S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/26/2018 - 02:35

భోపాల్, డిసెంబర్ 25: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ మంగళవారం 28 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు మంత్రులుగా నియమితులయ్యారు. గవర్నర్ ఆనందీ బెన్ 28 మంది ఎమ్మెల్యేల చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయింరు. ఈ కార్యక్రమానికి సీనియర్ కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. అకీల్ అనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యేకి మంత్రివర్గంలో చోటు కల్పించారు.

12/26/2018 - 02:32

లక్నో, డిసెంబర్ 25: అయోధ్య స్థల వివాదానికి సంబంధించిన కేసును త్వరితగతిన విచారించాలని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ తీర్పును ఇవ్వగలిగిన సుప్రీంకోర్టు అదే తరహాలో దశాబ్దాలపాటు పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవచ్చునని ఆయన స్పష్టం చేశారు.

12/26/2018 - 02:31

మధుర, డిసెంబర్ 25: భగవాన్ హనుమాన్‌పై బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ అధినాయకత్వం వివరణ ఇవ్వాలని శంకరాచార్య అధోషాజనంద దేవ్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో మంత్రులు, బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు భగవాన్ హనుమాన్‌పై కులపరమైన వ్యాఖ్యలు చేయడం విచారకరమన్నారు.

12/26/2018 - 01:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీపై మరోసారి విరుచుకుపడ్డారు. బీజేపీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తమిళనాడు, పుదుచ్ఛేరి బీజేపీ బూత్‌స్థాయి కార్యకర్తలతో మోదీ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.

12/26/2018 - 01:40

కరేంగ్ ఛోపొరి, డిసెంబర్ 25: కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులను పరుగులెత్తిస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేశారు. గత ప్రభుత్వాల్లో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండేవని, తాము వచ్చాక పని సంస్కృతిని పెంపొందించినట్టు ఆయన తెలిపారు. అసోంలోని బోగీబీల్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన రైల్ కం రోడ్ వంతెనకు మంగళవారం ఆయన ప్రారంభోత్సవం చేశారు.

12/26/2018 - 00:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నట్టు టీఆర్‌ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటనను ముంగించుకుని కేసీఆర్ సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం తుగ్లక్ రోడ్‌లో ఉన్న తన ఇంటికే పరిమితమైన కేసీఆర్ బుధవారం పార్టీ నాయకులతో ఫెడరల్ ఫ్రండ్ ఏర్పాటుపై చర్చించినట్టు తెలుస్తోంది.

12/26/2018 - 00:46

న్యూఢిల్లీ: పాఠశాలలు విద్యార్థుల ప్రవేశానికి ఆధార్‌ను తప్పనిసరిగా చేసే నిబంధనను అమలు చేయరాదని, సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమని ఆధార్ కార్డులను రూపొందించే యూఐడీఎఐ పేర్కొంది. ఢిల్లీలో వచ్చే ఏడాదికి సంబంధించి 1500 నర్సరీ, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. కొన్ని పాఠశాలల్లో యాజమాన్యాలు

12/25/2018 - 03:38

ఖుర్దా (ఒడిసా): ఒడిసాలోని నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని అవినీతి భూతం పట్టుకుందని, అది రోజురోజుకు పెద్దదవుతోందని, ఆ రాష్ట్రంలో ప్రతి దానికి కమీషన్ల పర్సంటేజి సంప్రదాయం పెరిగిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు సమీపంలోని ఖుర్దా సమీపంలో జరిగిన కార్యక్రమంలో సోమవారం 1817లో ఒడిసాలో జరిగిన తిరుగుబాటు స్మారకార్థం స్టాంప్, నాణెంను విడుదల చేశారు.

12/25/2018 - 02:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: రుణ మాఫీ హామీలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ రైతులను మోసగిస్తోందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ విమర్శించారు. రైతు రుణాలు మాఫీ చేసేవరకు ప్రధాన మంత్రి మోదీని నిద్రపోనివ్వబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రస్తావిస్తూ రైతులే రాహుల్‌ను ఇక నిద్రపోనివ్వరని సోమవారం నాడిక్కడ జరిగిన విలేఖరుల సమావేశంలో ఎద్దేవా చేశారు.

12/25/2018 - 02:38

తిరువనంతపురం, డిసెంబర్ 24: కేంద్ర నాయకత్వంపై విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ శతృఘ్నసిన్హా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఒన్ మెన్ షో అంటూ సిన్హా విరుచుకుపడ్డారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను ఎంపీ వదలిపెట్టలేదు. మోదీ, అమిత్‌షాలది ‘ఒన్ మెన్ షో..టూ మెన్ ఆర్మీ’అంటూ ఆయన విరుచుకుపడ్డారు.

Pages