S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/04/2016 - 12:29

దిల్లీ: అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై ఈరోజు పార్లమెంటులో చర్చ జరిగే అవకాశం ఉన్నందున బిజెపి, కాంగ్రెస్ పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. బుధవారం ఉదయం ఈ రెండు పార్టీలు సమావేశమై తమ వ్యూహరచనకు పదునుపెట్టాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన బిజెపి ఎంపీల సమావేశంలో పలువురు కేంద్రమంత్రులు పాల్గొన్నారు.

05/04/2016 - 08:14

న్యూఢిల్లీ,మే 3: తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ఆడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీలో కొనసాగుతున్న అవకతవకలపై దర్యాప్తు జరిపించి తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో 371 నోటీసు కింద ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

05/04/2016 - 07:55

న్యూఢిల్లీ,మే 3: దేశంలోని బడుగ,బలహీన వర్గాల వారితోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దోచుకుంటున్న ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులను నియంత్రించేందుకు జాతీయ స్థాయి రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్ సభ్యుడు మహమ్మద్ అలీ ఖాన్ డిమాండ్ చేశారు.

05/04/2016 - 07:53

న్యూఢిల్లీ,మే 3: ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం కలిగిస్తున్న విభజన చట్టంలోని మూడు విభాగాలను సవరించాలని తెలుగుదేశం సభ్యుడు గళ్లా జయదేవ్ డిమాండ్ చేశారు. గళ్లా జయదేవ్ మంగళవారం లోకసభ జీలో అవర్‌లో మాట్లాడవుతూ ఏ.పి.విభజన చట్టంలోని 50, 51, 56 విభాగాలు పరస్పర వ్యతిరేక అర్థాన్ని ఇస్తున్నాయి, దీని మూలంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

05/04/2016 - 07:53

న్యూఢిల్లీ, మే 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు తాను రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు కె.వి.పి రామచందర్‌రావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రి తాను రాసిన లేఖను రామచందర్‌రావు మంగళవారం పత్రికలకు విడుదల చేశారు.

05/04/2016 - 06:52

న్యూఢిల్లీ, మే 3: పఠాన్‌కోట్ వాయుసేనా కేంద్రం ఇప్పటికీ సురక్షితంగా లేదని.. ఎయిర్‌బేస్‌కి పెనుముప్పు ఇంకా పొంచి ఉన్నదని పార్లమెంటరీ స్థారుూ సంఘం అభిప్రాయపడింది. దేశంలో అత్యంత కీలక రక్షణ స్థావరమైన పఠాన్‌కోట్‌లో భద్రత చర్యలు పటిష్టం చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ సంఘం అభిప్రాయపడింది.

05/04/2016 - 06:52

న్యూఢిల్లీ, మే 3: అగస్టా వెస్ట్‌లాండ్ హెలికాప్టర్ల ఒప్పందంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ముడుపులు అందాయని తాను నమ్ముతున్నానని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు.

05/04/2016 - 06:51

న్యూఢిల్లీ, మే 3: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో తన పర్యవేక్షణలో బలపరీక్ష నిర్వహించే అవకాశాలున్నాయేమో పరిశీలించి తనకు తెలియజేయాలని సుప్రీంకోర్టు మంగళవారం అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. రాష్ట్రంలో రాష్టప్రతి పాలనను ఎత్తివేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసుకున్న అపీల్‌పై విచారణను సుప్రీంకోర్టు బుధవారం దాకా వాయిదా వేసింది.

05/04/2016 - 06:49

కొచ్చి/తిరువనంతపురం, మే 3: కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో కొద్ది రోజుల క్రితం దళిత సామాజిక వర్గానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్థిని (30) అత్యాచారానికి, దారుణ హత్యకు గురవడాన్ని ఖండిస్తూ విద్యార్థులు, మానవ హక్కుల కార్యకర్తలు నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తున్నారు. దీంతో పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

05/04/2016 - 06:45

టర్కీ పార్లమెంట్‌లో అధికార, విపక్ష సభ్యులు ముష్టిఘాతాలకు దిగారు. ప్రాసిక్యూషన్ నుంచి ఎంపీలకు రక్షణ లేకుండా చేసేందుకు పార్లమెంట్‌లో ప్రయత్నాలు జరుగుతుండటంతో ఇరుపక్షాల మధ్య ఈ ఘర్షణ తలెత్తింది. రాజ్యాంగానికి ప్రభుత్వం చేయతలపెట్టిన సవరణలపై చర్చించేందుకు సంబంధిత కమిటీ పార్లమెంట్‌లో సమావేశమైన వెంటనే అధికార ఎకె పార్టీ సభ్యులకు, కుర్దు అనుకూల రాజకీయ నాయకులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

Pages