S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొదలైన సోమవారం సమీక్షలు

పోలవరం, సెప్టెంబర్ 19: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్షలు మొదలయ్యాయ. 2018 నాటికి పోలవరం పూర్తిచేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రతి సోమవారం పనులను వర్చువల్ విధానంలో సమీక్షిస్తానని, నెలలో మూడో సోమవారం ప్రాజెక్టును సందర్శించి పరిశీలిస్తానని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం విజయవాడ నుండి ముఖ్యమంత్రి పనులపై వర్చువల్ సమీక్ష జరిపారు. ఉదయం 10 నుండి రెండున్నర గంటల పాటు సమీక్షించారు. సిఎంకు నిర్మాణ పనులు చూపించేందుకు డ్రోన్ కెమెరాతోపాటు స్టాండ్‌పై కెమెరాలు ఏర్పాటుచేశారు.

మెగా ఆక్వా ఫుడ్‌పార్కు త్వరగా నిర్మించాలి

భీమవరం, సెప్టెంబర్ 19: ఆక్వా రైతాంగానికి వరంలా మారిన గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్కు నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేయాలని రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి డిమాండ్‌చేసింది. అలాగే త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పనులు వెంటనే ప్రారంభించి పూర్తిచేయాలన్నారు. సోమవారం సమితి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదిరాజు నాగేశ్వరరాజు మాట్లాడారు. డెల్టా ప్రాంతం అంతా ఆక్వా రంగంగా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ఆక్వా ఫుడ్‌పార్కును నిర్మించాలని గత రెండు దశాబ్దాలుగా సమితి డిమాండ్ చేస్తూనే ఉందని తెలిపారు.

ఉపాధి చెల్లింపుల్లో అవినీతి

వేలేరుపాడు, సెప్టెంబర్ 19: జాతీయ ఉపాధి హామీ పథకంలో తవ్వే కొద్దీ ఉపాధి హామీ సిబ్బంది అవినీతి భారీఎత్తున బయటపడుతోంది. సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సామాజిక తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది. వేలేరుపాడు మండలంలోని తొమ్మిది పంచాయితీల్లో 2015-16 ఆర్థిక సంవత్సరంలో 5.51 కోట్ల రూపాయల పనులు జరగగా, 1.1 కోట్ల రూపాయలను ఉపాధి హామీ సిబ్బంది స్వాహా చేసినట్టు సామాజిక తనిఖీలో వెల్లడైంది. గత 15 రోజులుగా తనిఖీ బృందాలు మండలంలో జరిగిన ఉపాధి హామీ పనులను పరిశీలించి నివేదిక తయారు చేశారు.

నిర్లక్ష్యాన్ని సహించను: విప్ చింతమనేని

ఏలూరు, సెప్టెంబర్ 19 : ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, అధికారులు తమ బాధ్యతలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ అన్నారు. సోమవారం వట్లూరు సొసైటీ ఆవరణలో సొసైటీ అధ్యక్షులుగా కొమ్మన వెంకట శ్రీ్ధర్ (నాని)తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్నందుకు వారికి సేవలు అందించాలని ప్రజా ప్రతినిధులకు చురకవేశారు. వారికి అండదండగా వుండాలని, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, సంబంధిత ఉద్యోగులతో వారి సమస్యలను పరిష్కరించాలని, అప్పటికీ పరిష్కారం కాకపోతే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

నెలకు లక్ష ఫైల్స్ ఆన్‌లైన్

ఏలూరు, సెప్టెంబర్ 19 : జిల్లాలో ప్రతీ నెలా లక్ష ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా వివిధ శాఖల అధికారులు శ్రద్ధ వహించాలని కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన వివిధ అంశాలపై సమీక్షించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అక్టోబర్ 1 నుంచి ఎలక్ట్రానిక్ పాలన దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత నెలలో కేవలం 44 వేల ఫైల్స్ మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపర్చారని, అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రతీ నెలా కనీసం లక్ష ఫైల్స్ ఆన్‌లైన్‌లో పొందుపరిచేలా అధికారులు సిద్ధం కావాలన్నారు.

బిసి కార్పొరేషన్ ఇడిగా పుష్పలత

ఏలూరు, సెప్టెంబర్ 19 : జిల్లా బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎన్ పుష్పలత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆమె కృష్ణాజిల్లా బిసి కార్పొరేషన్ ఇడిగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు వచ్చారు. కాగా ప్రస్తుతం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వున్న పెంటోజీరావును కృష్ణాజిల్లాకు బదిలీ చేశారు.

సిసి రోడ్ల నిర్మాణంలో లోపాలు లేకుండా చర్యలు

పోలవరం, సెప్టెంబర్ 19: సిమెంటు రోడ్ల నిర్మాణంలో లోపాలు లేకుండా, పగుళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇఇ బ్రహ్మారెడ్డి తెలిపారు. సోమవారం పునరావాస గ్రామాల్లో నిర్మించిన సిమెంటు రోడ్లను క్వాలిటీ పరీక్షలు నిమిత్తం నమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఇఇ విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం సిమెంటు రోడ్ల నిర్మాణంలో పగుళ్లు లేకుండా ఉండేందుకు కాంట్రాక్షన్ జాయింట్, ఎక్స్‌టెన్షన్ జాయింట్లను ఏర్పాటుచేయడం ద్వారా పగుళ్లు నివారించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇంజనీరింగ్ అధికారులకు అవగాహన కల్పించేందుకు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

ముగిసిన రోప్ స్కిప్పింగ్, వెయట్ లిఫ్టింగ్ పోటీలు

ఉంగుటూరు, సెప్టెంబర్ 19: ఉంగుటూరు మండలం నారాయణపురంలో గత మూడు రోజులుగా జరిగిన అండర్ 14, అండర్ 17, అండర్ 19 రాష్ట్రాస్థాయి రోప్ స్కిప్పింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు సోమవారం ముగిశాయి. ఓవరాల్ ఛాంపియన్ షిప్ పశ్చిమగోదావరి జిల్లాకు లభించింది. ద్వితీయ స్థానంలో తూర్పు గోదావరి, తృతీయ స్థానంలో నెల్లూరు జట్లు నిలిచాయి. రోప్ స్కిప్పింగ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో సుమారు 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

ఇ-టెక్నాలజీ వాటర్ కార్డుతో సుజల స్రవంతి

ఏలూరు, సెప్టెంబర్ 19 : విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కష్టాల్లో వుందని, అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలనను కొనసాగిస్తున్నారని రోడ్డు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఇ-టెక్నాలజీ వాటర్ కార్డుతో ఏర్పాటుచేసిన ఎన్‌టిఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్‌ను సోమవారం స్థానిక 24వ డివిజన్‌లో ఆయన ప్రారంబించారు.

టూరిజం హబ్‌గా జిల్లా

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 19: గతంలో హామీ ఇచ్చినట్టుగా తూర్పు గోదావరి జిల్లాను టూరిజం హబ్‌గా అభివృద్ధిచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు రూ.50 కోట్లు తక్షణం విడుదల చేస్తున్నామని ప్రకటించారు. సహజ వనరులు సమృద్ధిగా వున్న జిల్లాను టూరిజం హబ్‌గా చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకలంక, కేతావారిలంక, కోటిలింగాలరేవు, హేవలాక్ బ్రిడ్జిలను అభివృద్ధి చేస్తామన్నారు. హేవలాక్ బ్రిడ్జికి ఎనిమిది లేక తొమ్మిది కోట్లు కేంద్రానికి చెల్లించి అయినా తీసుకుంటామన్నారు.

Pages