S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/05/2018 - 16:31

మిజోరం: మిజరోరం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్ తగిలింది. పాలక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న పిప్‌హేయి బీజేపీలో చేరారు. ఈమేరకు పార్టీకి కూడా రాజీనామా ఏశారు. పిప్‌హేయి ఏడుసార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు.

11/05/2018 - 16:31

తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి తాను వెళుతున్నట్లు ఓ టీవీ ఛానల్ ప్రసారం చేసిన కథనాలను సుమేఖ థామస్ ఖండిస్తూ ఆ ఛానల్‌పై కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించింది. తన కుటుంబం మూడు మతాల సమ్మేళనం అని, ఆదివారం నుంచి ఆ ఛానల్ తాను శబరిమల ఆలయంలోకి వెళ్లబోతున్నట్లు ఫొటోతో సహా వేస్తుందని, తనకు దేవుడిపైన, మతంపైన నమ్మకం లేదని, తనకు శబరిమల వెళ్లాలనే ఆసక్తికూడా లేదని పేర్కొంది.

11/05/2018 - 16:29

న్యూఢిల్లి: ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌పై సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. డిసెంబర్ 15నాటికి హైకోర్టు తాత్కాలిక భవనం నిర్మాణం పూర్తవుతున్నందున జనవరి కల్లా రెండు రాష్రాల్లో హైకోర్టులు ప్రారంభమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

11/05/2018 - 16:27

కోల్‌కతా: నగరంలోని పార్క్‌స్ట్రీట్ ప్రాంతంలోని అప్పెజీ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనం కిటికీల నుంచి నల్లటి పొగలు వెలువడ్డాయి. సర్వర్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం సంభవించిందని గుర్తించారు. దాదాపు పది అగ్నిమాపక యంత్రాలు సంఘటన స్థలానికి వచ్చి మంటలను ఆర్పివేశాయి. భవనం నుంచి అందరినీ ఖాలీ చేయించటంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.

11/05/2018 - 16:21

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో తీవ్ర వాయుకాలుష్యం చోటుచేసుకుంది. పరిసర ప్రాంతాలను మందపాటి పొగ ఆవరించింది. ఆదివారంనాడు కాస్త ఉపశమనం కలిగించినప్పటికీ సోమవారంనాటికి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గాలిలో తేమ స్థాయి, ఉష్ణోగ్రతలు పడిపోవడం కూడా వాయు నాణ్యతపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది.

11/05/2018 - 12:48

గాంధీనగర్: గుజరాత్ సచివాలయంలోకి చిరుతపులి ప్రవేశించింది. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో చిరుత పులి సెక్రటేరియట్‌లోకి వచ్చినట్లు సీసీ టీవీ కెమెరాల్లో గుర్తించారు. అధికారులు ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ సిబ్బంది దాదాపు వందమంది వచ్చి పులి కోసం గాలిస్తున్నారు.

11/05/2018 - 12:43

తిరువనంతపురం: శబరిమల ఆలయం ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న నేపథ్యంలో ఆలయంలో విస్తత్ర బందోబస్తు ఏర్పాటుచేశారు. దాదాపు 2300 మంది సిబ్బందితో ఈ బందోబస్తును నిర్వహిస్తున్నారు. గత నెలలో మాసపూజ సందర్భంగా ఆలయం తెరుచుకున్న సందర్భంలో కొంతమంది మహిళలు వెళ్లటానికి ప్రయత్నించారు. దీంతో హిందూ సంస్థలు ప్రతిఘటించాయి. దీంతో పంబ, నీలక్కల్, సన్నిధానం, ఎలవుంకల్ తదితర ప్రాంతాల్లో విస్తత్రంగా బందోబస్తు నిర్వహించారు.

11/05/2018 - 02:00

ఎన్నికల భూమి:
==========

11/05/2018 - 05:08

హరిద్వార్, నవంబర్ 4: అయోధ్యలో రామాలయాన్ని త్వరలోనే నిర్మిస్తామని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఉద్ఘాటించారు. దేశంలో రామభక్తులందరూ ఇందుకు సంబంధించి శుభవార్త వినబోతున్నారని, దీపావళి రోజున రాముడి పేరిట దీపాలు వెలిగించాలని ఆయన పిలుపునిచ్చారు.

11/05/2018 - 01:26

శబరిమల, నవంబర్ 4: శబరిమల స్వామి అయ్యప్ప దేవాలయాన్ని ప్రత్యేక పూజలు నిమిత్తం సోమవారం తెరుస్తారు. గత పరిణామాల నేపథ్యంలో మళ్లీ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆలయ పరిసరాల్లో, ఆలయానికి వెళ్లే మార్గంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను కేరళ ప్రభుత్వం మోహరించారు. శబరిమల ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలను విధించారు.

Pages