S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

05/03/2016 - 16:36

దిల్లీ: మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్లకు నిర్వహించే ‘నీట్’ (జాతీయ స్థాయి అర్హత పరీక్ష)పై విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ‘నీట్’ నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలంటూ ఎపి, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, యుపి రాష్ట్రాల నుంచి అభ్యర్థనలు అందినందున ఈ విషయమై సమాధానం ఇవ్వాలని భారత వైద్య మండలి, సిబిఎస్‌ఇ, కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

05/03/2016 - 14:21

దిల్లీ: ఉత్తరాఖండ్‌లో పదవీచ్యుతుడైన ముఖ్యమంత్రి హరీష్ రావత్ అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు మంగళవారం నాడు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనను రద్దు చేస్తూ నైనిటాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ‘స్టే’ విధించిన సుప్రీం కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేస్తూ కేసు విచారణను బుధవారానికి వాయిదా వేసింది. సుప్రీం ఆదేశంపై కేంద్రం ఇంకా స్పందించాల్సి ఉంది.

05/03/2016 - 11:56

బెంగళూరు: దక్షిణ బెంగళూరు ప్రాంతంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువతిని ఎత్తుకెళ్లిన ఘటనలో నిందితుడు అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గతనెల 23న యువతిని కిడ్నాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నిలబడి ఫోన్‌లో మాట్లాడుతున్న 22 ఏళ్ల యువతిని ఓ యువకుడు బలవంతంగా ఎత్తుకుని మోసుకునిపోతున్న దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారం కావడం సంచలనాన్ని సృష్టించింది.

05/03/2016 - 11:55

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం పార్లమెంట్ లైబ్రరీ హాలులో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం, దేశంలో కరవు పరిస్థితులు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.

05/03/2016 - 05:29

కొచ్చి, మే 2: న్యాయ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న 30 ఏళ్ల దళిత యువతిపై ఢిల్లీ నిర్భయ ఘటన తరహాలో అత్యాచారం, దారుణ హత్య జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టం నివేదికలో ఈ విష యం వెల్లడైంది. కేరళలోని పెరుంబవూర్‌కు సమీపాన సదరు యువతి నివాసంలో గత నెల 28వ తేదీన ఈ దారుణం జరిగింది.

05/03/2016 - 05:28

ముంబయి, మే 2: 1993 ముంబయి సీరియల్ బాంబు పేలుళ్ల కేసులో శిక్ష అనుభవించి, ఇటీవలే జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ అకస్మాత్తుగా ఆదివారం మహారాష్టల్రో ఓ బీజేపీ కార్యక్రమంలో ప్రత్యక్షం కావటంపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ జాతి విద్రోహ లక్షణానికి ఇది మంచి ఉదాహరణ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఇది బీజేపీకి కొత్త కాదని ఆ పార్టీ నేత నిజాముద్దీన్ రరుూన్ అన్నారు.

05/03/2016 - 05:28

శంషాబాద్, మే 2: ఢిల్లీ నుండి విజయవాడకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపాల కారణంగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ఇందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఏం జరిగిందో వివరించకుండానే సుమారు రెండున్నర గంటలు విమానంలోనే ఉంచడంపై ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.

05/03/2016 - 05:19

హైదరాబాద్, మే 2: మారిషస్ కమర్షియల్ కేసులో హైకోర్టు ఆదేశానుసారం కేంద్ర మంత్రి వై సత్యనారాయణ చౌదరి నాంపల్లిలోని 12వ, అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుకు సోమవారం హాజరయ్యారు. చౌదరిపై ఏప్రిల్ 12న నాన్ బెయిలేబుల్ వారంట్ జారీ అయిన విషయం విధితమే.

05/03/2016 - 04:58

బెంగళూరు, మే 2: ఈశాన్య బెంగళూరులో 22ఏళ్ల యువతిని పట్టపగలే అపహరించుకుపోయిన ఘటన విస్మయానికి గురిచేసింది. ఆమెను అపహరించుకుపోయిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజిలో రికార్డు అయ్యాయి. పేయింగ్ గెస్ట్ హాస్టల్ ముందు ఫోన్‌లో మాట్లాడుతున్న యువతిని వెనుకనుంచి వచ్చిన ఓ వ్యక్తి చేతులతో ఎత్తుకుని గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకువెళ్లాడు. కొద్దిసేపటి తరువాత ఆమెను వదిలేసి అతను పారిపోయాడు.

05/03/2016 - 02:54

న్యూఢిల్లీ, మే 2: ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు తిరిగి స్వర్ణయుగం తీసుకువచ్చేందుకు ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తురుపుముక్కల్ని ప్రయోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీని కానీ, రాహుల్ గాంధీని కానీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదిస్తున్నారు. 2014 ఎన్నికల్లో మోదీకి ప్రచార వ్యూహకర్తగా..

Pages