S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/28/2018 - 22:07

బెంగళూరు, డిసెంబర్ 28: రామమందిరం ఎందుకు అవసరం లేదు అనే పేరుతో కేఎస్ భగవాన్ రాసిన పుస్తకం వివాదస్పదంగా మారింది. ఈ పుస్తక రచయిత ఈ పుస్తకంలో శ్రీరామచంద్రుడిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు రాశారని ఆరోపిస్తూ హిందుత్వవాద సంస్థలు శుక్రవారం ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. శ్రీరామచంద్రుడు దేవుడు కారని, ఇతర మానవుల మాదిరిగానే అనేక బలహీనతలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

12/28/2018 - 22:06

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: యాక్సిడెంటల్ ప్రధానమంత్రి పేరుతో తీసిన సినిమాను అడ్డుపెట్టుకుని బీజేపీ తమ పార్టీని విమర్శించేందుకు చేస్తున్న ప్రయత్నాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. ఈ సినిమాలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌గా బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు.

12/28/2018 - 21:54

ముంబయి, డిసెంబర్ 28: మంచి ఆరోగ్యం, శక్తివంతమైన ఆలోచనలకు యోగాభ్యాసం పరిష్కారమని, యోగాపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. యోగ అందరిదీ, అన్ని వర్గాలకు సంబంధించినది, భారత సంస్కృతిలోభాగమని ఆయన చెప్పారు. కాని కొంత మంది యోగా కొన్ని వర్గాలకే పరిమతమైన భావాన్ని గతంలో కల్పించారని, ఈ దురభిప్రాయాన్ని పొగొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

12/28/2018 - 21:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: హోమియోపతికి జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న బిల్లుకు సంబంధించిన ముసాయిదాకు కేంద్ర కేబినెట్ శుక్రవారం లోక్‌సభలో ఆమోదం తెలిపింది. మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసం ప్రస్తుతమున్న సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి స్థానంలో ఈ కొత్త కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

12/28/2018 - 03:51

ధర్మశాల: రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తూ వారిని వెర్రివాళ్లను చేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదన్న సంగతి మనం మరువరాదని ఆయన అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో సీఎంగా జైరాం ఠాకూర్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ‘ఒకే ర్యాంకు..

12/28/2018 - 02:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: త్రిపుల్ తలాక్‌కు లోక్‌సభ ఆమోదం పొందడంపై ముస్లిం సంఘాల నుంచి మిశ్రమ స్పందన లభించింది. కొన్ని సంఘాలు ఆహ్వానించగా, మరి కొంతమంది వ్యతిరేకించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యుడు ఎస్‌క్యుఆర్ ఇల్లాస్ మాట్లాడుతూ వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లును తెచ్చారన్నారు.

12/28/2018 - 02:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: చేనత వస్తువులకు, మరమగ్గాలకు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీని మాజీ ఎంపీ రాపోలు అనంద భాస్కర్ విజ్ఞప్తి చేశారు. గురువారం అరుణ్ జైట్లీని కలిసి జీఎస్టీ అమలు వల్ల చేనేత కార్మికులు పన్ను భారంతో చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతి పత్రాన్ని అందజేశారు.

12/28/2018 - 02:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలేవీ పాక్, భారత్ లాంటి శత్రుదేశాలు కాదని, కావేరి నదిపై నిర్మించనున్న మేకదాటు ప్రాజెక్టుకు సంబంధించిన వివాదాన్ని ఇరు రాష్ట్రాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయని కర్నాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు.

12/28/2018 - 02:10

బెంగళూరు, డిసెంబర్ 27: కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం పనైపోయిందని బీజేపీ చేస్తున్న ప్రకటనలను మాజీ సీఎం సిద్దరామయ్య కొట్టిపారేశారు. సంకీర్ణ ప్రభుత్వం బలంగా ఉందని, 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని దీటుగా ఎదుర్కొంటుందని గురువారం ఇక్కడ స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్ కలిసే పోటీచేస్తాయని ఆయన ప్రకటించారు.

12/28/2018 - 02:08

చిత్రం..గురువారం ఉడిపీలోని ప్రజావర్ మఠాన్ని సందర్శించిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు

Pages