S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/27/2018 - 02:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోసహా విభజన హామీల అమలు పరచకుండా కేంద్ర ప్రభుత్వం వంచనకు గురి చేసిందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో గురువారం ‘వంచనపై గర్జన’ దీక్షను నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, తాజా మాజీ ఎంపీలు, ఆ పార్టీ సీనియర్ నాయకులు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, వివిధ విభాగాల నాయకులు పాల్గొంటారు.

12/27/2018 - 02:15

ముంబయి, డిసెంబర్ 26: ‘అధికారం కొందరికి ఆక్సిజన్‌లా పనిచేస్తుంది’ అని ఇటీవల బీజేపీ చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ బుధవారం మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. ఆ అధికారం కోసమే 2014లో తమతో పొత్తును బీజేపీ తెగ్గొట్టుకుందని శివసేన విమర్శించింది.

12/27/2018 - 04:40

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో జరిపిన సుదీర్ఘ సమావేశంలో దేశ రాజకీయాలపై సమాలోచన జరిపినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన చంద్రశేఖరరావు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర నిర్వహించేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.

12/27/2018 - 00:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: తెలంగాణకు కొత్త సచివాలయం నిర్మించేందుకు బైసన్‌పోలో మైదానాన్ని కేటాయించాలని, కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి 20వేల కోట్లు ఇవ్వాలని, విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను ఒక కాల పరిమితిలో పూర్తిచేయాలని, షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను వీలున్నంత త్వరగా వర్గీకరించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు.

12/27/2018 - 04:20

న్యూఢిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన పది మంది ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద అనుమానితులను నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజన్సీ (ఎన్‌ఐఏ) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ అనుమానితులు రాజకీయనాయకులు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడాలని పన్నాగం పన్నినట్లు ఎన్‌ఐఏ పోలీసులు చెప్పారు. ఢిల్లీ పరిసరాలు, ఉత్తరాది రాష్ట్రాల్లో పేలుళ్లకు రచన చేశారు.

12/26/2018 - 04:30

శ్రీకాకుళం: వంశధార 1961 ఒప్పందాన్ని మరోసారి ఆంధ్రా-ఒడిశా ప్రభుత్వాల అధికారులతో సమీక్షించాల్సి ఉందని, జనవరి 27న ఢిల్లీ లేదా పూరీ కేంద్రంగా ఈ ఒప్పందంపై చర్చలు నిర్వహిస్తామని వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ముకుందకం శర్మ నిర్ణయించారు.

12/26/2018 - 02:44

అలీగఢ్, డిసెంబర్ 25: ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలి క.. అందులోనూ మానసిక దివ్యాంగురాలు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇదేదో సినిమా సీను కాదు.. నిజజీవితంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగానే జరుగుతుంటాయి. వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల క్రితం 12ఏళ్ల వయసులో చంచల తన తల్లిదండ్రులతో కలిసి కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లింది. అదే సమయంలో పెనువిపత్తు సంభవిం చి వరద నీటిలో ఈ కుటుంబం చెల్లాచెదురైంది.

12/26/2018 - 02:43

బెంగళూరు, డిసెంబర్ 25: మాండ్యాలో ఓ జేడీఎస్ కార్యకర్త హత్యకు సంబంధించి కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపుతున్నాయి. ఈ హత్యకు బాధ్యులైన వారిని విచక్షణారహితంగా కాల్చిపారేయండి అంటూ ఓ పోలీసు అధికారిని ఆయన ఆదేశించడం వైరల్‌గా మారింది. అయితే తన ఆవేదనను తట్టుకోలేకే అలా మాట్లాడానే తప్ప అందులో నిజమైన ఉద్దేశం లేదని కుమారస్వామి తెలిపారు.

12/26/2018 - 02:42

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకూ విషమిస్తున్న వాయు కాలుష్యంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘ ప్రైవేటు వాహనాలను క్రమబద్ధం చేయడానికి అవసరమైతే బేసి-సరి నంబర్ విధానం అమలు చేస్తాం’అని మంగళవారం ఇక్కడ ప్రకటించారు. కాలుష్య తీవ్రతపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో కాలుష్యకారక ప్రైవేటు వాహనాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

12/26/2018 - 02:39

లక్నో, డిసెంబర్ 25: ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సచివాలయమైన లోక్‌భవన్‌లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 25 అడుగుల విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. వాజపేయి 94వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ రామ్‌నాయక్ తదితరులు పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యూపీతో వాజపేయికి ఎనలేని అనుబంధం ఉందని గుర్తుచేశారు.

Pages