S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఆయుర్వేద డిగ్రీ కళాశాలలో సీట్ల పెంపు

విజయవాడ, నవంబర్ 22: ఐదు దశాబ్దాలుగా కష్టాలను ఎదుర్కొంటున్న స్థానిక డాక్టర్ నోరి రామశాస్ర్తీ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు మహర్దశ పట్టింది. సౌకర్యాల లేమి, సిబ్బంది కొరత కారణంగా ఇటీవల వరుసగా రెండేళ్లపాటు డిగ్రీ, పిజి కోర్సుల్లో అడ్మిషన్లు నిలిపేశారు. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ కృషితో అడ్మిషన్లను పునరుద్ధరించారు. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెడిసిన్ సభ్యులు ఇప్పటికి పలుమార్లు కళాశాలను సందర్శించి అనేక సూచనలు ఇచ్చారు.

నగరంలో ‘బాహుబలి-2’ హల్‌చల్

విజయవాడ (క్రైం), నవంబర్ 22: నగరంలో ‘బాహుబలి’ హల్‌చల్ చేశాడు. ప్రముఖ దర్శకుడు రాజవౌళి దర్శకత్వంలో రూపొందుతున్న బాహుబలి రెండో విభాగం దృశ్యాలు బయటకు పొక్కడం నగరంలో సంచలనం రేకెత్తించింది. చిత్రంలోని క్లైమాక్స్ దృశ్యాలకు గ్రాఫిక్స్ జోడిస్తున్న క్లిప్పింగ్‌లు హైదరాబాద్ అన్నపూర్ణ స్డూడియో నుంచి చోరీకి గురైనట్లు వెలుగులోకి రావడం చిత్రసీమ వర్గాలతోపాటు నగర ప్రజల్లో ఆసక్తి నెలకొంది. కాగా కొన్ని పోరాట సన్నివేశాలను ‘హైజాక్’ చేసిన వ్యక్తి నగరంలోని తన స్నేహితులు పలువురికి షేర్ చేసినట్లు జరుగుతున్న ప్రచారంతో ఉత్కంఠ రేగింది.

రెండు నెలల్లో జెట్టీ నిర్మాణం

ఇబ్రహీంపట్నం, నవంబర్ 22: ఇబ్రహీంపట్నం మండలం, తుమ్మలపాలెం రేవు వద్ద రూ.20 లక్షలతో నిర్మించ తలపెట్టిన జెట్టీ నిర్మాణాన్ని రెండు నెలల్లో పూర్తి చేయాలని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళవారం సాయంత్రం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మలపల్లి రేవు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం రూ.20 లక్షలతో జెట్టీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికి అవసరమైన నిధులు విడుదల చేశామన్నారు. జెట్టీని 11 లక్షల క్యూసెక్కుల వరద నీటి సామర్థ్యం తట్టుకునే విధంగా నిర్మాణం చేపట్టాలన్నారు.

సహకార వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

విజయవాడ, నవంబర్ 22: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు నిరంతరం శ్రమిస్తున్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. రద్దు చేసిన నోట్ల డిపాజిట్‌కు, నోట్ల మార్పిడికి సంబంధించి తొలుత అవకాశం కల్పించి, ఆకస్మికంగా అనుమతిని రద్దు చేస్తూ డిసిసి బ్యాంకులను మినహాయించడంలో గల ఆంతర్యం ఏమిటో ప్రధాని మోదీ, రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉజిత్ పటేల్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్‌బిఐ అనుమతితో, ఆర్‌బిఐ నిబంధనలకు లోబడి పనిచేస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి దోహదపడుతున్న సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు నూరు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు.

ప్రభుత్వ క్యాలెండర్‌ను ప్రైవేట్ స్కూళ్లు విధిగా పాటించాలి: డిఇఓ

సిద్దిపేట అర్బన్, నవంబర్ 22: ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేకుంటే చర్యలు తప్పవని డిఇఓ కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట న్యూహైస్కూల్‌లో ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్ల పరిసరాలు శుభ్రంతో పాటు ఆవరణ కూడా శుభ్రంగా ఉండాలన్నారు. మ్ఘరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తు విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలన్నారు. స్కూళ్ల యాజమాన్యాలన్నీ ప్రభు త్వ క్యాలెండర్‌ను అనుసరించాలని లేకుంటే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులకు మంచినీటి వసతి కల్పించాలన్నారు.

పాడిపరిశ్రమకు 25 శాతం కేంద్ర సబ్సిడీ సాధనకు కృషి

మెదక్, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మంత్రి ఉమాభారతిని ఢిల్లీలో బుధవారం కలుసుకొని పాడి రైతులకు 25 శాతం సబ్సిడిని ఇవ్వాలని కోరుతామని తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తెలిపారు. మంగళవారం మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. పాడి పరిశ్రమలో ఎస్సీ, ఎస్టీ, బిసీ వర్గాల వారు అధికంగా ఉంటారన్నారు. వీరందరికి కూడా 25 శాతం సబ్సిడీ ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి ఉమాభారతిని కోరుతానని ఆయన తెలిపారు. జిల్లాలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మంత్రి తెలిపారు.

విధి నిర్వహణలో అలసత్వంపై కలెక్టర్ ఫైర్

సిద్దిపేట, నవంబర్ 22: విధుల పట్ల అలసత్వం వహించిన ఇద్దరు ఉపాధిహామి టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లను కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి సస్పెండ్ చేశారు. మంగళవారం సిద్దిపేట, దుబ్బాక మండలాలకు చెందిన ఉపాధిహామి అధికారులు, ఎంపిడిఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిద్దిపేట మండలం మాచాపూర్‌కు చెందిన ఎఫ్‌ఏ కృష్ణారెడ్డి, టిఏ శ్రీనివాస్‌ల పై కలెక్టర్ మండిపడ్డారు. తాను పూర్తి సమాచారంతో సమావేశాలకు రావాలని చెప్పినా అధికారుల తీరు మారకపోవడంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ సమీక్షలోనే సస్పెన్షన్ చేయాలంటు పిడి సత్యనారాయణరెడ్డిని ఆదేశించారు.

నేర రహిత గ్రామాలుగా మార్చడమే లక్ష్యం

సిద్దిపేట, నవంబర్ 22 : సిద్దిపేట కమిషనరేట్‌ను రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రజలతోమమేకమై పనిచేయాలని పోలీస్ కమిషనర్ శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక సిపి కార్యాలయంలో జరిగిన నేర సమీక్ష సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కమ్యూనిటీ పోలీసింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కమిషనరేట్ పరిధిలో నేరాలను అదుపు చేసేందుకు అవసరమగు చర్యలు చేపట్టాలని సూచించారు. నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసు అధికారులు ప్రత్యేక కృషిచేయాలన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం పోలీసులు పాలుపంచుకోవాలని సూచించారు. ప్రజలకు పోలీసులు జవాబుదారి తనంగా పనిచేయాలన్నారు.

కూరగాయల పంటలతో అధిక దిగుబడులు రావాలి

చిన్నకోడూరు, నవంబర్ 22: రైతులు విత్తనాలు విత్తి కూరగాయలు అమ్ముకునే వరకు రైతుల వెంట ప్రభుత్వ అధికారులు ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని మాచాపూర్‌లో కూరగాయల పంటల పై రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైద్రాబాద్‌కు వేరే రాష్ట్రాల నుంచి 80శాతం కూరగాయలు వస్తే, మనరాష్ట్రం నుంచి 20శాతం వస్తున్నాయని, మనంకూడా వేరే రాష్ట్రాల్లాగా ఎదగాలన్నారు. జిల్లాలో 40గ్రామాలను ఎంచుకొని కూరగాయల గ్రామాలుగా మార్చేదాగా పూర్తిబాధ్యత తనదేనన్నారు. గ్రామానికో రైతు చొప్పున 25గ్రామాలను తీసుకొని కమిటిలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మిషన్ కాకతీయ సత్ఫలిస్తోంది

మెదక్ రూరల్, నవంబర్ 22: తెలంగాణ ఏర్పడిన తర్వాత చేపట్టిన మిషన్ కాకతీయ రెండు విడతలుగా చేపట్టిన పనుల ఫలితాలు అందుతున్నాయని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. రెండు పంటలకు సాగునీరందించేలా చెర్వులు నిండాయన్నారు. 46 వేల చెర్వుల్లో 30 వేల చెర్వులు మత్తడి బొర్లాయని పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని వెంకటాపూర్‌లో 43.50 లక్షలతో ఎస్‌సి, ఎస్‌టి కాలనీల్లో నిర్మించే సిసి రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితోకలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ 3 వేల కోట్లతో చెర్వుల మరమ్మతులు చేపట్టామన్నారు. ప్రతి కుంట, చెర్వు బాగైందన్నారు.

Pages