S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/05/2018 - 05:10

న్యూఢిల్లీ, నవంబర్ 4: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)కు, బీజేపీకి వ్యూహాత్మక సంబంధాలు ఉన్నాయని, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రెండు పార్టీల మధ్య దోస్తీ కుదురుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో మహాకూటమి గెలిస్తే ముఖ్యమంత్రి రేస్‌లో లేనని ఆయన స్పష్టం చేశారు. వయోభారం పడిందని, పైగా తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన చెప్పారు.

11/04/2018 - 23:32

న్యూఢిల్లీ, నవంబర్ 4: యుమనానదిపై నిర్మించిన సిగ్నేచర్ వంతెనను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఈ వంతెన వల్ల నగరంలోని ఉత్తర ప్రాంతం, ఈశాన్య ప్రాంతాలకు మధ్య రహదారి అనుసంధానం ఏర్పడిందన్నారు. ఈ వంతెన ఎనిమిది లైన్ల రహదారితో నిర్మించారు.

11/04/2018 - 23:25

న్యూఢిల్లీ, నవంబర్ 4: ప్రపంచంలోనే అత్యంత సహనం కలిగిన ప్రజలు హిందువులని పేర్కొంటూ అయోధ్యలోని రామమందిరం పరిధిలో మసీదును నిర్మించాలనే మాటలు వారిని అసహనపరులుగా మారుస్తాయని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి తనతో కలిసి పునాది రాయి వేయాలని ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించారు.

11/04/2018 - 23:24

చెన్నై, నవంబర్ 4: రాజకీయ పార్టీలు ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, అవినీతికి పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని సినీనటుడు, మక్కల్ నీది మయమ్ (ఎంఎన్‌ఎం) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హసన్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా అభిమానులతో మాట్లాడుతూ తనను కలిసేందుకు వచ్చి డబ్బు ఖర్చుపెట్టకుండా, పేదల సంక్షేమానికి ఆ సొమ్మును వెచ్చించాలని కోరారు.

11/04/2018 - 23:22

ముంబయి, నవంబర్ 4: చిన్న వయసులోనే సంగీత ప్రపంచంలో సంచలనాలు సృష్టించి దేశంలో ఎవరూ సాధించని రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ జీవితం అంతా పూలపాన్పులా ఏమీ సాగలేదు.

11/05/2018 - 00:33

న్యూఢిల్లీ, నవంబర్ 4: మహారాష్ట్ర అడవుల్లో మనిషి మాంసం రుచి మరిగిన అవని అనే పెద్ద పులిని పాశవికంగా వధించడంపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఆందోళన వ్యక్తం చేవారు. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వంతీరును ఆమె తప్పుబట్టారు. ఆడ పెద్దపులి కనీసం 13 మందిని చంపి తినడంతో గతరెండేళ్లుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అటవీ పోలీసులు వేటాడుతున్నారు. చివరకు శుక్రవారం రాత్రి ఆడ పెద్దపులిని అటవీ సిబ్బంది వధించారు.

11/04/2018 - 05:38

ఎన్నికలభూమి.....
============
* మళ్లీ మేమే గెలుస్తాం: బీజేపీ * ఈ సారి పాగా వేస్తాం: కాంగ్రెస్

11/04/2018 - 06:17

ఎన్నికలభూమి.....
============

11/04/2018 - 01:45

న్యూఢిల్లీ, నవంబర్ 3: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను సెలవుపై పంపడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే తప్పుపట్టారు. ఈమేరకు శనివారం ఆయన సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్ పదవి కుదించే అధికారం ఎవరికీ లేదని ఖర్గే తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ పదవిలో కొనసాగించాలని ఆయన అభ్యర్థించారు.

11/04/2018 - 05:01

న్యూఢిల్లీ, నవంబర్ 3: కొందరు ప్రతిపక్ష నేతలు అసత్యాలను వ్యాపింపచేయడమే పనిగా పెట్టుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ ధ్వజమెత్తారు.

Pages