S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

బాలానగర్, సెప్టెంబర్ 23: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన మృతి చెందాడు. బాలానగర్ మండలం నందారం గ్రామ పంచాయతీ పరిధిలోని మచారం తాండకు చెందిన తులసీనాయక్(33)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కకడే మృతి చెందాడు. బాలానగర్‌లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. డీకొట్టిన వాహనం అక్కడ నిలవకుండా మరింత వేగవంతో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు.

గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర అత్యంత కీలకమైనదని, ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో చక్కగా అమలు పరిచి గ్రామాలను అభివృద్ధి పరచాలని కలెక్టర్ డాక్టర్ పి.లక్ష్మీనృసింహం కోరారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పథకం పనులపై సర్పంచ్‌లపై నిర్వహిస్తున్న శిక్షణా శిబిరానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు.

సోలార్‌తో విద్యుత్ ఆదా

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: సోలార్ వాడకం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయొచ్చని నెడ్‌క్యాప్ జనరల్ మేనేజర్ ఎం.వి.కె.రాజు తెలిపారు. గురువారం ఈ మేరకు స్థానిక ఎపి ఇపిడిసిఎల్ సూపరింటెండెంట్ ఇంజనీరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో సోలార్ వ్యవసాయ పంపుసెట్ల వాడకం బాగానే ఉన్నప్పటికీ, గృహావసరాలకు సోలార్ వాడకం ఉత్తరాంధ్రలోనే జిల్లా వెనుకబడి ఉందన్నారు. సోలార్ నెట్ మీటరు సిస్టమ్‌లో భాగంగా గృహావసరాలకు వినియోగించే సోలార్ పరికరాలపై సబ్సిడీ ఉందన్నారు. అయితే, ఒక కిలోవాట్‌కు తక్కువ కాకుండా ఒక మెగావాట్ వరకు మాత్రమే సోలార్ వాడకంనకు వీలుంటుందని చెప్పారు.

కేంద్ర పథకాలపై ప్రచారం

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో రూపొందిస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులకు అందేలా క్షేత్రస్థాయిలో నెహ్రూ యువకేంద్రం వాలంటీర్లు ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రచారాధికారి డాక్టర్ జి.కొండలరావు కోరారు. స్థానిక టిటిడిసిలో మూడు రోజులుగా నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో వాలంటీర్లకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన హాజరై పలు విషయాల్లో శిక్షణ ఇచ్చారు. అటల్ ఫించన్‌యోజన పథకం, మేక్ ఇన్ ఇండియా, ఫసల్‌భీమా వంటి పథకాల ద్వారా ఎలా లబ్ధిపొందాలన్న విషయాలను ప్రజలకు వివరించాలన్నారు.

రెండున్నరేళ్ళలో సాధించిందేమిటి?

గార, సెప్టెంబర్ 22: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సాధించింది ఏదీలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. మండలం బోరవానిపేట పంచాయతీ గ్రామాల్లో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నినాదంతో పార్టీ శ్రేణులు ఇంటింటా పర్యటించి కరపత్రాలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కాకపోయినప్పటికీ అధికారం అందిపుచ్చుకోవాలన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చిన ఘనడు చంద్రబాబు

కార్పొరేషన్‌కు మరో రూ. 31 కోట్లు కావాలి!

శ్రీకాకుళం, సెప్టెంబర్ 22: నగరపాలక సంస్థ ఎన్నికల నగరా మోగకముందే ఎన్నికల వరాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందే.. రెండేళ్ళ తెలుగుదేశం పాలనలో రూ. 28 కోట్ల రూపాయలు శ్రీకాకుళం కార్పొరేషన్‌లో అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిధులు మంజూరు చేయడం, ప్రతిపాదించిన ఆ పనులు మరో 30 శాతం వరకూ జరగవల్సివున్న విషయం తెలిసిందే.

ఆటోమిషన్‌తో ప్రమాదాల నివారణ

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఆటోమిషన్ పద్దతి వల్ల పరిశ్రమల్లో ప్రమాదాలు నివారించవచ్చునని ఇండోవెల్ ఆటోమిషన్(పూణె) డైరెక్టర్ హిమామ్స్‌కుమార్ స్పష్టంచేశారు. చిలకపాలెం కూడలిలో ఉన్న శ్రీశివానీ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం ఆటోమిషన్ పద్ధతులపై ప్రారంభమైన జాతీయ సదస్సు గురువారం ముగిసింది. ఈ ముగింపుకార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటోమిషన్ ద్వారా పరిశ్రమల్లో సిబ్బంది ఆదా అవుతారని ప్రమాదాల శాతం నివారించవచ్చునని వివరించారు. పనిభారం తగ్గించడమే కాకుండా మంచి ఫలితాలు సాధించవచ్చునని విద్యార్థులకు వివరించారు. నాణ్యమైన ఉత్పత్తులు కూడా ఈ పద్ధతిలో సాధించవచ్చునని విద్యార్థులు గుర్తెరగాలన్నారు.

ఎన్‌ఎస్‌ఎస్ రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానం

ఎచ్చెర్ల, సెప్టెంబర్ 22: ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో ఉత్త సేవలందించిన అధికారులకు, వాలంటీర్లకు ఈనెల 29న రాష్టస్థ్రాయి అవార్డులు అంబేద్కర్ వర్శిటీ కేంద్రంగా నిర్వహించే కార్యక్రమంలో ప్రదానం చేస్తామని ఇంచార్జ్ వీసి ఎం.చంద్రయ్య స్పష్టంచేశారు. గురువారం ఆయన ఛాంబర్‌లో విలేఖర్లతో మాట్లాడుతూ 2015-16 సంవత్సరంలో ఎన్‌ఎస్‌ఎస్ విభాగంలో చురుకైన పాత్ర పోషించి ఉత్తమ సేవలు అందించిన వారికి ఈ అవార్డులు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఒక ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్, ఆరుగురు ప్రోగ్రామ్ ఆఫీసర్లు, పదిమంది వాలంటీర్లను అవార్డులకు ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.

రెండేళ్ళ పాలనలో ఒక్క ఇల్లూ మంజూరు కాలేదు

జలుమూరు, సెప్టెంబర్ 22: రాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రెండున్నరేళ్ళు పాలన సాగిస్తున్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క నిరుపేదవాడికి కూడా ఇల్లు మంజూరు చేయకపోవడం విచారకరమని రాష్ట్ర వైసిసి బిసి సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ అన్నారు. మండలం అక్కురాడ, లచ్చన్నపేట, కామినాయుడుపేట గ్రామాల్లో గురువారం నిర్వహించిన గడపగడపకూ వైసిపి కార్యక్రమంలో ఆయన ప్రజల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు. కామినాయుడు పేట గ్రామంలో పలువురు మహిళలు పింఛన్లు రావడం లేదని కృష్ణదాస్ దగ్గర మొరపెట్టుకున్నారు. లచ్ఛన్నపేట గ్రామంలో నిరుపేదలకు ఇళ్లు లేవని ఆందోళన చెందారు.

పారిశుద్ధ్యం ఇంత అధ్వాన్నమా?

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 22: రాష్ట్రంలో స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో శ్రమిస్తుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించడం సబబుగా లేదని ఎమ్మెల్యే లక్ష్మీదేవి అసహనం వ్యక్తం చేశారు. గురువారం ఆమె వార్డు పర్యటనలో భాగంగా స్థానిక పదో వార్డు పరిధిలోని రెడ్డికవీధి, పుప్పాలవీధి, ప్రకాశనగర్ కాలనీ, గొంటివీధి, ఏనుగుల మహల్‌వీధిల్లో పర్యటించి అక్కడి సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రకాష్‌నగర్ కాలనీలో పర్యటిస్తుండగా రోడ్డుపై నీరునిలిచి బురదమయం కావడంతో వెంట ఉన్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pages