S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిండు కుండలా పోగొండ!

బుట్టాయగూడెం, సెప్టెంబర్ 23: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల్లో ఊపిరి పోసుకుని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలనాపాలనతో జీవం నింపుకున్న మెట్టరైతన్నల మానసపుత్రిక పోగొండ ప్రాజెక్టు వరదనీటితో నిండి, నీళ్లాడిన నిండు చూలాలిని తలపిస్తుంది. మండలంలోని చింతలగూడెం సమీపంలో సుమారు నాలుగేళ్ల క్రితం రూ.27కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసుకున్న పోగొండ ప్రాజెక్టు, నిర్మాణవ్యయం పెరిగి రూ.85కోట్ల వ్యయంతో, ఎన్నో బాలారిష్టాలను దాటుకుని, పూర్తయ్యే దశకు చేరుకుంది.

జలదిగ్బంధంలో జంగారెడ్డిగూడెం

జంగారెడ్డిగూడెం, సెప్టెంబర్ 23: ఈ వర్షాకాలం సీజన్‌లో అతి భారీ వర్షం గురువారం రాత్రి కురవడంతో జంగారెడ్డిగూడెం జలమయమైంది. జన జీవనం అతలాకుతలమైంది. గురువారం రాత్రి 9.30 గంటల నుండి 11.30 గంటల వరకు రెండుగంటల్లో సుమారు 14 సెంటీమీటర్ల వర్షపాతం పడటంతో పట్టణంలో పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి పట్టణంలోని అశ్వారావుపేట రోడ్డులో డివైడర్ పైనుండి వరదనీరు పొర్లి ప్రవహించింది. దీనితో సుబ్బారెడ్డికాలనీ, రాజుల కాలనీ, ఊరచెరువు తదితర చోట్ల రోడ్లు కాలవలయ్యాయి. అశ్వారావుపేట రోడ్డులో పోలీసు స్టేషన్ వద్ద ఇసుకమేట వేసింది. ఊరచెరువు ప్రాంతంలో ఏలూరు రోడ్డు జలమయమైంది. ఇదే రోడ్డు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మునిగి పోయింది.

జాతీయ స్థాయ ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 ప్రారంభం

భీమవరం, సెప్టెంబర్ 23: దక్షిణ భారతదేశంలోనే ప్రపథమంగా భీమవరం విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయస్థాయి విష్ణు ఇ-మోటో ఛాంపియన్‌షిప్-2016 (ఇ-బైక్ రేసింగ్) శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. నాలుగురోజుల పాటు ఇ-బైక్ రేసింగ్ కార్యక్రమాలు జరగనున్నాయి. ముందుగా ఈ కార్యక్రమానికి ఢిల్లీకి చెందిన యువపారిశ్రామికవేత్త మధుకర్ సోనీ జ్యోతిప్రజ్వలన చేశారు. బెలూన్లు వదిలి ఛాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ సభలో యువపారిశ్రామికవేత్త మధుకర్ సోనీ విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.

పట్టిసీమ పైపులైన్లతో మునిగిపోతున్న పంటలు

పోలవరం, సెప్టెంబర్ 23: పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పైపులైనుపై గట్టు వేయడం వల్ల తమ పొలాలు వర్షం నీటిలో ముంపునకు గురై పంటలు పాడై పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పట్టిసీమ రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలు వర్షం నీటి ముంపులో ఉన్నాయి. ఎత్తిపోతల పైపులైన్లపై ఎత్తుగా గట్టు వేయడంతో వర్షం నీరు బయటకు వెళ్లే దారి లేక పంటలు వర్షం నీటిలో ఉన్నాయని రైతులు బదిరెడ్డి వెంకన్నదొర, సానా శ్రీనివాస్, తెలగంశెట్టి సూర్యచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో పొలాలపై వర్షం నీరు పోలవరంలోని కడెమ్మ స్లూరుూస్ ద్వారా గోదావరిలోకి వెళ్లేది.

నకిలీ పాస్ పుస్తకాలతో రుణాలు కేసులో ముగ్గురు అరెస్టు

ఆకివీడు, సెప్టెంబర్ 23: నకిలీ పాస్ పుస్తకాలను తయారుజేసి బ్యాంకు నుంచి రుణాలు పొందిన కేసుకు సంబంధించి ముగ్గురు కీలక వ్యక్తులను ఆకివీడు పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఆంధ్రా బ్యాంకు బ్రాంచ్‌లో 2007 నుంచి 2010 వరకు 115 మంది వ్యక్తులు సుమారు రూ.కోటి పైనే రుణాలు పొందారు. అయితే 2015 మార్చిలో అప్పటి బ్రాంచ్ మేనేజర్ జివి రమణ ఆకివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు పొందినట్లు తాము గుర్తించామని పోలీసులకు వివరించడంతో అప్పటి ఎస్సై కెఎస్‌వి ప్రసాద్ కేసు నమోదుచేశారు.

జోరువాన

ఖమ్మం, సెప్టెంబర్ 23: అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జోరువాన కురిసింది. ఖమ్మం నగరంతో పాటు పలు మండలాల్లో కుండపోతగా వర్షం పడడంతో జిల్లాలోని చెరువులు, వాగులు, ప్రాజెక్టులు నిండి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో అత్యధికంగా టేకులపల్లి మండలంలో 110.4 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మధిర మండలంలో 1.8 మిల్లిమిటర్ల వర్షపాతం నమోదు అయింది. గురువారం రాత్రి నుండి పడుతున్న వర్షంతో జిల్లాలోని కినె్నరసాని ప్రాజెక్టు నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

కీలకదశలో జిల్లాల పునర్విభజన

భద్రాచలం, సెప్టెంబర్ 23: జిల్లాల పునర్విభజన కీలకదశకు చేరుకుంది. దసరా సందర్భంగా కొత్త జిల్లా కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభించి విధులు నిర్వర్తించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ముహూర్తం ముంచుకు రావడంతో ఉద్యోగుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 7వ తేదీనే కొత్త జిల్లాలకు ఉద్యోగులను కేటాయించాలని, వారికి ఆర్డర్ కాపీలను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో హడావుడి తారస్థాయికి చేరింది. ఉద్యోగుల విభజన ప్రక్రియపై ఉద్యోగుల్లో కొన్ని సందేహాలు ఉన్నాయి. దీనిపై స్పష్టత రాకుండానే తమకు బదిలీ ఉత్తర్వులు చేతిలో పెడుతున్నారనే ఆందోళన వారిలో వ్యక్తవౌతోంది.

మరో కార్యాలయం కొత్తగూడెం తరలింపు

భద్రాచలం, సెప్టెంబర్ 23: రాష్ట్ర విభజన సమయం నుంచి షాకుల మీదు షాకులు తింటున్న భద్రాచలం ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో ఝలక్ ఇచ్చింది. ఇప్పటికే ఆర్‌అండ్‌బి, నీటిపారుదల...వంటి కీలక కార్యాలయాలను భద్రాచలం నుంచి తరలించుకు పోయిన ప్రభుత్వం తాజాగా నూతనంగా ఆవిర్భవించనున్న కొత్తగూడెంకు మరో కార్యాలయాన్ని కూడా తరలించుకు పోయేందుకు రంగం సిద్ధం చేసింది. సహకార శాఖ విభాగ సహకార అధికారి(డిఎల్‌సిఓ) కార్యాలయాన్ని కొత్తగూడెం తరలించనున్నారు. ఈ నెల వరకే భద్రాచలంలో కార్యకలాపాలు నిర్వహించి వచ్చే నెలలో కొత్తగూడెం కేంద్రంగా పనులు చేపట్టాలని ఆదేశించినట్లుగా సమాచారం.

ఎలాంటి నష్టం జరగనివ్వొద్దు

ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునే్నరు పొంగి పొర్లుతుందని, ఎలాంటి నష్టం జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం రాత్రి నగరంలోని మునే్నటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మునే్నటి భారీగా వరద నీరు చేరిందని, అధికారులు ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

గ్రామాల్లో ప్రబలుతున్న విషజ్వరాలు

జూలూరుపాడు, సెప్టెంబర్ 23: మండల పరిధిలోని పాపకొల్లు మేజర్ గ్రామ పంచాయతీ శివారు గ్రామం ముత్యాలమ్మకాలనీలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలనీలో పారిశుద్ధ్య లోపం తలెత్తింది. అంతర్గత రహదారులు, జనావాసాలు బురద కయ్యలుగా మారాయి. పిల్లలు ఇళ్లనుంచి బయటకు రావలంటేనే భయపడుతున్నారు. రోడ్లపై మోకాళ్లలోతు బురదనీటిలోనే కాలనీ వాసులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పాటు రక్షిత నీటి పథకం పైపులైన్ కూడా అస్తవ్యస్తంగా మారింది. చెక్‌వాల్వ్‌లు పాడైపోవటంతో బురదనీరు పైపులైన్‌లలోకి ప్రవేశిస్తుంది. ఈనీళ్లే కాలనీలో సరఫరా జరుగుతుందని కాలనీ వాసులు వాపోతున్నారు.

Pages