S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెమ్మలూరు సభలో అవమానపర్చారు

పామర్రు, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నెమ్మలూరు వద్ద సోమవారం బెల్ కంపెనీ విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన తనను అధికార పార్టీ, అధికార యంత్రాంగం అవమానపర్చిందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. గెలిచిన ఎమ్మెల్యేకి గుర్తింపు ఇవ్వకుండా అధికారులు ఓడిపోయిన టిడిపి నేతకు గుర్తింపు ఇవ్వటం సమంజసం కాదన్నారు.

పోలీసు శాఖలో భారీగా బదిలీలు

విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 19: నగర పోలీసు కమిషనరేట్ చరిత్రలో తొలిసారిగా భారీగా ఎస్సైలు, సిఐల బదిలీలు జరిగాయి. కమిషనరేట్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలలో పని చేస్తున్న అధికారులపై ఆరోపణలు ఓ కారణమైతే, లాంగ్ స్టాండింగ్‌లో ఉన్నవారిని కూడ సిపి గుర్తించినట్టు తెలిసింది. దీంతో పాటు ప్రతిరోజు పోలీసు కమిషనరేట్ కార్యాలయానికి వివిధ పోలీసు స్టేషన్లలలో న్యాయం జరగనివారు నేరుగా సిపికి ఫిర్యాదు చేయడం, అక్కడ నుండే ఆయన ఆయా పోలీసు స్టేషన్ల అధికారులపై మండి పడడం వంటివి కూడ బదిలీలకు కారణంగా భావిస్తున్నారు.

వైద్య ఆరోగ్య శాఖ కొరడా

జగదాంబ, సెప్టెంబర్ 19 : పాము కాటుకు గురైన మహిళకు సకాలంలో వైద్యం అందించకపోవడంతో ఆమె మృత్యువాత పడిన ఘటనపై సంబంధిత అధికారులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని ముంచింగ్‌పుట్ మండలం బంగారుమెట్ట పంచాయతీ మాలగుమ్మి గ్రామానికి చెందిన కొర్రా సావిత్రి (32) పాము కాటుకు గురై వైద్యం కోసం సమీప ఆసుప6తికి వెళ్లగా అక్కడ వైద్యం అందించాల్సిన వైద్యుడు, స్ట్ఫానర్స్ లేకపోవడంతో సంఘటనకు కలెక్టర్‌కి అందిన ఫిర్యాదు మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.

వ్యాధులపై యుద్ధం చేయాలి

జగదాంబ, సెప్టెంబర్ 19: డెంగీ, చికెన్‌గున్యా వ్యాధులు పట్టణాల్లోనే ఎక్కువుగా ఉన్నాయని, వాటిపై అంతా కలసి సమరం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది జూన్ నుండి సెప్టెంబర్ వరకు వర్షాలు ఎక్కువుగా కురిసినందున నీటి నిల్వలు పేరుకుపోవడంతో డెంగీ వ్యాప్తి గత ఏడాది కన్నా నూరు శాతం అధికమైందన్నారు. సోమవారం స్థానిక స్వర్ణ్భారతి ఆడిటోరియంలో జీవిఎంసి ఆధ్వర్యంలో ఎస్‌ఎల్‌ఎఫ్ బృంద సభ్యులకు, ఆశా, అంగన్‌వాడీ, శానటరీ, ఏఎన్‌ఎంలకు డెంగీపై అవగాహన సదస్సు నిర్వహించా.

ఉద్యమంలో నిజాయితీ లోపిస్తే ఉనికికే ప్రమాదం!

పాడేరు, సెప్టెంబర్ 19: నిజాయితీతో కూడిన ఉద్యమాలు చేయకపోతే ఉద్యోగులు తమ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, జాయింట్ ఏక్షన్ కమిటీ చైర్మన్ పి.అశోక్‌బాబు హెచ్చరించారు. సోమవారం విశాఖ జిల్లా పాడేరులో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన రాష్టవ్య్రాప్తంగా ఉద్యోగులు ఈ నెల 27న తలపెట్టిన జిల్లా, డివిజన్ స్థాయి ధర్నాల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనలో నిజాయితీ లోపిస్తోందన్నారు.

మాతృభాషలో విద్యాబోధన అవసరం

విశాఖపట్నం, సెప్టెంబర్ 19: అణు, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష తదితర రంగాల్లో పాశ్చాత్యదేశాల ఆధిపత్యానికి కారణం ఆయా దేశాల్లో మాతృభాషలో సాగే విద్యాబోధనే కారణమని లోక్‌నాయక్ ఫౌండేషన్ అధ్యక్షుడు, పద్మభూషన్ పురస్కాల గ్రహీత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. స్విట్జర్లాండ్ తెలుగు సంఘం (టాస్) ఆధ్వర్యం లో, జ్యురిక్ నగరంలో మన తెలుగు సంఘం (మాటా) ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రవాస తెలుగువారితో ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, బ్రిటన్‌లలో వారి మాతృభాషలోనే విద్యాబోధన జరుగుతుందన్నారు. అందుకే వారు ఎన్నో రంగాల్లో దూసుకెళ్తున్నారన్నారు.

చెట్టును ఢీకొన్న కారు

అరకులోయ, సెప్టెంబర్ 19: మండలంలోని మాడగడ పంచాయతీ బోసుబెడ గ్రామ సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పర్యాటకుడు మృతి చెందగా మరో నలుగురు పర్యాటకులు తీవ్రం గా గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరకులోయ పరిసరాల ప్రకృతి అందాలు వీక్షించేందుకు విశాఖపట్నం నుంచి ఐదుగురు స్నేహితులు కలిసి కారులో వస్తుండగా వాహనం అదుపు తప్పి ప్రధాన రహదారి పక్క ఉన్న ఓ చెట్టును ఢీకొట్టింది. మితిమీరిన వేగంతో వస్తుండడంతో వాహనం రెండు పర్యాయాలు పల్టీకొట్టింది. ఈ సంఘటనతో ఖరీదైన కారు నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎ.వి.ఎల్.

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ

బొండపల్లి, సెప్టెంబర్ 19: మొక్కలు పెంపకంతోనే మానవ మనుగడ సాధ్యమని రాష్ట్ర స్ర్తిశిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మండలంలోని కనిమెరక పంచాయతీ శివారు బోడసింగిపేటలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతం తక్కువగా ఉన్నందున అనావృష్టి, అతివృష్టి పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. నాటిన మొక్కలను శ్రద్ధగా సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతి రహిత కేంద్రాలుగా అంగన్‌వాడీలు

బొండపల్లి, సెప్టెంబర్ 19: అవినీతి రహిత కేంద్రాలుగా అంగన్‌వాడీలను తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర స్ర్తి,శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. సోమవారం మండలంలోని బిల్లలవలస, బోడసింగిపేట గ్రామాలలో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్ర భవనాలను మంత్రి సుజాత ప్రారంభించారు. బిల్లలవలసలో జరిగిన సమావేశంలో మంత్రి సుజాత మాట్లాడుతూ ఇప్పటికే కేంద్రాలకు బియ్యం, నూనె ఇతర వస్తువులు ఇ-పాస్ విధానం ద్వారా సరఫరా చేస్తున్నామని, గుడ్లును బయోమెట్రిక్ విధానం ద్వారా సరఫరాకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామీణ ప్రజల్లో అవగాహన లోపంతో మాతా, శిశు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు.

పారిశుద్ధ్య నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్ హెచ్చరించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ అధికారులను ఆయన ఆదేశించారు. పట్టణంలో 24వ వార్డు పరిధిలో విటి అగ్రహారంలో సోమవారం ఉదయం ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని, ప్రతిరోజూ ఉదయం నుంచే వార్డులలో పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు.

Pages