S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/17/2019 - 02:29

జైపూర్, జనవరి 16: రాజస్థాన్ రాష్ట్ర అసెంబ్లీ 15వ స్పీకర్‌గా కేంద్ర మాజీ మంత్రి సీపీ జోషి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశానుసారం జోషి పేరును నాద్‌ద్వారకు చెందిన నేత ప్రతిపాదించారు. మూజువాణి ఓటు ద్వారా ఆయన ఎన్నికకు సభ్యులు సమ్మతి తెలపడంతో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తున్న గులాబ్ చందర్ కఠారియా నుంచి సీపీ జోషీ (68) స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

01/17/2019 - 02:14

కోల్‌కొతా, జనవరి 16: పశ్చిమబెంగాల్‌లో ఈ నెల 20 వ తేదీ నుంచి బీజేపీ మూడు రోజుల పాటు మహా ర్యాలీలను నిర్వహించనుంది. ఈ వివరాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు.

01/17/2019 - 02:13

రాబోయే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం న్యూఢిల్లీలోని రాజ్‌పథ్ వద్ద
కవాతు రిహార్సల్స్ చేస్తున్న పోలీసులు, అసోం రైఫిల్స్‌కు చెందిన మహిళా జవాన్లు

01/17/2019 - 02:11

ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఎంపికై, బుధవారం బాధ్యతలు స్వీకరించిన
మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను గజ మాలతో సత్కరిస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు

01/17/2019 - 02:06

‘మేఘ్ బిహూ’ పండుగను పురస్కరించుకొని కాంరప్‌లో బుధవారం
సంప్రదాయ దుస్తుల్లో నృత్యం చేస్తున్న ఆదివాసీ గిరిజన మహిళలు

01/17/2019 - 02:04

న్యూఢిల్లీ, జనవరి 16: రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, కామనె్వల్త్ గేమ్స్ పతక విజేత మనీకా బాత్రా ఓటింగ్‌పై ఢిల్లీలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. ఓటింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన శిబిరం (వీఏఎఫ్)ను ఢిల్లీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ (సీఈఓ) రణ్‌భీర్ సింగ్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు.

01/17/2019 - 02:02

న్యూఢిల్లీ, జనవరి 16: అస్సాంలోని నుమలిగర్ రీఫైనరీ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ బృహత్ ప్రాజెక్టు ఖర్చు అంచనా రూ.22,594 కోట్లు. ప్రస్తుతం ఈ రీఫైనరీ సామర్ధ్యం మూడు మిలియన్ మెట్రిక్ టన్నులుకాగా దీన్ని యేడాదికి 9 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచే విధంగా ఈ ప్రాజెక్టు ప్రణాళిక రూపొందింది. మొత్తం 48 నెలల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సివుంది.

01/17/2019 - 02:02

ముంబయి, జనవరి 16: గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న బ్రిహాన్‌ముంబయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్ (బీఈఎస్‌టీ)కి చెందిన దాదాపు 30వేల మంది కార్మికులు ఎట్టకేలకు తమ ఆందోళనను విరమించారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులకు ఎంతో ఊరట లభించింది.

01/17/2019 - 02:01

చెన్నై, జనవరి 16: ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో చేతులు కలపడానికి ఏ పార్టీ సిద్ధంగా లేదని తమిళనాడు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తాము ఏ పార్టీతోనైనా కలవడానికి సిద్ధమేనని ప్రధాని మోదీ ఇటీవల ప్రకటన చేసిన నేపథ్యంలో తమిళనాడు కాంగ్రెస్ అద్యక్షుడు సు తిరునవుక్కరసర్ మాట్లాడుతూ ‘మన ప్రధాని నరేంద్ర మోదీ విశాల హృదయంతో అన్ని పార్టీలకు ఆహ్వానం పలికారు..

01/17/2019 - 01:48

నోయిడా, జనవరి 16: దేశంలో గత పదేళ్లలో అభయారణ్యాల్లో వేటగాళ్లు 429 పులులను వధించారు. ఇందులో మధ్యప్రదేశ్‌లో 71 పులులను చంపారు. ఈ వివరాలను సమాచార హక్కు కింద వెల్లడించారు. 2011లో గరిష్టంగా 80 పులులను వేటగాళ్లు వేటాడి చంపారు. 2015లో కనిష్ట స్థాయిలో వేటగాళ్ల చేతిలో 17 పులులు హతమయ్యాయి. వన్యప్రాణి క్రైమ్ కంట్రోల్‌బ్యూరో పేర్కొంది. ఈ సంస్థను కేంద్రం చట్టబద్ధంగా ఏర్పాటు చేసింది.

Pages