S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వం మెడలు వంచుతాం

హైదరాబాద్, అక్టోబర్ 21: ‘ప్రభుత్వం మెడలు వంచుతాం... ఫీజు రీయంబర్స్‌మెంట్ వసూలు చేసి, విద్యార్థులకు న్యాయం చేస్తాం..’ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు హెచ్చరించారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై కాంగ్రెస్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పోరాట బాట పట్టింది. శంషాబాద్‌లో ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎఐసిసి కార్యదర్శి ఆర్‌సి కుంతియా, ఎఐసిసి ఎస్‌సి విభాగం అధ్యక్షుడు కొప్పుల రాజు, టి.పిసిసి అధ్యక్షుడు కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రారంభించారు.

భారత జైళ్ల స్ఫూర్తిని బంగ్లాలో ఆవిష్కరిస్తాం

సంగారెడ్డి, అక్టోబర్ 21: పొరుగున ఉన్న భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఉన్న జైళ్ల పనితీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, అదే స్ఫూర్తిని తమ దేశంలోని జైళ్లలో ఆవిష్కరిస్తామని బంగ్లాదేశ్‌కు చెందిన జైళ్ల శాఖ అదనపు ఐజి కల్నల్ ఇక్బాల్, రక్షణ శాఖ డిప్యూటీ సెక్రటరీ షేక్ షకీల్ అహ్మద్‌లు పేర్కొన్నారు. 14 మంది సభ్యులతో ఉన్న ఈ బృందం తెలంగాణలోని చర్లపల్లి, తమిళనాడులోని వేలూరు జైళ్లను సందర్శించారు. హైదరాబాద్‌లోని సీకా, తమిళనాడులోని ఆప్కాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న జైళ్ల పనితీరు బాగుందని సంతృప్తిని వ్యక్తం చేసారు.

నీచ రాజకీయాల ఘనత కాంగ్రెస్‌దే

హైదరాబాద్/ఖైరతాబాద్, అక్టోబర్ 21: దేశ రాజకీయాలను నీచస్థాయికి తీసుకువెళ్లిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత విమర్శించారు. తొమ్మిది దేశాల్లో బతుకమ్మ ఉత్సవాలను విజయవంతంగా పూర్తిచేసుకొని నగరానికి వచ్చిన సందర్భంగా శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలపై ఈవిధంగా స్పందించారు.

అంకుర సంస్థలకు ప్రోత్సాహం అద్భుతం

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ - అస్సాం రాష్ట్రాల మధ్య వివిధ అంశాలపై త్వరలోనే పలు ఒప్పందాలు జరుపుకోనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. అస్సాం రాష్ట్ర అటవీ, ఐటి, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటర్ రిసోర్సెస్ మంత్రి కేశభ్ మహంత వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించేందుకు మహంత నేతృత్వంలో ఒక బృందం శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చింది. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులతో మహంత సమావేశం అయ్యారు. ఈ బృందం టి-హబ్‌ను సందర్శించింది. అంకుర సంస్థలను ప్రోత్సహిస్తున్న తీరు అద్భుతంగా ఉందని చెప్పారు.

బాలారిష్టాల్లోనే ‘కొత్త’ పాలన

కరీంనగర్, అక్టోబర్ 21: ప్రజల ముంగిటకే పాలన అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన జరిగి 11రోజులు గడిచినా.. కొత్త పాలన బాలారిష్టాలే ఎదుర్కొంటోంది. ఓ వైపు కొత్త కార్యాలయాల్లో కనీస వసతులు కరవు, మరోవైపు కార్యాలయాలకు చేరని దస్త్రాలు, ఫైళ్లు వెరసి పాలనపై ప్రభావం చూపుతూ ఇటు ప్రజలకు, అటు ఉద్యోగస్థులకు తంటాలు తప్పటం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్‌లు, ఎస్పీ కార్యాలయాలు చకచకా ఏర్పాటు చేసినప్పటికీ పాలనకు సంబంధించిన సరంజామా సమకూర్చడంలో ఆలస్యం జరుగుతోంది.

రక్తమోడిన రహదారులు

నాగులుప్పలపాడు/మనుబోలు/పుంగనూరు, అక్టోబర్ 21: ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, జిల్లాల్లో శుక్రవారం జరిగిన వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద శుక్రవారం ఆర్‌టిసి బస్సు ఆటో ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న గుంజి అశోక్(16),బత్తుల లింగమ్మ(50), షేక్ జోసెఫ్(30) అక్కడికక్కడే మృతిచెందారు. ఈఘటనలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాల పూర్ వద్ద ఆగి వున్న ట్రక్కు ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఏడు గొర్రెలు మృతి చెందాయి.

బడికి దూరం.. బతుకు భారం!

భద్రాచలం, అక్టోబర్ 21: ఆదివాసీల అమ్మభాషకు గ్రహణం పట్టింది. పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా గిరిజన గూడేల్లో డ్రాపౌట్లు ఏటికేడు పెరుగుతున్నాయి. బడికి దూరమై బతుకుభారమై గిరిపుత్రులు పశువుల కాపర్లుగా మారుతున్నారు. తెలంగాణలో అమ్మభాష ద్వారా గిరిజనులకు పాఠాలు చెప్పాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టు మూలనపడింది. పాలకుల అలసత్వం గిరికూనలకు శాపంగా పరిణమించింది. అదిలాబాదులో గోండుభారతి, వరంగల్‌లో బంజారా భారతి, ఖమ్మంలో కోయభారతి పేరిట ప్రారంభించిన పాఠశాలలన్నీ మూతపడ్డాయి. దీంతో గిరిబిడ్డలు చదువుకు దూరవౌతున్నారు.
2004లో శ్రీకారం...

పోలీస్ వ్యవస్థ ఆధునీకరణకు కృషి

విజయవాడ, అక్టోబర్ 21: తీవ్రవాదాన్ని ఎదుర్కోటంలో భారతదేశంలోనే ఎపి పోలీసుకు ప్రత్యేక స్థానం ఉందంటూ, కాలానుగుణంగా రాష్ట్ర పోలీస్ వ్యవస్థను ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఇటీవల కాలంలో సంఘ విద్రోహ శక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్నందున వారికి దీటుగా పోలీస్ వ్యవస్థకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, అవసరమైన పరికరాలను అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గోదావరి చెంత నెల ముందే ఖరీఫ్

రాజమహేంద్రవరం, అక్టోబర్ 21: వ్యవసాయ యాంత్రీకరణను అందిపుచ్చుకుని గోదావరి చెంతన రైతులు ఖరీఫ్ ముందస్తు దిగుబడి సాధించి రికార్డు సాధించారు. దాదాపు నెల రోజుల ముందుగానే ఆశాజనకమైన దిగుబడి సాధించి ప్రయోగాత్మకంగా ముందున్నారు. దాదాపు ముఫ్పై వేల ఎకరాల విస్తీర్ణంలో ఈ మేరకు ముందస్తు దిగుబడి సాధించడం విశేషత సంతరించుకుంది. సాధారణంగా ఖరీఫ్ వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మే నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అయితే జూలై మొదటి వారం నుంచి గానీ పూర్తి స్థాయిలో నాట్లు పూర్తయ్యే పరిస్థితి లేదు. అంటే వ్యవసాయ నిర్ధిష్ట ప్రణాళిక కంటే దాదాపు నెలన్నరకు గానీ పూర్తి స్థాయిలో సాగు మొదలుకాని పరిస్థితి వుంది.

కేంద్రం నోటిఫికేషన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, అక్టోబర్ 21: ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పరిధి నుంచి తెలంగాణను తొలగిస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్ రంగనాథన్, జస్టిస్ దుర్గాప్రసాద్‌రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేవారు. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించిన అంశాలను తుది విచారణలో పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది.

Pages