S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెంగ్యూ, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 19: డెంగ్యూ, మలేరియా వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక కోనేరుసెంటరులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియాపై అవగాహన, ప్రచార ర్యాలీ వాహనాలను మంత్రి రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వ్యాధి నివారణలపై గ్రామ గ్రామాలలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమన్నారు.

బందరు ఓడరేవు భూసమీకరణకు సిద్ధం

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: బందరు ఓడరేవు, పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అవసరమైన భూములను సమీకరించేందుకు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేశారు. మొత్తం 33వేల 337.67 ఎకరాలకు గాను ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌ను మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ (మడ) వైస్ చైర్మన్ గంధం చంద్రుడు విడుదల చేశారు. ఇందులో 14వేల 620 ఎకరాలు పట్టా భూములు ఉండగా 9వేల 203 ఎకరాలు అసైన్డ్ భూమి, 9వేల 778 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మడ పరిధిలోని 28 గ్రామాల్లో గ్రామ కంఠాలు, నివాస ప్రాంతాలను మినహాయించి నోటిఫికేషన్ జారీ చేశారు.

విజ్ఞతతో ముందుకు

మచిలీపట్నం, సెప్టెంబర్ 19: రాష్ట్ర విభజనతో అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉదార సాయంతో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞతతో ముందుకు వెళుతుందన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కానందున కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీతో రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి పర్చుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించి సత్వరమే నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు విజ్ఞప్తి చేశారు.

నెమ్మలూరుకు తరలి వెళ్లిన టిడిపి శ్రేణులు

కూచిపూడి, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నెమ్మలూరులో సోమవారం బెల్ సంస్థ విస్తరణ ప్రాజెక్ట్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి మొవ్వ మండలం నుండి వేలాది మంది టిడిపి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్ళారు.

విద్యుత్ వినియోగదారులకు రూ.4 లక్షల విలువ చేసే ఫ్యాన్‌లు పంపిణీ

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 19: బందరు మండలంలో విద్యుత్ వినియోగదారులకు రూ.4లక్షల విలువచేసే ఫ్యాన్లు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర బిసి సంక్షేమం చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. సోమవారం వాటర్ వర్క్స్ ఆవరణలో ఏర్పాటైన సమావేశంలో సదరన్ పవర్ డిస్టిబ్యూషన్, ఇఇఎస్‌ఎల్ సంయుక్తంగా పవర్ పథకం కింద కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ సౌజన్యంతో విద్యుత్ ఆదా చేసే బిఎస్ 5స్టార్ సీలింగ్ ఫ్యాన్‌లను మంత్రి రవీంద్ర వినియోగదారులకు పంపిణీ చేశారు.

21 నుంచి త్రైమాసిక పరిక్షలు

కూచిపూడి, సెప్టెంబర్ 19: రాష్ట్ర విద్యా శాఖ ఈ విద్యా సంవత్సరం నుండి ఒకటి నుండి 10 తరగతుల విద్యార్థులకు త్రైమాసిక, ఆఫెర్లి పరీక్షలకు ప్రభుత్వమే ప్రశ్నాపత్రాలు రూపొందించి అందచేస్తోందని ఎంఇఓ బాణావత్ కోటేశ్వరరావు సోమవారం తెలిపారు. నిర్మాణాత్మక మూల్యాంకన-1 అనే త్రైమాసిక పరీక్షలు ఈనెల 21వ తేదీ నుండి 28వ తేదీ వరకు మండలంలోని అన్ని ప్రభుత్వ, ద్రవ్య సహాయక, ఓరియంటల్ పాఠశాలల్లో నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రశ్నాపత్రాలను సోమవారం అందచేసిందన్నారు.

విద్యుదాఘాతానికి కౌలురైతు మృతి

ముసునూరు, సెప్టెంబర్ 19: విద్యుదాఘాతానికి గురై కౌలురైతు మృతి చెందిన సంఘటన ఇది. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన భర్త మృతిచెందాడని భార్య, బంధువులు అరోపిస్తున్నారు. సేకరించిన, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని చెక్కపల్లి గ్రామానికి చెందిన పేరేచర్ల నాగేశ్వరరావు(55) వలసపల్లి గ్రామానికి చెందిన రోహిణి అనే రైతుకు చెందిన పొలాన్ని ఎనిమిది సంవత్సరాలుగా కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

పామర్రు, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నిమ్మకూరు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-మచిలీపట్న జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో పామర్రుకు చెందిన గాజుల శ్రీ్ధర్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వెనుక కుర్చున్న రావూరి భాను, మరో బైక్ పై ప్రయాణిస్తున్న యలకుర్రుకు చెందిన అరిగే నారాయణ, జొన్నల నాగరాజు తీవ్ర గాయాలపాలయ్యారు. పామర్రు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సందడిగా బెల్ కంపెనీ శంకుస్థాపన

పామర్రు, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నెమ్మలూరు గ్రామంలో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిర్మించ తలపెట్టిన అడ్వాన్స్డ్ నైట్ విజన్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీకి సోమవారం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారు.

అక్కినేని జట్టుకు కృష్ణా యూనివర్సిటీ షటిల్ ట్రోఫీ

గుడివాడ, సెప్టెంబర్ 19: ఈ నెల 16వ తేదీ నుండి 18వ తేదీ వరకు ఏజి అండ్ ఎస్‌జిఎస్ కళాశాలలో జరిగిన కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను స్థానిక అక్కినేని నాగేశ్వరరావు కళాశాల జట్టు కైవసం చేసుకుందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శంకర్ చెప్పారు. సోమవారం కళాశాలలో జరిగిన సభలో జట్టు సభ్యులు ఎం ప్రతాప్‌కుమార్, పి భువనతేజ, ఎస్ బాలాజి, భార్గవ్, వై నరేంద్ర, జి పవన్‌కుమార్, వ్యాయామ అధ్యాపకుడు వై ఉదయభాస్కర్‌లను అభినందించారు.

Pages