S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాల్లో పదవుల సందడి

ఖమ్మం, సెప్టెంబర్ 22: జిల్లాల విభజన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో కొత్త కమిటీలను వేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త జిల్లాల్లో నేతలకు పార్టీల పదవులు దక్కే అవకాశం ఉండటంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. పార్టీలో కీలక పదవులు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతుండగా ఆయా పార్టీల ప్రధాన నేతలు మాత్రం ఆయా జిల్లాల్లో నియమించే ప్రధాన బాధ్యులను ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది.

కుదిపేసిన కుంభవృష్టి

గుంటూరు, సెప్టెంబర్ 22: జిల్లాను కుంభవృష్టి కుదిపివేసింది. భారీ వర్షాలకు వ్యవసాయ, ఉద్యానవన పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షాలకు రసాయనాలు చల్లి పంటలను కాపాడుకునే ఆతృతతో ఉన్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు పంటలు చేతికి అందివచ్చే పరిస్థితులులేవని లబోదిబో మంటున్నారు. పత్తి, మిర్చి, వరి పంటలకు అపారన సంభవించింది. సుమారు మూడు లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన, వాణిజ్య పంటలు నీట నానుతున్నాయి. జిల్లా మొత్తంగా 4598 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 35 మండలాల్లో 20 శాతం అత్యధికంగా 17 మండలాల్లో 10 నుంచి 25 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయింది.

సత్తెనపల్లిని ముంచెత్తిన వరద నీరు

సత్తెనపల్లి, సెప్టెంబర్ 22: గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో పాటు వివిధ గ్రామాలను వరదనీరు చుట్టుముట్టి అతలాకుతలం చేసింది. బుధవారం ఆర్ధరాత్రి నుండి గురువారం ఉదయం 11 గంటల వరకు కురిసిన వర్షానికి పట్టణంలోని ప్రజలు ఎప్పుడు ఏమి జరుగుతుందోన్న భయంతో వణికిపోయారు. కుండపోతగా వర్షంకురుస్తుండడంతో మాచర్ల-గుంటూరు రహదారిలోని బసవమ్మ, ఎద్దువాగులు, సత్తెనపల్లి- నరసరావుపేట రహదారిపై వర్షపునీరు ఉద్ధృతిగా పొంగి పొర్లాయి. పట్టణంలోని నాగన్నకుంట, వెంకటపతినగర్, బోయకాలని, రఘరామ్‌నగర్, వడ్డవల్లి తదితర ప్రాంతాలు నీటమునిగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

వరద బీభత్సం

నాదెండ్ల, సెప్టెంబర్ 22: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మండలంలోని రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాల వల్ల కుప్పగంజి వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరద బీభత్సం వల్ల అమిన్‌సాహేబ్‌పాలెం గ్రామంలో కుప్పగంజి వాగు పొంగి పొర్లటంతో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒక వ్యక్తి 20 గంటల పాటు తాటిచెట్టును పట్టుకుని స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న హోం మంత్రి చిన రాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు

కాకినాడ, సెప్టెంబర్ 22: భారీ వర్షాలపై అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా యంత్రాంగాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టాలు లేకుండా తగు ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్ హెచ్ అరుణ్‌కుమార్‌కు సూచించారు. గురువారం ముఖ్యమంత్రి నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కేంద్రం కాకినాడ నుండి పాల్గొన్న కలెక్టర్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులను వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ప్రమాదకర పరిస్థితుల్లేవని, రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ, ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించలేదని చెప్పారు.

వీడని ముసురు

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 22: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జన జీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలకు ఇంట్లోంచి కాలు బయటపెట్టలేని స్థితి నెలకొంది. ఏరోజు కారోజు జీవనాధారం కలిగిన చిరు వ్యాపారులు వాన ముసురు వల్ల వ్యాపారాలు లేక ఉపాధి కోల్పోయారు. రాజమహేంద్రవరం పరిసర గ్రామాల నుంచి నిత్యం వేలాది మంది నగరంలో చిరు వ్యాపారాలు చేసుకునే నిమిత్తం వస్తుంటారు. ఇటువంటి వారి వ్యాపారాలన్నీ లేకుండా పోయాయి. ముసురుతో వ్యాపారాలు స్తంభించాయి. ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో జన జీవనం స్తంభించింది. రాజమహేంద్రవరం నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే వుంది.

శ్రీవారికి త్రివేణి ఇంజనీరింగ్ 11లక్షలు విరాళం

తిరుపతి, సెప్టెంబర్ 22: జార్ఖండ్‌కు చెందిన త్రివేణి ఇంజనీరింగ్ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ బాలాజి ఆరోగ్య వరప్రసాదిని పథకానికి టిటిడికి రూ.11 లక్షల విరాళంగా అందించింది. ఈ మేరకు విరాళం చెక్కును తిరుపతికి చెందిన పసుపర్తిగోపినాథ్, రాఘవేంద్ర కలిసి గురువారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తికి అందజేశారు. తిరుపతిలోని మాధవం విశ్రాంతి గృహంలో చైర్మన్ తన ఛాంబర్‌లో ఈ చెక్కును స్వీకరించారు. పేద రోగులకు వైద్య సేవలందించేందుకు బాలాజి ఆరోగ్యవరప్రసాదిని పథకానికి (స్విమ్స్) ఈ విరాళం మొత్తాన్ని అందించాలని దాతలు కోరారు.

వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన కాజ్‌వే స్లాబ్

రాజుపాళెం, సెప్టెంబర్ 22: రాజుపాళెం - అయ్యవారుపల్లె గ్రామాల మధ్య మడవంకపై నిర్మించిన లో లెవెల్ కాజ్‌వే స్లాబ్ వంక ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో గురువారం ఈ రహదారి గుండా వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కురిసిన వర్షాలకు కాజ్‌వేస్లాబ్‌లు భూమిలోకి కృంగిపోయాయి. దీనివల్ల ఆర్టీసీ బస్సులు, లారీలు, కార్ల రాకపోకలు నిలిచిపోయాయి. కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ఈ కాజ్‌వే వెంట పోయేందుకు వీలుగా వుండేది. అయితే గత రెండురోజులుగా కురిసిన వర్షాలకు పైతట్టు ప్రాంతాలు, మండలంలో కురిసిన వర్షానికి మడవంక ఉద్ధృతంగా ప్రవహించింది.

భార్యను చంపిన భర్త అరెస్టు

చక్రాయపేట, సెప్టెంబర్ 22:మండలంలోని సురభి గ్రామం నాగలగట్టుపల్లె గ్రామంలో నివాసం ఉంటున్న శివప్రసాద్ తన భార్యను ఈ నెల 9వ తేదీ పంజాబు డ్రస్సు ఓనీతో గొంతును బిగించిన విషయం విదితమే. 8 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరు పట్టణం బాలాజీనగర్‌లో ఆదినారాయణ ఏకైక కుమార్తె శివమ్మను పెండ్లి చేసుకున్నాడు. అప్పట్లో 8 తులాల బంగారు కట్నంగా ఇచ్చారు. శివప్రసాద్‌ది రాయచోటి మాసాపేట సొంత గ్రామం. అయితే అప్పట్లో శివప్రసాద్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగించుకుంటున్నాడు. ఆరు సంవత్సరాలు రాయచోటిలో కాలయాపన చేసి అనంతరం రెండు సంవత్సరాల క్రితం నాగలగట్టుపల్లె గ్రామంలో జానకి థియేటర్‌ను లీజ్‌కు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు.

వ్యక్తి ఆత్మహత్య

పామిడి, సెప్టెంబర్ 22: వ్యవసాయం కోసం చేసిన అప్పులు అధికం కావటం.. భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో విరక్తి చెందిన తలారి శివ (30) పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన బుధవారం రాత్రి మండల పరిధిలోని అనుంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సంఘటనకు సంబందించి పోలీసులు అందించిన వివరాలిలా వున్నాయి.. తనకున్న రెండెకరాలతోపాటు సోదరుని 4 ఎకరాలు పొలాన్ని గుత్తకు తీసుకుని తలారి శివ పత్తి పంటను సాగు చేశాడన్నారు. పత్తి పంట సాగులో నష్టాలు రావటంతో చేసిన అప్పులు అధికం కావటం కారణంగా సతమతమవుతున్న క్రమంలో భార్య పుట్టింటికి వెళ్ళిపోవటంతో విరక్తి చెంది పురుగుల మందును సేవించాడన్నారు.

Pages