S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/18/2019 - 23:16

న్యూఢిల్లీ, జనవరి 18: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా శుక్రవారం ఉదయం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కనీసం 450 విమానాల సర్వీసులకు అంతరాయం కలిగింది. ఈపరిస్థితి ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ కనిపించింది. విమానాలు ఆలస్యంగా రావడమో లేదా దారి మళ్లించడంతో జరిగిందని అధికారులు వెల్లడించారు.

01/18/2019 - 23:14

లక్నో, జనవరి 18: ఈబీసీలకు పదిశాతం రిజర్వేషన్లను కల్పిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్య, ఉద్యోగాల్లో పది శాతం కోటాను వర్తింపచేస్తున్నట్లు యూపీ మంత్రి వర్గం ప్రకటించింది. అగ్రవర్ణాల్లోని పేదలకు ఈ రిజర్వేషన్లను కల్పిస్తారు. ఈ వివరాలను మంత్రివర్గం తరఫున ప్రతినిధి శ్రీకాంత శర్మ విలేఖర్లకు తెలిపారు.

01/18/2019 - 22:54

న్యూఢిల్లీ, జనవరి 18: లోక్‌సభ ఎన్నికలను ఈ ఏడాది ఏప్రిల్, మేలో నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను మార్చ్ మొదటి వారంలో విడుదల చేయనున్నట్టు తెలిసింది.

01/18/2019 - 16:57

ముంబయి: డ్యాన్స్ బార్ల నిర్వహణపై అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకువస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ విభాగం అధికారులతో చర్చించిన తరువాత డ్యాన్స్ బార్లపై నిషేధం విధించేందుకు అవసరమైతే చట్టాన్ని తీసుకువస్తామని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివర్ వెల్లడించారు.

01/18/2019 - 16:56

కోల్‌కతా: బీజేపీకి వ్యతిరేకంగా రేపు కోల్‌కతాలో ప్రతిపక్షాల ర్యాలీకి రావాల్సిందిగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సీఎం కేసీఆర్‌కు ఫోన్ చేశారు. అయితే కేసీఆర్ ఈ ర్యాలీకి హాజరయ్యే అవకాశాలు లేవు.

01/18/2019 - 16:55

న్యూఢిల్లీ: అయ్యప్ప ఆలయంలోకి ఇప్పటి వరకు 51మంది మహిళలు ప్రవేశించారని కేరళ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన నోట్‌లో పేర్కొంది. అయ్యప్పను దర్శించుకున్నవారంతా 50 సంవత్సరాలలోపు వారేనని పేర్కొంది. దర్శనం కోసం 16 లక్షల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు 8.2 లక్షల మంది దర్శించుకున్నట్లు ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది.

01/18/2019 - 16:54

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ మమతాబెనర్జీ శనివారంనాడు నిర్వహిస్తున్న ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈమేరకు ఆయన మమతాబెనర్జీకి ఓ లేఖ రాశారు. బీజేపీ, మోదీ ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలు నైరాశ్యంలో కూరుకుపోయారని, వారు రేపటి గురించి ఆందోళనచెందుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతిపక్షాలు ఏకంకావాలని పిలుపునిచ్చారు.

01/18/2019 - 16:59

న్యూఢిల్లీ: శ‌బ‌రిమ‌ల అయ్యప్ప స్వామిని ద‌ర్శించుకున్న ఇద్దరు మ‌హిళ‌ల‌కు 24 గంట‌లూ రౌండ్ ద క్లాక్ సెక్యూర్టీ క‌ల్పించాల‌ని కేర‌ళ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు త‌న తీర్పులో ఆదేశించింది. 50 ఏళ్ల లోపు వ‌య‌సు ఉన్న మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లి అయ్యప్పను ద‌ర్శించుకోవ‌చ్చు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన త‌ర్వాత క‌న‌క‌దుర్గ‌, బిందు అనే ఇద్దరు మ‌హిళ‌లు శ‌బ‌రిమ‌ల అయ్యప్పను ద‌ర్శించుకున్నారు.

01/18/2019 - 13:05

జయపుర: రాజస్థాన్ బీజేపీ ఉపాధ్యక్షుడు జ్యాన్‌దేవ్ ఆహుజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తుల్లో చివరివాడైన ఔరంగజేబు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ చివరి చక్రవర్తి రాహుల్ అని, ఇక కాంగ్రెస్ శకం ముగిసిపోయిందని అన్నారు.

01/18/2019 - 13:04

న్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీతో పాటు మేఘాలయ, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, అసోం, త్రిపుర రాష్ట్రాలలో పొగ మంచు కురుస్తుండటంతో ప్రయాణీకులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలు ఆలస్యంగా జరుగుతున్నాయి. ప్రయాణ సమయాలను పొడిగించారు. దాదాపు 10 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

Pages