S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై ఓపెన్‌కు వచ్చేస్తున్నాం

చెన్నై, నవంబర్ 22: మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, పురాతనమైన చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 22వ ఎడిషన్‌లో పాల్గొంటామని స్పెయిన్‌కు చెందిన స్టార్ ఆటగాడు రాబెర్టో బటిస్టా అగట్‌తో పాటు క్రొయేషియాకు చెందిన మరో ఆటగాడు బోర్నా కోరిక్ ధ్రువీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 6వ స్థానంలో కొనసాగుతున్న క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిక్ మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ చెన్నై ఓపెన్‌లో పాల్గొనబోతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజులకే అగట్, కోరిక్ కూడా ఈ టోర్నీలో పాల్గొంటామని ధ్రువీకరించారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం అగట్ 14వ స్థానంలోనూ, కోరిక్ 48వ స్థానంలోనూ కొనసాగుతున్నారు.

టిసిఎస్‌ను అమ్మేద్దామన్నారు!

ముంబయి, నవంబర్ 22: టాటా-మిస్ర్తిల ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. తాజాగా రతన్ టాటాపై సైరస్ మిస్ర్తి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టాటా గ్రూప్ ప్రతిష్ఠాత్మక సంస్థ టిసిఎస్‌ను ఐబిఎమ్‌కు అమ్మేయాలని చూసినట్లు ఆరోపించారు. దేశీయ ఐటి రంగ దిగ్గజమైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్).. 100కుపైగా సంస్థలున్న 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌లో అతిపెద్ద సంస్థ అన్నది తెలిసిందే. భారతీయ స్టాక్ మార్కెట్లలో అత్యంత విలువైన సంస్థ కూడా టిసిఎస్సే. అయితే టిసిఎస్‌ను ఒకానొక దశలో ఐబిఎమ్‌కు రతన్ టాటా అమ్మేయాలని చూసినట్లు మిస్ర్తి మంగళవారం ఇక్కడ తెలిపారు.

ఇక బిగ్ బజార్ స్టోర్లలో నగదు ఉపసంహరణ

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇక బిగ్‌బజార్ స్టోర్లలోనూ నగదు ఉపసంహరణలు చేసుకోవచ్చు. ఈ నెల 24 (గురువారం) నుంచి దేశవ్యాప్తంగా 115 నగరాలు, పట్టణాల్లో ఉన్న 258 బిగ్‌బజార్, ఎఫ్‌బిబి స్టోర్లలో డెబిట్, ఎటిఎమ్ కార్డుల ద్వారా బ్యాంక్ ఖాతాదారులు నగదును ఉపసంహరించుకునే అవకాశం లభిస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐతో ఈ మేరకు బిగ్‌బజార్ టైఅప్ అయ్యింది. ఇందులోభాగంగానే బిగ్‌బజార్, ఎఫ్‌బిబి స్టోర్లలో మినీ ఎటిఎమ్‌లు ఏర్పాటవుతున్నాయి. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు 500, 1,000 రూపాయల నోట్లను ఈ నెల 8వ తేదీ రాత్రి కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు రద్దు చేసినది తెలిసిందే.

అమరావతికి ఉద్యాన సొబగులు

విజయవాడ, నవంబర్ 22: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో పచ్చదనం, సుందరీకరణ పనులు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ మహా నగరాన్ని అత్యంత ఆధునికంగా, సకల సౌకర్యాలతో పచ్చదనం, జలకళ (బ్లూ-గ్రీన్) ఉట్టిపడేలా అద్భుతంగా నిర్మించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు. అందులో భాగంగానే వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మించారు. పచ్చికబయళ్లు, మోండో గడ్డి, మొక్కల పెంపకం, నడకదారుల నిర్మాణం వంటి సుందరీకరణ పనులు వెలగపూడి నుంచే ప్రారంభించారు. ఐజిసి, తుళ్ళూరు, ఉద్దండరాయునిపాలెం పరిసరాలన్నీ అహ్లాదకరంగా ఉండే విధంగా అనువైన వాతావరణం కల్పించడానికి పచ్చదనం పరుస్తున్నారు.

84 శాతం ఎగిసిన ఎల్‌అండ్‌టి లాభం

న్యూఢిల్లీ, నవంబర్ 22: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ద్వితీయ త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 84 శాతం ఎగిసింది. 1,434.63 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 778.37 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 25,010.70 కోట్ల రూపాయలుగా, నిరుడు 23,123.48 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది.

28 శాతం పెరిగిన ఎన్‌హెచ్‌పిసి లాభం

న్యూఢిల్లీ, నవంబర్ 22: ప్రభుత్వరంగ జల విద్యుదుత్పత్తి దిగ్గజం ఎన్‌హెచ్‌పిసి స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో గతంతో పోల్చితే 27.8 శాతం పెరిగింది. 1,554.6 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) జూలై-సెప్టెంబర్‌లో ఇది 1,215.6 కోట్ల రూపాయలుగా ఉంది. బకాయిల వసూళ్లతోపాటు నిర్వహణ వ్యయం తగ్గించుకోవడం వల్లే లాభాలు పెరిగాయని ఎన్‌హెచ్‌పిసి సిఎండి కెకె సింగ్ అన్నారు. తమ చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.

పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా పోస్ట్ఫాసులు

భీమవరం, నవంబర్ 22: త్వరలో తపాలా కార్యాలయాలు పాస్‌పోర్టు సేవా కేంద్రాలుగా మారనున్నాయని తపాలా శాఖ డైరక్టర్ ఇవిరావు (ఆంధ్రప్రదేశ్ సర్కిల్) చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని కడప జిల్లాను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశామన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ, తపాలా శాఖ సంయుక్తంగా ఈ పథకంపై కృషి చేస్తున్నాయ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకును కూడా ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం చిత్తూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామన్నారు.

మొబైల్ షార్ట్ కోడ్ మెసేజ్‌లు ఉచితం

న్యూఢిల్లీ, నవంబర్ 22: మొబైల్ షార్ట్ కోడ్ మెసేజ్‌లను డిసెంబర్ 31 వరకు ఉచితంగా అందించేందుకు టెలికామ్ ఆపరేటర్లు అంగీకరించారు. పాత 500, 1,000 రూపాయల నోట్ల రద్దు నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మెసేజ్‌లు ప్రధానంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగిస్తారు. నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు ఇతరత్రా సమాచారాన్ని బ్యాంకులు ఈ మెసేజ్‌ల ద్వారానే ఖాతాదారులకు అందిస్తాయి. ఆ మేరకు అయ్యే ఖర్చును ఖాతాదారుల నుంచి బ్యాంకులు వసూలు చేస్తాయి. కాగా, ఈ మెసేజ్ ధరను ట్రాయ్ 1.50 రూపాయల నుంచి 50 పైసలకు తగ్గించిన కాసేపటికే టెల్కోలు ఈ నిర్ణయం తీసుకోగా, జనవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ అపరిమిత వాయిస్ కాల్స్ ప్యాకేజి

న్యూఢిల్లీ, నవంబర్ 22: అనిల్ అంబానీ నేతృత్వంలోని టెలికామ్ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్.. మంగళవారం ఓ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను పరిచయం చేసింది. 149 రూపాయలకే ఏ నెట్‌వర్క్‌కైనా ఎన్నిసార్లయినా కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఫీచర్ ఫోన్ లేదా స్మార్ట్ఫోన్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చంటూ ఎస్‌టిడి కాల్స్‌కు కూడా కొత్త ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 2జి, 3జి, 4జి టెక్నాలజీల్లోనూ ఆఫర్ పనిచేస్తుందని ఓ ప్రకటనలో ఈ సందర్భంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ స్పష్టం చేసింది. ఈ ప్లాన్‌తో 300 ఎంబి డేటా సైతం ఉచితమని ప్రకటించింది.

లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు

ముంబయి, నవంబర్ 22: వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 195.64 పాయింట్లు పుంజుకుని 25,960.78 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 73.20 పాయింట్లు అందుకుని 8,002.30 వద్ద నిలిచింది. అంతకుముందు ఆరు రోజులు సూచీలు నష్టాల్లోనే కదలాడినది తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం ట్రేడింగ్‌లో మెటల్, రియల్టీ, ఆటో, ఎనర్జీ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. దీంతో సూచీలు తిరిగి లాభాలబాట పట్టగా, అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలూ లాభాల్లోనే ముగిశాయి.

Pages