S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాళ్లవాపు వ్యాధితో గిరిజనుడికి అస్వస్థత

చింతూరు, సెప్టెంబర్ 23: చింతూరు మండలం వాలమూరిగొంది గ్రామానికి చెందిన సోడే కృష్ణమూర్తి అనే గిరిజనుడు కాళ్ల వాపు వ్యాధి సోకి గత రెండు వారాలుగా బాధపడుతున్నాడు. శుక్రవారం కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో చింతూరు క్లస్టర్ వైద్యశాలకు వచ్చి, వైద్యం పొందుతున్నాడు. చాపకింద నీరులా కాళ్లవాపు వ్యాధి ప్రబలడంతో ఏజెన్సీలోని గిరిజనులు భయాందోలలకు గురవుతున్నారు.

ఘర్షణల నివారణకు శాంతి కమిటీలు

కాట్రేనికోన, సెప్టెంబర్ 23: మత్స్యకార గ్రామాల్లో కొట్లాటలు, ఘర్షణలు అరికట్టేందుకు శాంతి కమిటీలను నియమిస్తున్నట్లు ఎస్పీ ఎం రవిప్రకాష్ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కాట్రేనికోన పోలీసు స్టేషను రికార్డులను అయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ హింసాత్మక సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా సహించేది లేదని, రౌడీషీటర్లు తెరుస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో పోలీసులు, ప్రజలకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు జనమైత్రి సదస్సులు, ఫ్రెండ్లీ పోలీసు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శాంతి కమిటీల వల్ల గ్రామాల్లో కులపరమైన గొడవలు నివారించవచ్చన్నారు.

వేటగాడి బాణానికి గాయపడిన జింక

చింతూరు, సెప్టెంబర్ 23: మండలంలోని లక్కవరం అటవీ క్షేత్రం పరిధిలో వేటగాళ్ల బాణానికి ఓ జింక గాయపడిన ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అటవీ ప్రాంతంలో వేటగాడి బాణానికి గాయపడిన జింక మోతుగూడెం గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడింది. దీంతో గ్రామస్థులు గాయపడిన జింకను అటవీ అధికారులకు అప్పగించారు. ఈ జింకను చింతూరు పశువైద్యశాలకు తరలించి, అధికారులు చికిత్స అందించారు.

పాదగయను దర్శించిన చిరంజీవి తనయ శ్రీజ

పిఠాపురం, సెప్టెంబర్ 23: ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి రెండవ కుమార్తె శ్రీజ తన కుటుంబంతో శుక్రవారం పాదగయను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈమెకు సూపరిటెండెంట్ వడ్డి శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు.

రేఖపల్లి పిహెచ్‌సి ఆకస్మిక తనిఖీ

విఆర్ పురం, సెప్టెంబర్ 23: స్థానిక రేఖపల్లి ప్రభుత్వ వైద్యశాలను రంపచోడవరం పిఒ చక్రధరబాబు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలోని రోగుల వార్డులను, ప్రశూతి గదిని, రక్త పరీక్ష గదిని పరిశీలించారు. రక్త పరీక్ష గదిలో టెస్టులు ఎలా చేస్తున్నది పరిశీలించారు. అనంతరం వైద్యులతో రోగులకు అందిస్తున్న సేవలను గూర్చి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇంటింటికీ నిర్వహించిన హెల్త్ సర్వే రిపోర్టులను పరిశీలించారు. రానున్న పదిహేను రోజుల వరకు ఎవరూ విశ్రమించరాదని అన్నారు. కొత్తగా పంపించిన వైద్యులతో గ్రామాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు.

నేడు ముఖ్యమంత్రి రాక

ఏలూరు, సెప్టెంబర్ 23 : సీజనల్ వ్యాధులు, రకరకాల జ్వరాలు విస్తృతంగా ప్రబలుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతున్నారు. దీనిలో భాగంగా శనివారం ఏలూరులో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి సమయంలో ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూలు ఖరారైంది. దీనిలో భాగంగా చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ఉదయం 10 గంటలకు ఏలూరు చేరుకుంటారు.

నువ్వా యువతకు నీతులు చెప్పేది!

భీమవరం, సెప్టెంబర్ 23: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి విద్యార్థులతో భేటీ అయ్యే నైతిక అర్హత లేదని రాజ్యసభ సభ్యురాలు, జిల్లా టిడిపి అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. యువభేరి పేరుతో గురువారం విద్యార్థులతో భేటీ అయన జగన్ శుక్రవారం అవినీతి అక్రమాస్తులకు సంబంధించి కేసులో కోర్టుకు హాజరవ్వడాన్ని యువత గుర్తించాలని కోరారు. శుక్రవారం ఆమె స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. వారానికి ఒకరోజు కోర్టు మెట్లెక్కే జగన్ విద్యార్థులకు ఏ విధంగా సందేశమిస్తారని ప్రశ్నించారు. అవినీతి కేసుల గురించా? 16 నెలల జైలు జీవితం గురించా? అని ప్రశ్నించారు.

విషబీజాలు నాటుతారా..

ఏలూరు, సెప్టెంబర్ 23 : రాష్ట్భ్రావృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తుంటే ఎప్పటికప్పుడు అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీ సిద్ధమవుతుందని మంత్రి పీతల సుజాత విమర్శించారు. ఏలూరులో నిర్వహించిన యువభేరి కార్యక్రమంలో జగన్మోహన్‌రెడ్డి యువతరం మనస్సుల్లో విషబీజాలు నాటేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు కేసుల్లో నిందితునిగా వున్న వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి విద్యార్ధులతో మాట్లాడితే ఎలాంటి సంకేతాలు వెళతాయని ప్రశ్నించారు.

ముంచుతున్న వర్షాలు

గోపాలపురం, సెప్టెంబర్ 23: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు, చెరువులు పొంగడంతో వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వాదాలకుంట గ్రామంలో ఉన్న ఊరచెరువు గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి గట్టుపై నుండి నీరు ప్రవహించడంతో ఎస్సీ ప్రాంతంలో సుమారు 200 ఇళ్లను వరదనీరు ముంచెత్తింది. చెరువులోని చేపలు సైతం ఇళ్లల్లోకి వచ్చాయి. సుమారు 12 గంటల సమయంలో చెరువునీరు ఉద్ధృతంగా ఇళ్లల్లోకి ప్రవహించడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

సంస్కృతి పరిరక్షణకు ‘సేవ్ టెంపుల్స్’

ద్వారకాతిరుమల, సెప్టెంబర్ 23: సనాతన ధర్మం, సంస్కృతిని రక్షించేందుకు ‘సేవ్ టెంపుల్స్’ ఆలయ వాణిని ఏర్పాటుచేసినట్టు గజల్స్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ద్వారకాతిరుమల శేషాచల కొండపై మాధవ కల్యాణ మండపంలో జరుగుతున్న సమరసత సేవా ఫౌండేషన్ నాల్గవ శిక్షణా శిబిరంలో శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించే దిశగా తాను 125 భాషల్లో ఇప్పటి వరకూ గజల్స్ పాడినట్టు చెప్పారు. శాంతి, అహింసలను తాకడమే తన ముఖ్య ఉద్దేశ్యంగా గజల్స్‌ను ఆలపిస్తున్నట్టు చెప్పారు. జీర్ణమవుతున్న ఆలయాలకు జీవం పోసేందుకు ప్రవాసాంధ్రులు వాటిని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరారు.

Pages