంది. ఇంకొందరికైతే అసహ్యమూ వేస్తోంది. అవును.. కొన్ని సందర్భాల్లో మనం వినే, చదివే వార్త ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ వార్తా చిత్రం ఇలాంటిదే..

07/08/2016 - 02:49

న్యూఢిల్లీ,జూలై 7: దాదాపు పది సంవత్సరాల సుదీర్ఘకాలం తరువాత అంతర్‌రాష్ట్ర మండలి సమావేశం అవుతోంది. కేంద్ర-రాష్ట్ర సమస్యలు, అంతర్గత భద్రత, దళితులపై దాడులు, రాష్ట్రాల్లో కేంద్ర పథకాల అమలు వంటి అంశాలను సమీక్షించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న అంతర్ రాష్ట్ర మండలి సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.

07/08/2016 - 02:48

న్యూఢిల్లీ, జూలై 7: వారం రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ చోటుచేసుకున్న రెండు ఉగ్ర దాడులను విశే్లషించి అధ్యయనం చేసేందుకు నలుగురు సభ్యులు కలిగిన భారత ఎన్‌ఎస్‌జి బృందం శుక్రవారం బంగ్లాదేశ్ వెళ్లనుంది. బాంబు పేలుళ్లను విశే్లషించడంలో నైపుణ్యం కలిగిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జి) అధికారులు ఈ బృందంలో ఉన్నారు.

07/08/2016 - 02:45

న్యూఢిల్లీ, జూలై 7: వివాదాస్పద భారతీయ ఇస్లాం మతపెద్ద జకీర్ నాయక్ ప్రసంగాలు ఢాకా ఉగ్రవాదులకు ప్రేరణ కలిగించాన్న అంశం రోజురోజుకూ రాజుకుంటోంది. జకీర్ నాయక్‌పై తగిన చర్య తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటంతో ఈ అంశం ఇంకా వేడెక్కింది. గత వారం ఢాకాలో 22మందిని హతమార్చిన ఉగ్రదాడిలో పాల్గొన్న కొందరు టెర్రరిస్టులకు జకీర్ నాయక్ ప్రసంగాలు ప్రేరణ ఇచ్చాయన్న వార్త తీవ్రంగా పరిగణించదగిందని..

07/07/2016 - 17:54

ముంబయి: రంజాన్ పర్వదినం రోజున గురువారం బంగ్లాదేశ్‌లో ఈద్గా మైదానం వద్ద ఉగ్రవాదుల దాడిలో నలుగురు మరణించిన ఘటనపై ముంబయిలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున లేచాయి. ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ కార్యాలయం వద్ద ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఇటీవల ఢాకాలో బాంబు పేలుళ్ల తర్వాత ఓ ఉగ్రవాది మీడియాతో మాట్లాడుతూ తాను ముంబయికి చెందిన జకీర్ నాయక్ ప్రసంగాల ద్వారా స్ఫూర్తి పొందినట్లు చెప్పడం సంచలనం సృష్టించింది.

Pages