S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలి

గుంటూరు, నవంబర్ 22: సమాజంలో విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో రాణించాలని సాంఘిక సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖల మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. డిసెంబర్ 3న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా మంగళవారం స్థానిక పోలీసు పెరెడ్‌గ్రౌండ్‌లో జిల్లా విభిన్న ప్రతిభావంతుల, వృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగస్వాములై సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో దేన్నైనా సాధించగలమన్న ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలన్నారు.

గుంటూరుతో బాలమురళి అనుబంధం

గుంటూరు (పట్నంబజారు), నవంబర్ 22: కర్ణాటక సంగీత మహా విద్వాంసుడు పద్మవిభూషణ్ మంగళంపల్లి బాలమురళీకృష్ణకు గుంటూరుతో విడదీయరాని అనుబంధం ఉంది. ఒకానొకప్పుడు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా ఆయన నిర్వహించిన కచేరిలు సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. ఇప్పటికీ బాలమురళీ గాత్రం గుంటూరు సాహితీ ప్రియుల్లో గుండెల్లో ప్రతిధ్వనిస్తోంది. ఆయన హఠాన్మరణంతో సంగీతప్రియులు, రసాస్వాదకులు, సాహిత్యాభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గాయత్రీ మహిళా సంగీత సన్మండలి, నాగార్జున సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో ఎన్నోసార్లు స్వరరాజుకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో కనకాభిషేకం చేశారు.

బాలికలు సింధూను ఆదర్శంగా తీసుకొని క్రీడలలో రాణించాలి

తెనాలి, నవంబర్ 22: జాతీయ, అంతర్జాయ స్థాయిలో రాణిస్తూ దేశం, రాష్ట్రానికి పేరుప్రఖ్యాలు తీసుకువస్తున్న సింధూను నేటి బాలికలు ఆదర్శంగా తీసుకొని క్రీడలలోనూ రాణించాలని ఒన్‌టౌన్ ఎస్‌ఐ రాంబాబు పేర్కొన్నారు. స్థానిక దేవీచౌక్‌లోని షారోన్ హైస్కూల్ వార్షికోత్సవ క్రీడలు మంగళవారం లాంఛనంగా ప్రారంభమైయ్యాయి. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్‌ఐ క్రీడాకారులను వందనం స్వీకరించి, పరిచయం అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు కేవలం విద్యనోనే కాకుండా క్రీడల్లోనూ పాల్గొంటూ శారీరకంగా మానసిక ఉల్లాసాన్ని పొందాలని సూచించారు.

దళితులపై వైఎస్ కుటుంబం కపటప్రేమ

గుంటూరు, నవంబర్ 22: దళితులపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, కుటుంబసభ్యులు కపటప్రేమ ఒలకబోస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు విమర్శించారు. మంగళవారం టిడిపి రాష్ట్ర కార్యాలయంలో విలేఖర్లతో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత బైబిల్‌ను చేతపట్టి ఖూనీలుచేసే వారికి లేదన్నారు. ఓట్లకోసం నక్కజిత్తులు వేస్తున్న వారి పట్ల దళిత క్రైస్తవులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. దళితులకు న్యాయం చేసామంటున్న ప్రతిపక్ష పార్టీలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైఎస్ హయాంలో దళితులు, దళిత క్రైస్తవులను ఓటుబ్యాంక్‌గా వాడుకున్నారని ధ్వజమెత్తారు.

ర్యాగింగ్ నిరోధానికి చర్యలు

ఎచ్చెర్ల, నవంబర్ 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నత న్యాయస్థానాలు ఆలోచనలకు అనుగుణంగా ర్యాగింగ్ నిరోధానికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్టు అంబేద్కర్ వర్శిటీ ఇంఛార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రిజిస్ట్రార్ తులసీరావుతో కలిసి ర్యాగింగ్ రహిత క్యాంపస్‌గా అంబేద్కర్ వర్శిటీని తీర్చిదిద్దేందుకు అన్ని స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. సీనియర్లపై మరింత నిఘాపెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వసతిగృహాలు విభాగాల వారీగా కమిటీలు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

జనవరి 1నుంచి6నగదురహిత పల్లెలు

శ్రీకాకుళం, నవంబర్ 22: రానున్న జనవరి 1వ తేదీ నుంచి జిల్లా అంతటా సంపూర్ణ నగదురహిత గ్రామాలుగా మారుస్తామని, ఆర్థిక లావాదేవీలన్నీ నగదురహితంగా చేసేలా ఆర్థిక అక్షరాస్యత కల్పిస్తామని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. పెద్ద నోట్లు రద్దు విషయంలో ఎక్కువ శాతం ప్రజలు అనుకూలత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నగదురహిత కార్యకలాపాలు స్వచ్ఛందంగానే జరిగేందుకు అవకాశాలు ఉన్నట్టు వివరించారు. రానున్న కాలం పూర్తిగా నగదు రహిత కార్యకలాపాలదేనని అన్నారు. ఇక్కడి ఆంధ్రా బ్యాంకు జోనల్ కార్యాలయంలో మంగళవారం బ్యాంకు బిజినెస్ కరస్పాండెంట్ల(బి.సి) అవగాహన సదస్సు జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడారు.

మరో రెండు రోజులే..

శ్రీకాకుళం, నవంబర్ 22: జిల్లాలో నీటి తీరువా, నాలా పన్నులను ఈ నెల 24వ తేదీ వరకూ పాత ఐదువందలు, వెయ్యి రూపాయల నోట్లతో చెల్లింపు చేయవచ్చని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎస్.చక్రధర బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 24వ తేదీ వరకూ వీఆర్వో వద్దగాని, లేదా సంబంధిత మండల తహశీల్దార్ కార్యాలయంలోగాని, పాత నోట్లతో చెల్లింపు చేయవచ్చని చెప్పారు. చెల్లింపు చేసిన మొత్తాలకు రశీదు పొందాలని ఆయన సూచించారు. నీటి తీరువా పన్ను శ్రీకాకుళం డివిజన్‌లో 10.83 కోట్ల రూ.లు, పాలకొండ డివిజన్‌లో 10.32 కోట్లు, టెక్కలి డిలిజన్‌లో 9.89 కోట్లు చెల్లించాల్సివుందని ఆయన పేర్కొన్నారు. మండలాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం మండలంలో రూ.

8మంది అరెస్ట్

రణస్థలం, నవంబర్ 22: మండలంలోని కొండములగాం గ్రామానికి చెందిన రేగాన రామకృష్ణ అనే వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, డిఎస్పీ భార్గవరావునాయుడు మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. రేగాన రామకృష్ణ గతంలో అదే గ్రామానికి చెందిన రేగాన సూర్యనారాయణను కత్తితో పొడిచి చంపిన సంఘటనలో జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే, సూర్యనారాయణ మృతికి కారణమైన రామకృష్ణను చంపేయాలని పథకం ప్రకారం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న తోటలో ఇనపరాడ్డుతో దాడిచేసి హత్య చేసినట్టు తెలిపారు.

నాయకత్వంతో ఆదర్శవంతులు కండి

శ్రీకాకుళం, నవంబర్ 22: మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని భావితరాలకు ఆదర్శవంతులుగా తయారు కావాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి పిలుపునిచ్చారు. జెడ్‌పి సమావేశ మందిరంలో మంగళవారం యూ ఎన్ మహిళ-రెండో విడత మల్టీసెక్టోరల్ అక్రోచ్ అవకాశాల నుంచి సామార్థ్యాలవైపు అనే కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఏపి ఎస్‌ఐఆర్‌డి ఉపసంచాలకులు అబ్దుల్ హరీమ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళా ప్రజాప్రతినిధులు జిల్లాలో అధికంగా ఉన్నారని 50శాతం రిజర్వేషన్లు ఉన్నాయని అధికారాలను సక్రమంగా వినియోగించుకొని చక్కటి పాలన అందించాలన్నారు.

ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాల్సిందే!

శ్రీకాకుళం, నవంబర్ 22: మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం వేధింపుల వ్యతిరేక కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ కొయ్యాన శ్రీవాణి ఆదేశించారు. మంగళవారం ఇక్కడ నగరపాలకసంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఉషారాణి, మెడికల్ విద్యార్థిని సంధ్య లాంటివారు ర్యాగింగ్ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ర్యాగింగ్ వ్యతిరేకంగా రాఘవన్ కమిటీ కొన్ని సూచనలు చేసిందని వాటి గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావల్సిన అవసరం ఉందని అన్నారు. మహిళలు, విద్యార్థినులపై వేధింపులకు పాల్పడుతున్నవారికి ఆరు నెలలనుంచి పదేళ్ళవరకూ జైలు శిక్షపడుతుందన్నారు.

Pages