S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2016 - 17:21

దిల్లీ: నగరంలోని కన్నౌట్‌ ప్రాంతంలో శనివారం ఓడియన్‌ సినిమా థియేటర్‌లో బాంబు అమర్చినట్లు ఫోన్‌ రావడంతో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, బాంబు స్క్వాడ్‌ హుటాహుటిన థియేటర్‌ని ఖాళీ చేయించారు. తనిఖీల అనంతరం బాంబు లేదని తేలడంతో అంతా తేలిగ్గా వూపిరి పీల్చుకున్నారు. ఎవరో కావాలని ఉత్తుత్తి బెదిరింపు కాల్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

07/09/2016 - 17:16

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కీలక ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో యువకులు పోలీసు పోస్ట్‌లు, సెక్యురిటీ సిబ్బందిపై దాడులకు దిగారు. శుక్రవారం రాత్రి అనంతనాగ్‌లోని కొకేర్‌నాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో బుర్హాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది.

07/09/2016 - 15:26

గాంధీనగర్: ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉండగా బహిరంగ సభలపై ఆంక్షలు విధించి గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారని దిల్లీ సిఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గుజరాత్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ఆయన శనివారం సోమనాథ దేవాలయం వద్ద సమరశంఖం పూరించారు.

07/09/2016 - 14:27

తిరువనంతపురం: కేరళలోని కాసరగోడ్ జిల్లాలో నెల రోజుల క్రితం అదృశ్యమైన 13 మంది ముస్లిం మతస్థులు ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉద్రవాద సంస్థలో చేరారన్న అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. అదృశ్యమైన వారిలో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘మేం అనుకున్న గమ్యానికి చేరాం..’ అంటూ వీరి నుంచి సెల్‌ఫోన్‌లో మెసేజీలు రావడంతో బంధువులు ఆందోళన చెందుతున్నారు.

07/09/2016 - 12:16

శ్రీనగర్‌: దక్షిణ కశ్మీర్‌ ప్రాంతంలో ఆందోళనకారులకు, భద్రతాసిబ్బందికి మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్‌ గుండా అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. కశ్మీర్‌ లోయ ప్రాంతంలో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కీలక ఉగ్రవాది బుర్హాన్‌ వనీ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో హతమైన నేపథ్యంలో శ్రీనగర్‌ సహా పలు చోట్ల కర్ఫ్యూ విధించారు.

07/09/2016 - 11:50

దిల్లీ: దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీపై తెలంగాణ భాజపా నాయకులు దిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు శనివారం ఫిర్యాదు చేశారు. ఒవైసీ ఉగ్రవాదులకు న్యాయసహాయం చేస్తామనడం సరికాదన్నారు. హైదరాబాద్‌లో ఉగ్రవాదులకు ఎంఐఎం సహకరిస్తోందని ఆరోపించారు. అసదుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని, పార్లమెంట్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

07/09/2016 - 08:05

న్యూఢిల్లీ, జూలై 8: దేశంలోని పలు ప్రముఖ స్థలాలను శుభ్రం చేసేందుకు చేపేట్టిన స్వచ్ఛ్భారత్ పైలట్ ప్రాజెక్టులో ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతి చోటు దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కింద చేపట్టే వంద ప్రముఖ స్థలాల్లో తొలి పదింటిని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.

07/09/2016 - 08:04

బెర్హంపూర్ (ఒడిశా), జూలై 8: సాక్షాత్తూ జగన్నాథునికే ఆ ఆలయం ఒకప్పుడు ఆశ్రయమిచ్చింది. ముస్లిం పాలకుల ఆక్రమణదారులనుంచి ఆయనకు ఏకంగా రక్షణ కల్పించింది. అయినా ఏం లాభం? ఒడిశా సహా దేశవ్యాప్తంగా ఎంతో భక్తిశ్రద్ధలతో జగన్నాథ రథయాత్ర జరిగినా అక్కడ మాత్రం రథచక్రాలు కదల్లేదంటే ఆశ్చర్యపడాల్సిందే. రథయాత్ర మాట జగన్నాథుడెరుగు... కనీసం ఎలాంటి సందడి కూడా లేదు.

07/09/2016 - 08:01

తిరువనంతపురం, జూలై 8: కేరళలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం 2016-17 బడ్జెట్‌లో సంక్షేమపథకాలు, ప్రజారోగ్యం, విద్యకు పెద్దపీట వేసింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్యాక్డ్ఫుడ్‌పై ఐదుశాతం పన్ను, అలాగే బర్గర్లు, పిజ్జాలపై ‘్ఫ్యట్‌టాక్స్’ 14.5 శాతం పన్ను ప్రతిపాదించింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుతం పన్నుల ద్వారా ఆదాయాలు సమకూర్చుకోవాలని నిర్ణయించింది.

07/09/2016 - 08:00

న్యూఢిల్లీ, జూలై 8: ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు సంబంధించి సుప్రీం కోర్టు శుక్రవారం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర, రాష్ట్రాల వివాదాల విషయంలో ముందుగా హైకోర్టు విచారణ జరపాలా లేక దీన్ని సుప్రీం కోర్టే విచారించాలా అన్న అంశంపై కేజ్రీవాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

Pages