S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/03/2016 - 02:50

పాల, మే 2: కేరళలో అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరు, ఓటమంటే ఎరగని కేరళ కాంగ్రెస్ (ఎం) అధినేత కెఎం మణి 13వ సారి పాల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 83 ఏళ్ల మణి ఇదే నియోజకవర్గం నుంచి 12 సార్లు గెలిచారు. ఈ నెల 16న కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభ్యునిగా స్వర్ణోత్సం జరుపుకొన్న మణి మళ్లీ గెలవడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

05/03/2016 - 02:47

కొచ్చి, మే 2: న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం వైపునుంచి ఎలాంటి విధానపరమైన జాప్యం జరగలేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ సోమవారం స్పష్టం చేశారు. న్యాయమూర్తుల నియామకం కేవలం న్యాయ వ్యవస్థ చేతుల్లోనే ఉందని ఆయన చెప్పారు.

05/03/2016 - 02:45

వాషింగ్టన్, మే 2: భారత్, చైనా వంటి ఆసియా దేశాలలో వేగంగా పెరుగుతున్న బొగ్గు వినియోగం వల్ల భవిష్యత్తులో రుతుపవన వ్యవస్థలు బలహీనపడే అవకాశం ఉందని, తద్వారా వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

05/03/2016 - 02:43

న్యూఢిల్లీ, మే 2: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్రం రంగంలోకి దిగింది. మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నందున దీనికి చెక్‌పెట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాలకు లైసెన్సులు ఇవ్వవద్దని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. తప్పతాగి వాహనాలు నడపడం వల్లే గత ఐదేళ్లలో 1,18,840 మంది మృతి చెందారు.

05/03/2016 - 02:40

న్యూఢిల్లీ, మే 2: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌కు హాజరయ్యే అంధులు, మెదడు పక్షవాతం వచ్చినవారు, కీళ్లు-కండరాలకు సంబంధించిన బలహీనతలు ఉన్నవారు.. ఇకపై లేఖకుల సహకారంతో పరీక్షలు రాయొచ్చు. ఈ రకమైన వికలాంగులు పరీక్షలు రాసేందుకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సహాయకులను ఏర్పాటు చేసుకునే సౌకర్యాన్ని యూపీఎస్సీ కల్పించింది.

05/03/2016 - 02:38

న్యూఢిల్లీ, మే 2: అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి వచ్చిన అవినీతి ఆరోపణలపై భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ అధినేత ఎస్‌పి త్యాగిని సిబిఐ సోమవారం ప్రశ్నించింది. త్యాగి ఉదయం పది గంటలకు ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. భారత్‌కు హెలికాప్టర్లు సరఫరా చేయడానికి రూ.

05/03/2016 - 02:36

న్యూఢిల్లీ, మే 2: విభజన గాయాల నుండి ఆంధ్రప్రదేశ్ బతికి బట్టకట్టాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సభ్యుడు అవంతి శ్రీనివాసరావు ఎన్‌డిఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధించుకునేందుకు రాష్ట్ర ప్రజలు ఉద్యమ బాట పట్టే ప్రమాదం ఉన్నదని శ్రీనివాసరావు హెచ్చరించారు. అవంతి శ్రీనివాసరావు సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు.

05/03/2016 - 02:31

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరాఖండ్ అడవిని దగ్ధం చేస్తున్న దావానలం అదుపులోకి వచ్చిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఈ దావానలం కారణంగా ప్రాణనష్టం ఏదీ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో భయపడాల్సింది ఏమీ లేదని.. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం మంటల్ని అదుపులోకి తీసుకురావటంలో సమర్థంగా పనిచేస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. తాను కూడా పరిస్థితిని సమీక్షించినట్లు వెల్లడించారు.

05/03/2016 - 02:23

గూడూరుటౌన్,మే 2: అహ్మదాబాద్ నుండి చైనె్న వెళ్లే నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగుకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్‌కు సోమవారం మధ్యాహ్నం 3.20 నిమిషాలకు చేరుకున్న రైలు అందులో తాగునీరు,విద్యుత్ సరఫరా లేదని అగ్రహించిన ప్రయాణికులు గూడూరు స్టేషన్‌మాస్టర్‌కు ఫిర్యాదు చేయగా టిఎక్స్‌అర్ డిపాంట్‌మెంట్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించారు.

05/03/2016 - 02:22

న్యూఢిల్లీ, మే 2: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ మద్యం వ్యాపారి విజయ్ మాల్యా సోమవారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. దేశంలోని వివిధ బ్యాంకులకు ఉద్ధేశ్యపూర్వకంగా దాదాపు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి విదేశానికి పారిపోయిన మాల్యా ఈ వ్యవహారంలో రాజ్యసభ హక్కుల కమిటీకి సమాధానం ఇవ్వాల్సిన గడువు ముగియడానికి ఒక రోజు ముందే ఈ పరిణామం చోటుచేసుకుంది.

Pages