S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దనోట్ల రద్దు.. పెద్ద సమస్యే!

మహబూబాబాద్, నవంబర్ 22: కేంద్రప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టేందుకు తీసుకున్న పెద్దనోట్ల బంద్ ప్రభావం అన్ని రంగాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది. పెద్దనోట్లు బ్యాన్ అయి రెండు వారాలు గడుస్తున్నా ఇంకా మార్కెట్ కుదటపడలేదు. బ్యాంకు లావాదేవిలపై రోజురోజుకు ఆర్‌బిఐ విధిస్తున్న నిబందనలు బడావ్యాపారులను,సామాన్యులను సైతం ఆందోళనకు గురిచేయిస్తుంది. వ్యాపార లావాదేవిలు పూర్తిగా స్తంభించిపోయాయి. చిరువ్యారులకు అమ్మకాలు నిలిచిపోయాయి. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. భుముల కొనుగొలు, అమ్మకాలు స్తంభించాయి. పెళ్లిల సీజన్ కావడంతో వ్యాపారులకు ఇది పెద్ద దేబ్బె.

ఎటిఎంలలో డబ్బులుంచండి

వరంగల్, నవంబర్ 22: జిల్లాలోని అన్ని బ్యాంకుల బ్రాంచీలలో వినియోగదారులకు అవసరమైన కొత్తనోట్లను అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. అవసరాల మేరకు డబ్బు లేదని బ్యాంకులు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా వ్యవహరించటం సరికాదని, జిల్లా అవసరాల మేరకు రిజర్వ్ బ్యాంకు నుంచి డబ్బు తెప్పించుకునేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వానికి కూడా లేఖ రాస్తామని చెప్పారు.

ఎరువులు, విత్తనాల కొనుగోళ్లలో ఇబ్బందులు పెట్టొద్దు

వరంగల్, నవంబర్ 22: పెద్దనోట్లను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వం రబీ సీజన్‌లో రైతులు రద్దయిన ఐదువందలు, వేయినోట్లతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లకు అవకాశం ఇచ్చినందున జిల్లాలోని ఎరువుల డీలర్లు రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆమ్రపాలి సూచించారు. నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా ముందుజాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రబీ పంట రుణాల లక్ష్యాలను పూర్తిచేసేందుకు సత్వర చర్యలు చేపట్టాలని, బ్యాంకులలో ఖాతాలు లేని రైతులకు వెంటనే కొత్త ఖాతాలు ప్రారంభించాలని తెలిపారు.

ప్చ్.. పనిలేదు.. ఆటే మిగిలింది!

కేసముద్రం, నవంబర్ 22: పాత పెద్ద నోట్ల రద్దు.. బ్యాంకుల నుంచి వారానికి 50 వేలకు మించి డబ్బులు డ్రా చేసుకునే వెసులుబాటు లేక పోవడంతో పరిశ్రమలు దాదాపుగా మూతపడ్డాయి. ఫలితంగా వందలాది కార్మికుల ఉపాధికి గండిపడింది. దీనితో ప్రతి రోజు మిల్లుకు రావడం.. ఈ రోజు మీకేం పనిలేదని వ్యాపారులు చెప్పడం.. చేసేదేమిలేక కార్మికులు తాము తెచ్చుకున్న సద్దిబువ్వ తినడం.. సాయంత్రం వరకు కాలక్షేపం చేయడం నిత్యకృత్యంగా మారింది. పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యాపారులు చేతిలో నగదు లేక మార్కెట్లో వ్యాపారం బంద్ పెట్టారు. దీనితో మిల్లులో నిలువలు అడుగంటి పోవడంతో వారం రోజుల నుంచి కార్మికులకు ఉపాధి లభించడం లేదు.

మాకొద్దీ రేషన్ డీలర్‌షిప్‌లు!

కర్నూలు, నవంబర్ 22: నిన్నా మొన్నటి వరకు రేషన్ దుకాణం దక్కించుకోవడానికి వేల రూపాయల ఖర్చుకూ వెనుకాడకుండా నాయకులు, అధికారుల చుట్టూ తిరిగిన వ్యక్తులు నేడు అదే రేషన్ దుకాణ డీలర్‌షిప్పు ఇస్తామంటే వద్దనే పరిస్థితికి వచ్చింది. గతంలో ఉన్నట్లుగా రేషన్ దుకాణాల్లో అవినీతికి దాదాపుగా అడ్డుకట్ట పడటంతో దుకాణాల నిర్వహణకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఖాలీగా ఉన్న ప్రాంతాల్లో డీలర్ల నియామకానికి అధికారులు సిద్ధపడినా దరఖాస్తులు రాకపోవడంతో సమీప డీలర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు.

కుదిరిన సయోధ్య..!

నంద్యాల, నవంబర్ 22: నిన్నటి వరకు కత్తులు దూసిన నంద్యాల టిడిపి నేతలు నేడు చేతులు కలిపారు. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను వేడెక్కించిన ఎమ్మెల్యే భూమా నాగి రెడ్డి, మాజీ మంత్రులు ఎన్‌ఎండి ఫరూక్, శిల్పామోహన్‌రెడ్డి హైకమాండ్ ఆదేశాలతో వెనక్కు తగ్గారు. నంద్యాల టిడిపి నేతల మధ్య నెల కొన్న విభేదాలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడును ఆదేశించడంతో ఆయన సోమవారం కర్నూలులో మంతనాలు జరిపారు.

వ్యవసాయ యూనివర్శిటీ అభివృద్ధికి నాబార్డు నిధులు

మహానంది, నవంబర్ 22: ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ యూనివర్శిటీ అభివృద్ధికి రూ. 153 కోట్ల నాబార్డు నిధులు మంజూరయ్యాయని, రాష్ట్రంలో ఐదు నూతన వ్యవసాయ ప్రైవేటు కళాశాలలు, రెండు పాలిటెక్నిక్ కళాశాలలను ఈ ఏడాది నుంచి ప్రారంభించినట్లు డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డా. రమేష్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన మహానంది వ్యవసాయ కళాశాలలో విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు రెండు ప్రారంభించామన్నారు.

సీమకు మహర్దశ..

ఆదోని, నవంబర్ 22: రాయలసీమకు దశ తిరిగింది. మూతపడిన పరిశ్రమలు తెరువకపోయినా కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. దీనివల్ల పరిశ్రలు ఏర్పడి ప్రజలకు ఉపాధి అవకాశాలు మెండుగా కలిగే అవకాశాలు ఏర్పాటు కానున్నాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నిత్యం కరవుకాటకాలతో ప్రజలు దుర్భిక్షాన్ని ఎదుర్కొంటూ అహోలక్ష్మణా అంటూ కాలం గడుపుతున్నారు.

ఎస్‌ఐ పదోన్నతికి ఎంపిక పరీక్ష

కర్నూలు, నవంబర్ 22:పోలీసుశాఖ సర్వీసులోని ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లకు సబ్‌ఇన్‌స్పెక్టర్లగా పదోన్నతి కల్పించడానికి రాయలసీమ జోన్ పరిధికి సంబంధించి మంగళవారం జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఎంపిక పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు ఎస్పీ రవికృష్ణ, ఏపిఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ ముఖ్య పర్యవేక్షకులుగా వ్యవహరించారు. పరీక్ష కేంద్రాన్ని కర్నూలు రేంజ్ డిఐజి రమణకుమార్ తనిఖీ చేశారు. పరీక్షకు కర్నూలుతో పాటు కడప, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి మొత్తం 98 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలు హాజరయ్యారు. పేపర్-1,2 కింద ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించారు.

టమోటాకు గిట్టుబాటు ధర కల్పించాలి

కర్నూలు సిటీ, నవంబర్ 22: టమోటా దిగుబడికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని ఏపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం ముందు టమోటా రైతులు నిరసన చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడు తూ జిల్లాలో ప్రతి ఏడాది దాదాపు లక్ష ఎకరాల్లో టమోటా పంట సాగు చేస్తారని, అందుకోసం ఎకరాకు రూ. 30 వేల చొప్పున ఖర్చు చేస్తారన్నారు. అయితే ప్రస్తుతం కిలో టమోటా 50 పైసల ధర పలుకుతుందని, దీంతో రైతులు టమోటాలను రోడ్లపైనే పారబోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్‌లో కిలో టమోటా ధర కనీసం రూ.

Pages