S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గ్రీవెన్స్’ వినతులు సత్వరమే పరిష్కరిస్తాం

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: జిల్లా కలెక్టర్ ‘గ్రీవెన్స్’కు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరిస్తామని జెసి పి.రజనీకాంతారావు హామీనిచ్చారు. సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ‘గ్రీవెన్స్’లో అర్జీదారుల నుండి జెసి-2 వినతులు స్వీకరించారు.

ఎస్పీ ‘గ్రీవెన్స్’కు 14 ఫిర్యాదులు

శ్రీకాకుళం(టౌన్), సెప్టెంబర్ 19: జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల విభాగానికి 14 వినతులు అందాయి. న్యాయం కోరుతూ పోలీసు స్టేషన్‌కు వచ్చే ప్రజా ఫిర్యాదులపై సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించగా సివిల్ తగాదాలకు సంబంధించి ఎనిమిది, పాత కేసుల పరిష్కారం కోరుతూ ఒకటి, ఇతర కారణాలతో ఐదు అర్జీలు వచ్చాయి. వీటిని పరిశీలించిన ఎస్పీ పై విధంగా సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ సూచనలు చేశారు.

25న శ్రీనివాస కల్యాణం

విజయవాడ (కల్చరల్), సెప్టెంబర్ 19: స్నేహాలయ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సాయంత్రం జింఖానా గ్రౌండ్స్‌లో శ్రీనివాస కల్యాణం జరుగుతుందని సంస్థ అధ్యక్షుడు యాంపాటి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ మండలి వ్యవస్థాపక కన్వీనర్ మందలిపర్తి సత్యశ్రీహరి పర్యవేక్షణలో శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనాలతో శ్రీ సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి, శ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి, శ్రీ సత్యానంద భారతీస్వామి కల్యాణ క్రతువును జరిపిస్తారని తెలిపారు. భగవద్భక్తులంతా వచ్చి శ్రీనివాసుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు.

బహిరంగ మల, మూత్ర నిర్మూనల చర్యలను ఇండియన్ క్వాలిటీ కౌన్సిల్ సభ్యుల పరిశీలన

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 19: విజయవాడ నగరాన్ని బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు విజయవాడ నగరపాలక సంస్థ చేపడుతున్న వివిధ నిర్మూలన చర్యలపై ఇండియన్ క్వాలిటీ కౌన్సిల్ సభ్యులు పరిశీలించారు.

డెంగ్యూ, మలేరియాపై అవగాహనకు ప్రచారం

విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధులపై పూర్తి అవగాహన కలిగించేందుకు క్షేత్రస్థాయి ప్రచారం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యవిద్య, ఆరోగ్య శాఖ మంత్రి డా. కామినేని శ్రీనివాస్ తెలిపారు. స్థానిక ఐజిఎం స్టేడియంలో రాష్ట్ర స్థాయి అర్బన్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి అవగాహన ప్రచార వాహనాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో 242 వాహనాలు అవగాహన కల్పించే దిశగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తాయన్నారు. ప్రతి లక్ష మంది జనాభాకు అవగాహన కోసం ఒక వాహనం తిరిగే దిశలో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు.

ఉగ్రవాద దాడులపై ఖండన

బెంజిసర్కిల్, సెప్టెంబర్ 19: నిద్రిస్తు న్న సైనికులపై ఉగ్రవాదులు దాడి చే యడం పట్ల సర్వత్ర నిరసన వ్యక్తవౌతుంది. దీనిపై స్పందిస్తున్న పలు వర్గాలవారు ఉగ్రవాద దాడులను ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. భారత భూభాగంలోనికి చొరబడి 20 మంది సైనికు ల ప్రాణాలు హరించిన సంఘటనపై స్పందించిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సైనికులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందన్నారు. ఒక వైపు చర్చలు జరుగుతున్న పరిస్థితుల్లో ఇటువంటి దాడులకు పాల్పడటం సరికాదన్నారు. పాక్‌తో సత్సంబంధాల కో సం భారత్ ప్రయత్నిస్తోందన్నారు.

ప్రత్యేక ప్యాకేజీపై సర్వత్ర హర్షం

బెంజిసర్కిల్, సెప్టెంబర్ 19: విభజనతో నష్టపోయిన నవ్యాంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా అదుకునేందుకు కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి సుజనా చౌదరి తెలిపారు. హోదా కన్నా ప్యాకేజీతోనే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అందుకనే ప్యాకేజీకి అంగీకరించినట్లు చెప్పారు. సోమవారం నగరంలోని బందర్‌రోడ్డులోని హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ప్రకటన పట్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు.

రాజీవ్‌గాంధీ పార్కులో ప్లే ఐటమ్స్ నిర్వహణకు లీజు పొడిగింపు

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 19: నగరంలోని విఎంసికి చెందిన రాజీవ్‌గాంధీ పార్కులో పిల్లలు ఆడుకునే ప్లే ఐటమ్స్ ఏర్పాటు నిమిత్తం పూర్వ లీజుదారుడికి మరో 11నెలల లీజు కాలాన్ని పొడిగించడంతోపాటు చెత్త రవాణా చేసే డంపర్ ప్లేసర్స్ మరమ్మతులకు అయ్యే ఖర్చులకు అనుమతించడమే కాకుండా పలు కీలక అంశాలకు విఎంసి స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. సోమవారం సాయంత్రం విఎంసి కౌన్సిల్ హాల్లో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తొలుత గత స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానాలను ధ్రువీకరిస్తూ తీర్మానించారు.

కొలిక్కొచ్చిన కసరత్తు!

విజయవాడ, సెప్టెంబర్ 19: బందరు ఓడరేవు నిర్మాణం కోసం భూముల సమీకరణపై గత రెండేళ్లుగా జరుగుతున్న కసరత్తు మొత్తంపై కొలిక్కి వచ్చింది. బందరు ఓడరేవు కోసం 5,055 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,284 ఎకరాల భూమిని సమీకరించటానికి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 21 గ్రామాల్లో 14,602 ఎకరాలు పట్టా, 8,958 ఎకరాల అసైన్డ్ 9,778 ఎకరాలు ప్రభుత్వ భూములను సేకరించబోతున్నారు.

వసతిగృహ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు

బెంజిసర్కిల్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో ఉన్న అన్ని వసతి గృహాల్లో విద్యార్థులకు అవసరమైయ్యే అన్ని వసతులను కల్పిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. కృష్ణాపుష్కరాల విజయవంతంలో పాలుపంచుకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా వినియోగించుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. నగరంలోని స్టేట్‌గెస్టు హౌస్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వసతి గృహంలో పాఠశాలల్లో సిసి టివిల పైలెట్ ప్రాజెక్టు కింద పశ్చిమగోదావరి జిల్లా భీమడోలు మండలం పోలసానపల్లి పాఠశాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.

Pages