S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/03/2018 - 00:37

భద్రాచలం టౌన్, నవంబర్ 2: ‘మా లక్ష్యం భద్రతా బలగాలే తప్ప విలేఖర్లు కాదు’ అంటూ మావోయిస్టులు తాజాగా శుక్రవారం ఒక లేఖను విడుదల చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా అరన్‌పూర్ వద్ద ఈనెల 30వ తేదీన మావోయిస్టులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లతో పాటు ఢిల్లీకి చెందిన దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్‌సాహు ప్రాణాలు కోల్పోయారు.

11/02/2018 - 16:24

న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారంనాడు వాదనలు జరిగాయి. ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేశారు.

11/02/2018 - 16:22

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కిష్టోవర్ జిల్లాలో బీజేపే నేతలను నిన్న కొందరు దుండగులు కాల్చి చంపటంతోప్రజలు పెద్దఎత్తున ఆందోళనలు చేయటంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. కాగా కిష్టోవర్‌లో ఆర్మీ బలగాలను మోహరించారు. ఇక్కడ కర్ఫ్యూ విధించారు.

11/02/2018 - 16:21

న్యూఢిల్లీ :కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, అహ్మద్‌పటేల్, అశోక్‌గెహ్లాట్, సింధియా, దిగ్విజయసింగ్ తదితరులు హాజరయ్యారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలపై ప్రధానంగా చర్చించారు.

11/02/2018 - 16:17

న్యూఢిల్లీ:అనుమతి లేకుండా న్యాయవాది గెటప్‌లో నటించి ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చినందుకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఢిల్లీ బార్ కౌన్సిల్ లీగల్ నోటీసులు జారీ చేసింది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రకటనను ప్రసారం చేశారని నోటీసులో పేర్కొన్నారు.

11/02/2018 - 16:15

న్యూఢిల్లీ: బోఫోర్స్ కుంభకోణంపై సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. కాగా సుప్రీంకోర్టు నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి గొప్ప ఊరట లభించింది.

11/02/2018 - 16:14

న్యూఢిల్లీ: రాఫెల్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అనిల్ అంబానీ కంపెనీలో దస్సాల్ట్ కంపెనీ రూ.284 కోట్ల పెట్టుబడి పెట్టిందని, ఆ డబ్బుతోనే అనిల్ అంబానీ భూములు కొనుగోలు చేశారని అన్నారు.

11/02/2018 - 12:36

నాగపూర్: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారంనాడు కలుసుకున్నారు. వీరిద్దరి భేటీలో అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రామాలయ నిర్మాణానికి చట్టం చేయాలని, ఈ శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని శివసేన, విహెచ్‌పీ తదితర సంస్థల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

11/02/2018 - 12:34

న్యూఢిల్లీ: అధికారం కోసమే చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వెన్నుపాటు రాజకీయాలు చేయటంలో చంద్రబాబుకు బాగా తెలుసునని అన్నారు. విద్వేషమే మహాకూటమి పార్టీల ప్రధాన ఎజెండా అని అన్నారు.

11/02/2018 - 12:29

జమ్మూకాశ్మీర్: జమ్మూకాశ్మీర్‌లో బీజేపీకి చెందిన అన్నదమ్ములపై దుండగులు కాల్పులు జరిపారు. జమ్మూ కాశ్మీర్ బీజేపే రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్, ఆయన సోదరుడు అజిత్ పరిహార్‌పై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. అనిల్ పరిహార్ సంఘటనా స్థలంలోనే కుప్పకూలగా.. అజిత్ పరిహార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరిని తీవ్రవాదులే హత్యచేశారని పార్టీ ప్రధాన కార్యదర్శి అశోక్‌కౌల్ ఆరోపించారు.

Pages