S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/08/2016 - 16:37

పాట్నా: అత్తవారింట మరుగుదొడ్డి లేకపోవడంతో ఇబ్బంది పడిన ఓ కోడలు చివరికి భర్తకు విడాకులిచ్చేసింది. బిహార్‌లోని కొత్వా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బబ్లూకుమార్, అర్చనకు గత మే నెలలో వివాహం జరిగింది. పెళ్లయ్యాక అత్తవారింట చేరిన ఆమెకు అక్కడ మరుగుదొడ్డి లేదని తెలిసి భర్తను నిలదీసింది. పలుసార్లు ఈ విషయం అడిగినా పట్టించుకోని భర్త తన వద్ద డబ్బుల్లేవని చేతులెత్తేశాడు.

07/08/2016 - 16:36

దిల్లీ: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో శుక్రవారం ఇక్కడ బిజెపి కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఎపి బిజెపి అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ఎపిలో పార్టీ బలోపేతానికి చర్యలు, మిత్రపక్షమైన టిడిపితో సంబంధాలు తదితర విషయాలను చర్చించారు. భవిష్యత్ కార్యాచరణ గురించి పార్టీ నాయకులను అమిత్ షా మార్గనిర్దేశం చేశారు.

07/08/2016 - 15:28

ఢిల్లీ: తెలంగాణకు వాటా ప్రకారం నీటి కేటాయింపులు జరగలేదని, ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించగా 260 టీఎంసీలే తెలంగాణకు దక్కిందని నీటి పంపకాల అంశంపై బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌ ఎదుట శుక్రవారం తెలంగాణ తన వాదనలు వినిపించింది. తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్ రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నీటి కేటాయింపు వివరాలను ట్రిబ్యునల్‌కు అందజేసారు.

07/08/2016 - 12:50

ముంబయి: ప్రధాని మోదీ క్యాబినెట్ విస్తరణలో తమకు అవకాశం లభించలేదని అలక వహించిన శివసేన నేతలను బిజెపి నాయకత్వం మరో రూపంలో మచ్చిక చేసుకుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గంలో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలకు స్థానం కల్పించారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శుక్రవారం కొత్తగా 9 మందితో తన మంత్రివర్గాన్ని విస్తరించారు. రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు.

07/08/2016 - 11:18

దిల్లీ : ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలతో దియోలి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ జర్వాల్‌ను శుక్రవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2014 మేలో కూడా దిల్లీ జల్‌బోర్డ్‌ జూనియర్‌ ఇంజనీర్‌పై చేయిచేసుకోవడంతో ప్రకాశ్‌ జర్వాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/08/2016 - 06:20

న్యూఢిల్లీ, జూలై 7: ఢిల్లీ, చెన్నైలలో హింసాకాండకు పాల్పడడం అలాగే తెలంగాణలో సమ్మెకు దిగిన అంశాల నేపథ్యంలో దేశంలో న్యాయవాద వృత్తికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు కోరింది. న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తనకు సంబంధించిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

07/08/2016 - 05:36

న్యూఢిల్లీ, జూలై 7: మాదక ద్రవ్యాల కేసులో కువైట్‌లో ఉరిశిక్ష పడిన 14 మంది తెలుగు వారికి శిక్ష తగ్గించేలా చర్యలు చేపడతామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చినట్లు మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి చెప్పారు. ఆమెతో పాటుగా భాజపా నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రమేష్‌నాయుడు, రఘురామ్ తదితరులు మంత్రి సుష్మాస్వరాజ్‌ను గురువారం కలిశారు.

07/08/2016 - 04:50

హరిద్వార్/న్యూఢిల్లీ, జూలై 7: పవిత్ర గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం బృహత్తర నమామీ గంగా పేరుతో గురువారం శ్రీకారం చుట్టింది. 1500 కోట్ల రూపాయల భారీ వ్యయంతో శుద్ది కర్మాగారాలు, ఘాట్‌లతో సహా మొత్తం 231 ప్రాజెక్టులను ఏడు రాష్ట్రాల్లో చేపడతారు. గంగా నదీ జలాలను శుద్ధి చేయడంతో పాటు దాని ప్రవాహానికీ ఎలాంటి అవరోధం లేకుండా చర్యలు చేపడతారు.

07/08/2016 - 03:05

లక్నో, జూలై 7: మూడువందల ఏళ్ల చరిత్ర కలిగిన లక్నోలోని ఐష్‌బాగ్ ఈద్గాలో మహిళలకు ప్రవేశం కల్పించారు. పురుషులతో కలిసి మహిళలు ప్రార్థనలు చేయడం ఈద్గా చరిత్రో ఇదే తొలిసారి అని సిఎన్‌ఎన్-న్యూస్ 18 వార్తా చానల్ తెలిపింది.

07/08/2016 - 03:03

న్యూఢిల్లీ, జూలై 7: మంజూరయిన అధికారుల సంఖ్యలో కేవలం 40 శాతం మందితో పని చేస్తున్న ఢిల్లీ ప్రభుత్వం ఆ లోటును భర్తీ చేసుకోవడానికి నిపుణుల సేవలను తీసుకుంటుందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. గురువారం అన్ని దినపత్రికల్లో ఇచ్చిన పూర్తి పేజి ప్రకటనల్లో సిసోడియా ఈ వ్యాఖ్యలు చేశారు.

Pages