S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/28/2018 - 03:53

న్యూఢిల్లీ: తెలంగాణ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసింది. గురువారం ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు తదితరులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు.

12/28/2018 - 04:46

న్యూఢిల్లీ: విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రత్యేక హోదా సాధనకోసం గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ‘వంచనపై గర్జన’ పేరుతో ఆ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహించింది.

12/28/2018 - 01:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ గొడవ చేసే సభ్యులను సభనుండి బైటికి పంపించేస్తానని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ హెచ్చరించారు. గురువారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ హెచ్చరిక చేశారు. మీరిలా వ్యవహరించటం ఎంతమాత్రం బాగా లేదు.. ప్రతిరోజూ పోడియం వద్దకు వచ్చి గొడవ చేయటం మంచిది కాదు.. అలాచేస్తే సభ్యులను సభనుండి పంపించివేయక తప్పదని హెచ్చరించారు.

12/28/2018 - 01:56

రూర్కీ, డిసెంబర్ 27: భూకంపాలను పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానాన్ని రూర్కీలోని ఐఐటీ శాస్తవ్రేత్తలు కనుగొన్నారు. భూకంపం వస్తుందని ప్రజలను ముందే హెచ్చరించేందుకు అవసరమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసినట్టు శాస్తవ్రేత్తలు వెల్లడించారు. ప్రజలకు కొద్ది నిమిషాలు ముందే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ప్రాణనష్టం నివారించవచ్చని అన్నారు.

12/28/2018 - 01:55

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారత్‌లో మైనార్టీలకు వచ్చిన ఢోకా ఏమీ లేదని, వారికి మంచి భద్రత మధ్య సురక్షితంగా జీవిస్తున్నారని, భారత్‌ను వేలెత్తి చూపే ముందు తన దేశంలో ఏమి జరుగుతుందో చూసుకోవాలని పాకిస్తాన్‌ను కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కోరారు. గత వారం రోజుల్లో నక్వీ రెండోసారి పాక్ ప్రధాని ఇమ్రాన్‌పై ధ్వజమెత్తారు.

12/28/2018 - 01:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను మళ్లీ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు. దత్తాత్రేయ గురువారం తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ తనను గవర్నర్‌గా పంపించి మరొకరిని సికింద్రాబాద్ నుంచి పోటీ చేయిస్తారని వస్తున్న వార్తలపై స్పందించారు.

12/28/2018 - 01:45

న్యూఢిల్లీ: కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యపడదని సెయిల్ నివేదికలో వెల్లడించిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమకు ఇప్పటికి వివరాలు ఏవీ అందజేయలేదని కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఉక్కు కార్మాగరం ఏర్పాటుకు అవసరమైన గనుల లభ్యత, ముడి ఇనుము నిల్వలకు సంబంధించి వివరాలు అందించలేదని తెలిపింది.

12/28/2018 - 00:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: తెలంగాణ ఎన్నికల్లో ఇస్ర్తిపెట్టె, ట్రక్కు, కెమెరా గుర్తులను కేటాయించవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఇవన్నీ టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలి ఉన్నాయని ఆయన అన్నారు. ఓటర్లు గుర్తించే విధంగా ఎన్నికల గుర్తులు ఉండాలేతప్ప, గందరగోళానికి గురిచేసే విధంగా ఉండరాదని ఈసీకి ఆయన వివరించారు.

12/28/2018 - 00:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ కొనసాగనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం విడివిడగా ప్రకటనలు విడుదల చేసింది. జనవరి 1నుంచి ఆయన ఈ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

12/28/2018 - 00:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశంలోని కోట్లాది మంది ముస్లిం మహిళల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సవరించిన ‘ట్రిపుల్ తలాక్’ బిల్లుకు లోక్‌సభ గురువారం ఆమోదం తెలిపింది. ఇకమీదట ట్రిపుల్ తలాక్ ఇచ్చే భర్తలకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. లోక్‌సభ ఆమోదించిన ఈ బిల్లు ఆమోదంకోసం రాజ్యసభకు వెళుతుంది. అనంతరం రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పరిశీలనకు, ఆయన ఆమోదముద్ర పడగానే చట్ట రూపం దాలుస్తుంది.

Pages