S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/04/2016 - 18:00

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి ప్రకటించిందని, ఇదే విషయాన్ని ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా చెప్పారని అందుకు విరుద్ధంగా నేడు ప్రకటనలు చేయడం అన్యాయమని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం లోక్‌సభలో అన్నారు. యుపిఎ, ఎన్‌డిఎ నేతలు ఇచ్చిన హామీలకు తాము మోసపోయామన్న ఆవేదన నేడు ఎపి ప్రజల్లో గూడుకట్టుకుంటోందన్నారు.

05/04/2016 - 17:59

దిల్లీ: హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రి యాజమాన్యానికి కేంద్ర వైద్యశాఖ బుధవారం నోటీసులు జారీ చేసింది. ఎంపీ ఎంఎ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని రాజ్యసభ సచివాలయం సూచనల మేరకు వైద్యశాఖ నోటీసులిచ్చింది. తన భార్యకు యశోద ఆస్పత్రిలో సరైన చికిత్స జరగలేదని, అనవసరమైన టెస్టులన్నీ చేయించారని ఖాన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

05/04/2016 - 17:10

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రమంత్రులు పదే పదే ప్రకటించినా ఈ విషయమై తాము రాజీలేని పోరాటం చేస్తామని దిల్లీలో ఎపి ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు బుధవారం తెలిపారు. ప్రత్యేక హోదా గురించి ఆనాడు విభజన చట్టంలో చేర్చి ఉంటే నేడు ఈ అవస్థలు వచ్చి ఉండేవి కావన్నారు.

05/04/2016 - 17:09

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా వస్తుందనుకుంటున్న వారి ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని కొద్దిరోజుల క్రితం కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ప్రకటించగా, తాజాగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి సిన్హా ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేశారు.

05/04/2016 - 14:46

దిల్లీ: బ్యాంకులకు రుణాల ఎగవేత, మనీ ల్యాండరింగ్ తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ‘పెద్దల సభ’లో సభ్యుడిగా ఉండేందుకు అనర్హుడని రాజ్యసభకు చెందిన ఎథిక్స్ కమిటీ బుధవారం తీర్మానించింది. మాల్యాను ఇంకా రాజ్యసభ ఎంపీగా కొనసాగనిస్తే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని కమిటీ అభిప్రాయపడింది. ఎంపీ కరణ్‌సింగ్ అధ్యక్షతన జరిగిన ఎథిక్స్ కమిటీ తన నివేదికను రాజ్యసభలో చర్చకు పంపింది.

05/04/2016 - 13:45

దిల్లీ: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎపికి కేంద్రం అదనపు నిధులు మంజూరు చేయాలని టిడిపి ఎంపీలు కోరారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాసంలో బుధవారం ఉదయం టిడిపి ఎంపీలు సమావేశమై ఈమేరకు ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే కేంద్రం కొంతమేరకు నిధులిచ్చినా, ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అదనంగా కేటాయింపులు చేయాలన్నారు. ఎపికి ప్రత్యేకహోదా వస్తుందన్న ఆశ ఇంకా తమకు ఉందని సుజనా అన్నారు.

05/04/2016 - 13:38

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌ వృత్తి పరీక్షల బోర్డు అక్రమాలకు సంబంధించిన (వ్యాపం కుంభకోణం) కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రమేశ్‌ శివ్‌హరేని బుధవారం కాన్పూర్‌లో అరెస్టు చేసినట్లు యూపీ డీజీపీ జావేద్‌ అహ్మద్‌ తెలిపారు. సీబీఐతో కలిసి ఉత్తరప్రదేశ్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ చేపట్టిన తనిఖీల్లో భాగంగా- ఇంతకాలం పరారీలో ఉన్నరమేశ్‌ని అరెస్టు చేశారు.

05/04/2016 - 12:33

కడప: అగస్టా కుంభకోణంలో ఓ నిందితుడితో దివంగత సిఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌కు సంబంధాలున్నాయని టిడిపి ఎంపీ సిఎం రమేష్ బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ఈ విషయాన్ని 2012లోనే రాజ్యసభలో ప్రస్తావించినా అప్పటి యుపిఎ ప్రభుత్వం స్పందించలేదన్నారు. సిబిఐ చేత సమగ్ర విచారణ జరిపిస్తే అనిల్ ప్రమేయంపై వాస్తవాలు వెలుగుచూస్తాయన్నారు.

05/04/2016 - 12:32

జబల్పూర్: పుట్టిన 22 నిమిషాలకే ఆ ఆడశిశువు పేరిట ఆధార్ కార్డు వచ్చేసింది. ఈ అద్భుత ఘటన మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. తల్లి ప్రసవించిన వెంటనే పాపకు ‘రాఖీ’ అని తాత్కాలికంగా ఓ పేరు పెట్టి, ఇతర వివరాలన్నింటినీ ఆధార్ కేంద్రానికి ఆస్పత్రి సిబ్బంది పంపారు.

05/04/2016 - 12:32

దిల్లీ: ఉగ్రవాదులు బాంబుదాడులకు పాల్పడవచ్చని ఇంటెలిజన్స్ వర్గాల నుంచి సమాచారం రావడంతో దిల్లీలో బుధవారం ఉదయం నుంచి పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ సందర్భంగా 12 మంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జైష్ ఎ అహమ్మద్ సంస్థకు చెందిన 8 మంది అనుమానితులను అరెస్టు చేసి, బాంబుల తయారీకి ఉపయోగించే పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Pages